31, జులై 2007, మంగళవారం

Deep Freezeతో సిస్టంకి పూర్తి స్థాయి రక్షణ


http://www.faronics.com/ అనే వెబ్‌సైట్‌లో లభించే DeepFreeze అనే సాప్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే వైరస్‌లు, సిస్టమ్ క్రాష్‌లు, అప్లికేషన్ ఎర్రర్లు వంటి ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి కంప్యూటర్‌ని రీస్టార్ట్ చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒకటికన్నా ఎక్కువ హార్డ్‌డిస్క్‌లను సైతం ఇది సపోర్ట్ చేస్తుంది. FAT16, FAT32, NTFS వంటి అన్ని ఫైల్ సిస్టమ్‌లకు చెందిన డ్రైవ్‌లను ఇది ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కేవలం 2MB మాత్రమే హార్డ్‌డిస్క్ స్పేస్‌ను ఆక్రమించుకునే ఈ ప్రోగ్రామ్ ఎల్లప్పుడూ పార్టీషన్లను మోనిటర్ చేస్తూ పార్టీషన్ లలో చోటుచేసుకునే మార్పులను , కొత్తగా చేరిన సెట్టింగులను తొలగించి డిస్క్‌లను పూర్వస్థితికి తీసుకువెళ్తుంది. ఈ నేపధ్యంలో ఒక్కోసారి కొంత డేటాని నష్టపోవల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. అందుకే మీరు ఏ పార్టీషన్ నైతే మోనిటర్ చేయమని సెట్ చేశారో ఆ పార్టీషన్లో ముఖ్యమైన ఫైళ్లని సేవ్ చేయకండి. ఇతర పార్టీషన్లలో సేవ్ చేసుకోండి. పలు ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న డ్రైవ్ లను సైతం ఇది మోనిటర్ చేయగలుగుతుంది. Win 95 నుండి XP, Vista వరకు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై రన్ అవగలిగే ఈ సాప్ట్ వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఏయే పార్టీషన్లని మోనిటర్ చేయమంటారని కోరుతుంది. మనం ఎంచుకున్న పార్టీషన్లకు మాత్రమే ఇక ముందు ప్రొటెక్షన్ లభిస్తుంది.

కామెంట్‌లు లేవు: