15 సెప్టెంబర్ 2014 సోమవారం

లాప్‌టాప్ కొనాలా? డెస్క్‌టాప్ కొనాలా? ఏది బెస్ట్? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nKtqiiIM6JQ

కొత్తగా కంప్యూటర్ కొనాలనుకుంటున్నారా?

అయితే "లాప్‌టాప్ కొనాలా? Desktop కొనాలా? వీటిలో ఏది బెస్ట్? ఎలాంటి వాళ్లకు ఏది సూటబుల్ అవుతుంది.." వంటి విషయాలు తెలుసుకోకుండా వేలాది రూపాయలు వేస్ట్ చెయ్యకండి.

ఈ వీడియోలో లాప్‌టాప్‌లకూ, డెస్క్‌టాప్‌లకూ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం గురించి చాలామందికి తెలీని అనేక విషయాల్ని డిస్కస్ చెయ్యడం జరిగింది.

కొత్త కంప్యూటర్ కొనేముందు ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ ఇది చూస్తే మీ డబ్బు వృధా కాదు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ Friendsతోనూ షేర్ చెయ్యగలరు.ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nKtqiiIM6JQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

11 సెప్టెంబర్ 2014 గురువారం

మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడిపోతాడు…. నమ్మబుద్ధి కావట్లేదా…? Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7dhBYj19-SE

మీ ఫోన్‌ని కాపాడుకోవడానికి మీరు జీవితంలో రకరకాల సాఫ్ట్‌వేర్లు వాడి చూసుంటారు…..

ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించినంత టెక్నిక్‌ని మించినది మాత్రం ఏం ఉండదు….

ఈ వీడియో చూసి నేను చెప్పినట్లు చేస్తే మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడాలి :P

ఫోన్ పోయినప్పటి నుండి ఆ ఫోన్ సరిగ్గా ఎక్కడుందో, దొంగ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో కనిపెట్టేయొచ్చు…

అతను ఏ నెంబర్లకి ఫోన్లు చేస్తున్నాడో, SMSలు చేస్తున్నాడో ఆ మెసేజ్‌ల వివరాలతో సహా మీ కంప్యూటర్ స్క్రీన్ మీదే చూసేయొచ్చు.

దొంగ తన ఫ్రెండ్స్‌తో కూర్చుని ఖుషీ చేసుకుంటుంటే… అతనికి తెలీకుండా వారందరి ఫొటోలూ తీయొచ్చు…. వీడియో తీయొచ్చు…. వాళ్లేం మాట్లాడుకుంటున్నదీ ఆడియో రికార్డ్ చేసి వెంటనే మన మెయిల్‌కి పొందొచ్చు….

వాళ్ల ఫ్రెండ్స నెంబర్లు మనకు తెలుస్తుంటే… అతనెక్కడ తిరుగుతున్నాడో క్షణం క్షణం మనకు తెలుస్తుంటే… సిమ్‌ మార్చేసినా ఉపయోగం లేకపోతే… చివరకు దొంగ ఫొటో, వీడియో, మాటలూ, SMS మెసేజ్‌లూ కూడా మనకు వచ్చేస్తుంటే….. ఇంకా పోలీస్ కంప్లయింట్లెందుకు…? నేరుగా మనమే ఓ అరగంటలో పట్టుకోలేమా….?

నేనైతే గత ఏడాదిన్నరగా ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను… ఎక్కడైనా ఫోన్ మర్చిపోయి వచ్చినా అస్సలు భయం లేదు…. నాకెందుకు భయం…. దొంగ భయపడాలి గానీ :P

ఖరీదైనవీ, మామూలువీ రకరకాల ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని “ఖచ్చితంగా” మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చేసి వారి ఫోన్లనీ కాపాడండి…

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7dhBYj19-SE

గమనిక: ఈ సాఫ్ట్‌వేర్‌ని uninstall చెయ్యకుండానూ, Factory Reset చేసినా పోకుండానూ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాని కోసం ఫోన్ రూట్ చేయాల్సి ఉంటుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

9 సెప్టెంబర్ 2014 మంగళవారం

మీ ఫోన్‌లో కంపెనీ updates రావట్లేదా? TWRP రికవరీని ఇలా వాడి ఫ్లాష్ చేసుకోవచ్చు .. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aGU4MSUnaq8

సహజంగా మనం ఫోన్లు కొన్నప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్ తప్పించి ఆ తర్వాత ఆయా ఫోన్లకి కొత్త updates ఇవ్వడంలో కంపెనీలు అశ్రద్ధ చేస్తుంటాయి. ఈ నేపధ్యంలో కొద్దిపాటి అవగాహన ఉన్న వారు చాలామంది తమ ఫోన్ మోడల్ కోసం తయారు చెయ్యబడిన ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ల custom ROMలను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటారు.

ఇలా custom romలను ఫ్లాష్ చెయ్యడానికి ఎక్కువమంది ఉపయోగించే పద్ధతి Clockwork Mod. ఇది ఇప్పుడు పాతబడిపోయింది. అంతకన్నా పవర్‌ఫుల్‌గా, టచ్‌తో ఆపరేట్ చెయ్యగలిగేలా TWRP రికవరీ ఇటీవల విరివిగా వాడబడుతోంది.

ఈ నేపధ్యంలో TWRP రికవరీని ఎలా వాడాలో, దాని ద్వారా ఫోన్‌లోకి కొత్త updatesలను ఎలా ఫ్లాష్ చేయాలో, ఫోన్‌ని ఉన్నది ఉన్నట్లు ఎలా బ్యాకప్ తీయాలో దానిలోని ఆప్షన్లు మొత్తాన్నీ వివరంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: కేవలం రూటింగ్, ఫ్లాషింగ్‌లపై ఇప్పటికే అవగాహన ఉన్న వారికి మాత్రమే ఇది కొంతవరకూ అర్థమవుతుంది. ఒక ఫోన్‌ని ఎలా రూట్ చెయ్యాలో కూడా గతంలో నేను ఈ లింకులో చూపించడం జరిగింది. మీ అవగాహన కోసం https://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw  అనే రూటింగ్ లింక్ చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aGU4MSUnaq8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu