12, జులై 2007, గురువారం

కొత్త మృదులాంత్రాలు ( సాప్ట్ వేర్) - డెస్క్ టాప్ అసిస్టెంట్





ఇంటర్‌నెట్‌లో అనేక వెబ్ పేజీలు డిక్షనరీలుగా పనికి వస్తాయి. మరి కొన్నింటిని ధిసారస్‌లుగా, ఎన్‌సైక్లోపీడియాలుగా వాడుకోవచ్చు. అయితే అవసరమైనప్పుడల్లా ఈ వెబ్‌పేజీల్లోకి వెళ్ళడం, ఒక చోట మనకు లభించిన సమాచారం తృప్తినివ్వకపోతే మరో చోటికి పోవడం కొంచెం కష్టమైన పనే. అందుకే ఇలాంటి అనే రిసోర్సుల్ని ఒకే చోటికి చేర్చి,ఒకే క్లిక్‌తో భాషా అవసరాల్ని, నిఘంటు అవసరాల్ని తీర్చిపెట్టే చిన్న సాఫ్ట్‌వేర్ "డెస్క్‌టాప్ అసిస్టెంట్" .



టాస్క్‌బార్ మీద కుడివైపు సిస్టం ట్రేలో చిన్న పుస్తకం బొమ్మ రూపంలో ఉండే ఈ సాఫ్ట్‌వేర్. ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే చిన్న బాక్స్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. మనం కోరుకున్న పదాలు దాంట్లో టైప్ చేసి,look it up బటాన్ నొక్కినా లేదా enter కీ ప్రెస్ చేసినా www.thefreedictionary.com కి తీసుకుపోతుంది. ఆ పదం అర్ధాన్ని, ఉచ్చారణని, ఇతరవ వివరాలు ఇవ్వడమే కాదు... ఆ పదంతో సంబంధం ఉన్న అనేక ఇతర పదాల్ని, సంబంధిత లింకుల్ని ఆటోమేటిగ్గా ఇస్తుంది. ఉచ్చారణ శబ్దాన్ని వినే సౌకర్యం కూడా ఉంది. ఇంకా మనం తృప్తి పడకపోతే, ఆ పదం ఏ సబ్జెక్ట్‌కి చెందినది అనేదానిని బట్టి కంప్యూటింగ్ మెడికల్,లీగల్, ఫైనాన్షియల్ డిక్షనరీల్లోను, యాక్రోనింస్, ఇడియంస్ డిక్షనరీల్లోనూ ఇంకా ఎన్‌సైక్లోపీడియాలోనూ కూడా ఆ పదాన్ని వెతికి పట్టి సమాచారాన్ని అందిస్తుంది. ఒక వేళ ఇవన్నీ మనకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వకపోతే అక్కడిక్కడే ఆ పదాన్ని గూగుల్‌లో వెతికే వీలు ఉంది. పూర్తి పదాన్ని కాకుండా పదం మొదలును బట్టి చివరను బట్టి కూడా వెతకవచ్చు.వెబ్ ఆధారంగా పనిచేసే ఈ చిన్న సాఫ్ట్‌వేర్ ఎంతో ప్రభావితమైంది. అయితే ఇంటర్‌నెట్ ఉన్నప్పుడే ఈ డిక్షనరీ అసిస్టెంట్ పని చేస్తుంది.


పబ్లిషర్ : Sphinx Software
వెబ్‍సైట్ : www.Sphinx-Soft.com
వెర్షన్ : 1. 0. 2

2 కామెంట్‌లు:

Sitaram Vanapalli@9848315198 చెప్పారు...

శ్రీధర్ గార్కి
మీరు కంప్యూటర్ గురించిన బ్లాగును తెలుగులో వ్రాయడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ బ్లాగులో కంప్యూటర్ గురించి మీరు చెప్పే విషయాలు బావున్నాయి కాని పోస్టుకు టైటిల్ అనేది ప్రాణం. అంటే చదవరులను మీ బ్లాగు వరకూ తీసుకొని వచ్చేవి ఈ టైటిల్సే అటువంటి టైటిలు ను జనానికి(అంటె నాలాంటి వాళ్ళు చాలామంది వుంటారు వారందరిని కూడా ఉద్దేశించి) అర్ధంకాని గ్రాంధికంలో గాని అంతగా పరిచయం లేని పదాలను గాని ఉపయోగించడం వలన మీ బ్లాగులోని విషయాలకు ఎంతోమంది దూరం అయిపోయే అవకాశం వుంది. అంటే బస్సుని బస్సు అని చెబితేనే బాగా అర్ధం అవుతుంది. అలా కాకుండా షట్చక్రవాహనం అని ఉపయోగిస్తే అర్ధం కాదుకదా. మీరు అనవచ్చు ఇది తెలుగు బ్లాగు కదా అందుకే అలా ఇచ్చాం అని. అలా అయితే కంప్యూటర్ ని కంప్యూటర్ అని ఎందుకు వ్రాసారు గణణ యంత్రం అని వ్రాయొచ్చుగా? కాబట్టీ మాలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగుతో బాటు దానికి సమాన అర్ధాన్ని బ్రాకెట్ లో ఇవ్వవలసినదిగా కోరుచున్నాను. మృదులాంత్రములు అంటే సాఫ్ట్ వేర్ అని జ్యోతి గారు చెబితేగాని తెలియలేదు. మీరు మృదులాంత్రములు(సాఫ్ట్ వేర్) అని ఇస్తే బావుంటుందేమో ఆలోచించండి.
Sitaram. Vanapalli
www.telugusnehithulu.blogspot.com

netizen నెటిజన్ చెప్పారు...

అవును. అర్ధం కాలేదు. ఆ పదానికి అర్ధం తెలుసుకోవడానికి ఇంత దూరం రావల్సివచ్చింది.పోనిలెండి ఒక కొత్త తెలుగు పదం దొరికింది.