31, అక్టోబర్ 2013, గురువారం

Firefox Addons పిసిలో సేవ్ చేసుకోవడం ఇలా... Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE

మీకు కేటాయించవలసిన సమయం: కేవలం 55 Secs..

మీరు రెగ్యులర్‌గా వాడే Firefox addonsని మీ పిసిలో డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకోవచ్చని తెలుసా?

నెట్ కనెక్షన్ లేనప్పుడు వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

గమనిక: పిసి ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

29, అక్టోబర్ 2013, మంగళవారం

లైఫ్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=BRWSNnekaPs

బిజీ లైఫ్‌లైపోయాయి మనవి.. ఏదీ అనుకున్నట్లు అనుకున్న టైమ్‌కి పూర్తికాక పని వత్తిడితో చాలా బాధపడుతూ ఉన్నాం...

చేయాల్సిన పనులను ప్రయారిటీ ప్రకారం అమర్చుకోవడం, వాటికి టైమ్ స్లాట్లని ప్లాన్ చేసుకోవడం చేయగలిగితే చాలావరకూ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది.

ఇలా చేయాల్సిన పనుల్ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన ప్రోగ్రామ్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.

దీనితో మీరు కాంటాక్టులూ సేవ్ చేసుకోవచ్చు.. రోజూ డిజిటల్ డైరీ రాసుకోవచ్చు... అతి ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను కూడా ఇందులోనే సేవ్ చేసుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=BRWSNnekaPs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

28, అక్టోబర్ 2013, సోమవారం

మీరు విండోస్‌ 7, 8లలో ఉండగానే రీబూట్ చెయ్యకుండానే Win XP, 7, 8, Linuxలను వాడుకోవచ్చని తెలుసా ? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=wmWJn__HWGM

పాత సాఫ్ట్‌వేర్లు పనిచేయవేమోనని భయపడి చాలామంది Windows 7, 8, 8.1 వంటివి వచ్చినా Windows XP వంటి పాత వాటితోనే సరిపెట్టుకుంటూ ఉంటారు.

కొందరైతే dual bootingలో కావలసిన అన్ని OSలూ వేసుకుంటూ ఉంటారు.

ఇంత గొడవేం లేకుండా మీరు వాడుతున్న Windows 7, Windows 8 వంటి వాటిలోనే మీకు Win XP, Vista, 7, 8, Linux వంటి వెరైటీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు అన్నీ.. రీస్టార్ట్ చెయ్యాల్సిన పనిలేకుండానే లోపలే రన్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?

మీరూ ఇలా చేయాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది.. ఎంత ఈజీగా MS Word వంటి మామూలు అప్లికేషన్ల మాదిరిగా విండోస్‌లో ఉండగానే మరో ఆపరేటింగ్ సిస్టమ్ వాడేసుకోవచ్చో..!!

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=wmWJn__HWGM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అందరి దగ్గరా ఉన్న ఫొటోలూ ఒకే ఆల్బమ్‌లో కావాలా? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7_1sDJVu9VQ

మీరు వెచ్చించవలసిన సమయం: 1.38 Secs

మీరు మీ బంధువులతోనూ, స్నేహితులతోనూ ఓ పెళ్లిలోనో, బర్త్‌డే‌లోనో, లేదా మరో స్పెషల్ ఈవెంట్‌లోనో కలిసి హాపీగా గడిపారనుకుందాం..

మీ ఫ్రెండ్స్ అందరి దగ్గరా సెల్‌ఫోన్లో, కెమెరాలో ఉంటున్నాయి కాబట్టి ఎవరికి వారు రకరకాల ఏంగిల్స్‌లో ఫొటోలు తీసేసి వారి ఫేస్‌బుక్‌లో వారి స్వంత timelineలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అందరి కోసం ఓ ఆల్బ‌మ్ క్రియేట్ చేసి.. మీరు పర్మిషన్ ఇచ్చిన మీ ఫ్రెండ్స్ అందరూ ఆ ఆల్బమ్‌లోకి వారి దగ్గర ఉన్న ఫొటోలు అప్‌లోడ్ చేయగలిగేలా చేస్తే.. అందరి కెమెరాలతో తీసిన అన్ని ఫొటోలూ ఒక్కచోటే అందరూ చూసేయొచ్చు కదా?

ఈ ఆలోచన చాలా బాగుంది కదా.. అయితే దీన్ని వాడడం ఎంత సింపులో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

గమనిక: మొబైల్, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7_1sDJVu9VQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

27, అక్టోబర్ 2013, ఆదివారం

C డ్రైవ్ నిండిపోతోందా? ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రాముల్ని వేరే డ్రైవ్‌లకు మూవ్ చేసుకోవడం ఇలా.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw

చాలామంది తెలిసీ తెలియక C డ్రైవ్‌కి తక్కువ స్పేస్ కేటాయిస్తుంటారు. కొన్నాళ్లకు Drive Full అని వార్నింగులు వస్తుంటాయి.

అలాంటప్పుడు ఇప్పటికే ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రాముల్ని Uninstall చెయ్యాల్సిన పనిలేకుండానే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా ఈజీగా వేరే డ్రైవ్‌లోకి ఉన్నవి ఉన్నట్లు మూవ్ చేసుకోవచ్చు.

అలా మూవ్ చేసిన అప్లికేషన్లు ఇంతకుముందు లానే నిక్షేపంగా పనిచేస్తాయి.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

26, అక్టోబర్ 2013, శనివారం

బ్లూ స్క్రీన్ ఎర్రర్లు వస్తున్నాయా? సిస్టమ్ బాగా స్లో అయిపోతోందా? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo

సీరియస్‌గా ఏదో పనిలో ఉంటే కంప్యూటర్ ఉన్న ఫళంగా రీస్టార్ట్ అయిపోతే అప్పటిదాకా చేసిన పనేం కావాలి? ఎంత బాధగా ఉంటుందో కదా!

అలాగే చాలా పవర్‌ఫుల్ కంప్యూటర్ వాడుతూ కూడా సిస్టమ్ చాలా స్లో అయిపోతే ఆ బాధ ఎవరితో చెప్పుకుంటాం.. చాలామంది ఇలా స్లో అవడానికి కారణాలు తెలుసుకోక అలాగే నెట్టుకొస్తుంటారు.

కంప్యూటర్లోని RAMలో లోపాలు పిసి స్లో అవడానికీ, కొన్ని క్షణాలు ఫ్రీజ్ అవడానికీ, బ్లూ స్క్రీన్లు వచ్చి పిసి రీస్టార్ట్ అవడానికీ కారణం అవుతుంటాయి.

ఈ నేపధ్యంలో RAMలోని లోపాలు గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి. ఇలా ఛెక్ చేశాక మీ కంప్యూటర్లో RAMలో లోపం ఉంటే దాన్ని వారెంటీలో ఉంటే ఉచితంగా రీప్లేస్‌మెంట్ కోరవచ్చు. చాలామందికి ఈ విషయాలు తెలియదు.

ఈ వీడియోలో మీ RAMలోని లోపాలను ఎలా గుర్తించాలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: కంప్యూటర్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

25, అక్టోబర్ 2013, శుక్రవారం

మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఇతరులు వాడకుండా ఇలా లాక్ చేసుకోండి.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KniQfu3S_tM

వై-ఫై కావచ్చు... 2G, 3G ఇంటర్నెట్ కనెక్షన్లకి చాలానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది..

అయితే కొంతమంది పిల్లలూ, అలాగే ఫ్రెండ్స్, రెలెటివ్స్ ఫోన్, టాబ్లెట్ చేతిలోకి తీసుకుని ఆన్‌లైన్ గేమ్స్ ఆడడమో, లేదా Youtube వీడియోలు చూడడమో చేస్తూ దెబ్బకు ఉన్న బ్యాండ్‌విడ్త్‌నంతా వాడేస్తుంటారు.

అలాగని వారికి ఫోన్ ఇవ్వకుండానూ ఉండలేం.. ఇస్తే ఇదో తంటా.. తర్వాత బాధపడీ లాభం లేదు!!

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ మీకు బాగా పనికొస్తుంది.. మీ WiFi, Mobile Dataలను పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకోవచ్చు. ఇకపై ఎవరైనా నెట్ ఆన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే నెట్ వాడగలుగుతారు. సో ఇక చాలా సేఫ్ అన్నమాట. మరి ట్రై చేద్దామా?

గమనిక: మొబైల్, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KniQfu3S_tM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

24, అక్టోబర్ 2013, గురువారం

వందలూ, వేల కొద్దీ SMSలు పంపించడం ఎలా ? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM

5 నిమిషాల్లో కొన్ని వందల నుండి వేల మందికి SMSలు పంపాలనుకుంటున్నారా?

రకరకాల సర్వీసుల నుండి మనకు వచ్చే Bulk SMSలు అస్సలు ఎలా పనిచేస్తాయి.. మీరూ ఓ బెస్ట్ పద్ధతిని ఎంచుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

పండగలప్పుడూ మీ ఆత్మీయులందరికీ విషెస్ తెలపడానికీ.. మీ వ్యాపార అవసరాలకు కస్టమర్లతో టచ్‌లో ఉండడానికీ, ఇంకా పలు రకాలుగా ఉపయోగపడే Bulk SMS Gatewayల గురించి వివరంగా ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

SMSలు పొందడమే తప్ప అంత భారీ మొత్తంలో ఎలా పంపుతారో తెలీని వారికి ఈ వీడియో అవగాహన కలిగిస్తుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

ఫొటోషాప్‌లో ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత కూడా ఎడిట్ చేయాలా? అయితే Smart Objects ఎలా వాడాలో ఇక్కడ చూడండి Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=F0z9VaDclgE

చాలా చిన్న టెక్నిక్.. బట్ చాలా పవర్‌ఫుల్..

ఫొటోషాప్ నేర్చుకునే, వాడే ప్రతీ ఒక్కరూ Smart Objects గురించి తెలుసుకుని తీరాలి..

లేదంటే text వంటి వాటికి ఎఫెక్టులు అప్లై చేశాక వాటిని మార్చడం కుదరదు. అదే Smart Objectగా మార్చేస్తే ఎఫెక్టులు అప్లై చేశాక కూడా ఆ textలో అక్షరాలు మార్చుకోవచ్చు.

Smart Objects అంటే ఏమిటి, అదెలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: ఫొటోషాప్‌పై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=F0z9VaDclgE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

అద్భుతమైన ఫొటోలు రావాలంటే ఎలాంటి కెమెరా కొనాలి ? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Wm-bjVO3mJ0

చాలామంది ఎక్కువ మెగాపిక్సెళ్లు ఉంటే చాలు.. దాన్ని గొప్ప కెమెరాగా అనేసుకుంటారూ.. కొనేసుకుంటారూ కూడా

కెమెరాల్లో చాలా రకాలున్నాయి.. కొన్ని కొందరికే సూటబుల్.. జేబులో పట్టేలా ఉంటే చాలని కాంప్రమైజ్ అయితే అద్భుతమైన ఫొటోలు అస్సలు సాధ్యం కావు..

అస్సలు డిజిటల్ కెమెరాల్లో రకాలేంటో ప్రాక్టికల్‌గా చూపిస్తూ.. ఏవి ఎవరికి సూటబుల్ అవుతాయో ఈ వీడియోలో వివరంగా చూపించాను.

గమనిక: డిజిటల్ కెమెరా కొనాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Wm-bjVO3mJ0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

23, అక్టోబర్ 2013, బుధవారం

మీ విలువైన డేటా ఉన్న RAR ఫైళ్లు కరప్ట్ అయితే ఎలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=oVEVIQS8UYQ

మీరొక RAR ఫైల్‌ని డబుల్ క్లిక్ చేసి.. అందులో డేటా వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు.. కానీ File Corrupt అయిందని వార్నింగ్ వస్తే ఎంత బాధ అన్పిస్తుంది?

ముఖ్యమైన ఫొటోలూ, డాక్యుమెంట్లూ WinRARతో కంప్రెస్ చేసి ఫ్రెండ్స్‌కి పంపిస్తుంటారు చాలామంది...

మీ ఫైళ్లు కరప్ట్ అవకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోపోతే ఆ డేటా మొత్తం నష్టపోతారు కదా?

అందుకే ప్రతీ ఒక్కరికీ పనికి వచ్చే ఈ వీడియోలో 99% మంది పిసి యూజర్లకి తెలీని ఓ అరుదైన టెక్నిక్ వివరించడం జరిగింది.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=oVEVIQS8UYQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

22, అక్టోబర్ 2013, మంగళవారం

Pen Drive వైరస్‌ల వద్ద బాధ పడుతున్నారా? ఇదిగోండి బెస్ట్ సొల్యూషన్ Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=USrNH9crMqA

పెన్‌డ్రైవ్‌ల ద్వారా కుప్పలు తెప్పలుగా వైరస్‌లు వచ్చి పడుతుంటాయి...

ఫ్రెండ్ కంప్యూటర్ నుండి స్టడీ మెటీరియల్ కాపీ చేసుకుందామనో.. ఇంటర్నెట్ సెంటర్‌లో సిస్టమ్‌కో పెన్‌డ్రైవ్‌ని గుచ్చడం ఆలస్యం ప్రమాదకరమైన వైరస్‌లు ఎక్కేస్తుంటాయి.

అందుకే చాలామంది పెన్‌డ్రైవ్ వాడాలంటేనే భయపడుతుంటారు.. కానీ వాడక తప్పని పరిస్థితి.

పెన్‌డ్రైవ్ వైరస్‌ల మూలంగా Folder Options, Task Manager వంటివి పనిచెయ్యవు. విండోస్‌లో అతి ముఖ్యమైన ఇతర అంశాలూ పనిచేయడం నిలిచిపోతాయి.

అలాంటి అన్ని సమస్యలనూ ఓ చిన్న సొల్యూషన్‌తో ఎలా పరిష్కరించుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: అనునిత్యం పెన్‌డ్రైవ్‌లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=USrNH9crMqA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

20, అక్టోబర్ 2013, ఆదివారం

మీ విండోస్ You may be a victim of software counterfeiting అని అంటోందా? ఇలా సాల్వ్ చేసుకోండి Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=_PfxTYCvurQ

చాలామంది పైరేటెడ్ విండోస్‌నే వాడుతూ ఉన్నారు.. కంప్యూటర్‌ని ఆన్ చేసిన వెంటనే విండోస్ You may be a victim of software counterfeiting అని వార్నింగ్ చూపిస్తోందనీ... వాల్‌పేపర్ కూడా బ్లాక్ కలర్‌లో మారిపోతోందనీ చెప్తుంటారు...

ఇలాంటి వార్నింగ్ మెసేజ్‌లేవీ సిస్టమ్ ట్రేలోనూ, విండోస్ లాగాన్ స్క్రీన్‌లోనూ రాకుండా చెయ్యడానికి ఈ వీడియోలో నేను ఓ టెక్నిక్ చూపించడం జరిగింది. అది ఫాలో అయితే చాలు వార్నింగులూ రావు, మీకు నచ్చిన వాల్‌పేపర్ సెట్ చేసుకోవచ్చు.

Note: ఈ టెక్నిక్ ద్వారా మీ విండోస్ జెన్యూన్ ఏమీ అయిపోదు.. కాకపోతే మీరు పైరేటెడ్ వాడుతున్నారని వార్నింగ్‌లు మాత్రం రావంతే!!

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=_PfxTYCvurQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

18, అక్టోబర్ 2013, శుక్రవారం

మీ ఫొటోలో మీకు కావలసిన ఏరియా కలర్‌లో మిగతా బ్లాక్ అండ్ వైట్‌లో కావాలా? ! Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=rbEZkXNX7xY

జ్యూయలరీ షాపుల అడ్వర్‌టైజ్‌మెంట్లు ఎప్పుడైనా చూశారా?

మోడల్ ఒంటినిండా నగలు ధరించి ఉంటుంది.. ఆ నగల వరకూ చాలా స్పెషల్‌గా కలర్‌లో కన్పిస్తూ మిగతా ఫొటో మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో కన్పిస్తుంది.

ఇలాంటి టెక్నిక్‌లు చాలా ఈజీగా చేయొచ్చు.. అది ఎంత ఈజీనో ఈ వీడియో చూస్తే మీకూ అర్థమవుతుంది. మీ ఫొటోలపై మీరూ ఓ 10 నిముషాల్లో మీకు నచ్చినట్లు ఎఫెక్ట్ పొందొచ్చు.

ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికీ సులభంగా అర్థమయ్యే విధంగా దీన్ని ప్రిపేర్ చెయ్యడం జరిగింది. సో చూసేయండి మరి!

గమనిక: ఫొటోగ్రఫీ, ఫొటోషాప్‌లపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=rbEZkXNX7xY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
http://n9telugu.com/

17, అక్టోబర్ 2013, గురువారం

DLL ఫైల్ మిస్సింగ్ అని వార్నింగులు వస్తున్నాయా? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=NDH3mxhNHv4

కంప్యూటర్‌ని ఆన్ చేసిన వెంటనే ఫలానా DLL ఫైల్ మిస్ అయిందంటూ ఎర్రర్ మెసేజ్‌లు రావడం చాలామందికి తెలిసిందే.

చివరకు కొన్ని సాఫ్ట్‌వేర్లని రన్ చెయ్యడానికి ట్రై చేసినా ఇలాంటి ఎర్రర్లు వస్తుంటాయి.

అస్సలు ఇలాంటి ఎర్రర్లు ఎందుకు వస్తుంటాయి, వీటికి సొల్యూషన్ ఏమిటి, DLL ఫైళ్లని విండోస్‌లో ఏ టెక్నీషియన్ సాయం లేకుండానే మనకు మనం రిజిస్టర్ చేయడం ఎలాగన్నది ఈ వీడియో ట్యుటోరియల్‌లో చూపించడం జరిగింది.

గమనిక: కంప్యూటర్, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=NDH3mxhNHv4

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

15, అక్టోబర్ 2013, మంగళవారం

వైరస్‌లు విండోస్‌కి మాత్రమే అని అనడంలో వాస్తవం ఎంత? తెలుసుకుందాం



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EthUk1MvkHM

"విండోస్ వాడే వారికి మాత్రమే వైరస్‌లు వస్తాయి.." అని అనేక సంవత్సరాలుగా ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది....

అస్సలు దీనిలో వాస్తవం ఎంతో చాలా స్పష్టంగా ఈ వీడియోలో వివరించాను..

"ఎందుకు విండోస్‌లోనే మనం ఎక్కువ వైరస్ అనే పదం వింటాం..." అన్న దానికీ సహేతుకమైన కారణాలను తెలియజేయడం జరిగింది...

కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EthUk1MvkHM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://n9telugu.com/

11, అక్టోబర్ 2013, శుక్రవారం

మీ పేరు మీద వెబ్‌సైట్ రిజిస్టర్ చేసుకోవాలా? అయితే ఇది తప్పక చూడాల్సిందే! Must Watch & Share


మీ పేరు మీద వెబ్‌సైట్ రిజిస్టర్ చేసుకోవాలా? అయితే ఇది తప్పక చూడాల్సిందే! Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=W-SV0pMxnj4

స్వంతంగా వెబ్‌సైట్ కలిగి ఉండాలని చాలామందికి ఉంటుంది. అయితే తమకు కావలసిన పేరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలీక కొందరు ఆగిపోతుంటారు, మరికొందరు ఇతరులపై ఆధారపడుతుంటారు.

అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిందీ వీడియో. ఇది చూస్తే 2-3 నిముషాల్లో మీరు కోరుకున్న వెబ్‌సైట్‌ని మీకు కావలసినన్ని ఏళ్లపాటు రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికీ సులభంగా అర్థమయ్యే విధంగా దీన్ని ప్రిపేర్ చెయ్యడం జరిగింది. సో చూసేయండి మరి!

గమనిక: స్వంత వెబ్‌సైట్ కలిగి ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=W-SV0pMxnj4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
http://n9telugu.com/

10, అక్టోబర్ 2013, గురువారం

వేలు పెట్టి కొన్న మీ ఫోన్ గురించి మీకు ఎంత తెలుసు? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WoqXXzw_Qeg

చాలామంది వేల రూపాయలు పెట్టి రకరకాల మోడళ్ల ఫోన్లు కొంటుంటారు గానీ... కనీసం తమ ఫోన్‌లో ఏ ప్రాసెసర్ వాడబడిందీ, అందులో ఎన్ని cores ఉన్నాయీ, RAM ఎంతుందీ, గ్రాఫిక్ చిప్ ఏది వాడబడిందీ, ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ స్టోరేజ్ ఎంతా, అలాగే GPS, Compass వంటి సెన్సార్ల

గురించీ ఏ వివరాలూ తెలుసుకోరు.

ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ ఫోన్, టాబ్లెట్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇకపై ఎవరైనా మీ ఫోన్ డీటైల్స్ అడిగితే నోరెళ్లబెట్టకుండా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతారు...!!

గమనిక: మొబైల్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WoqXXzw_Qeg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
http://n9telugu.com/

5, అక్టోబర్ 2013, శనివారం

సరుకులు కొనడానికి కిరాణా స్టోర్‌కి వెళ్లే టైమ్ కూడా లేదా? అయితే ఇది బెస్ట్ సొల్యూషన్




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM

ఇంటి, ఆఫీస్ పనులతో బిజీ బిజీగా ఉండే వాళ్లు పనిగట్టుకుని మరీ కిరాణా షాప్‌కి వెళ్లి సరుకులు కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది.

కొన్ని కిరాణా షాపుల వాళ్లు ఫోన్‌లో ఆర్డర్ తీసుకుని హోమ్ డెలివరీ ఇస్తున్నా ఆయా సరుకుల క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలీదు. తీరా ఆర్డర్ ఇచ్చి వస్తువులు వచ్చాక చీప్ క్వాలిటీతో ఉన్నాయని బాధపడుతుంటాం.

ఇలాంటి సమస్యలు అన్నింటికీ ఓ మంచి పరిష్కారాన్ని ఈ వీడియోలో చూపించాను. ఇందులో చూపించిన ఆన్‌లైన్ సూపర్ మార్కెట్లో బియ్యం దగ్గర్నుండీ, కూరగాయలూ, పళ్లూ, పేస్ట్‌, షాంపూల వంటి అన్ని వస్తువుల క్వాలిటీని ఫొటోల్లో చూసి ఆర్డర్ చేసి నేరుగా ఇంటికి తెప్పించుకోవచ్చు.

బయట షాపుల్లో ఉన్న ధరల కన్నా కొద్దిగా చవక ధరలు కూడా పొందొచ్చు.

గమనిక: టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu