18, జులై 2007, బుధవారం

పదాలు చెప్పే కథలు

Shell: యూజర్‌కి ఆపరేటింగ్ సిస్టమ్‌కి మధ్య పనిచేసే సాప్ట్ వేర్‌నే షెల్ అంటారు. ఉదా.కు. MS-DOS ఆపరేటింగ్ సిస్టమ్‌నే తీసుకుంటే COMMAND.COM అనే షెల్ ప్రోగ్రామ్ స్క్రీన్‌పై promptని ప్రదర్శిస్తూ యూజర్ కమాండ్లు టైప్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంటుంది. పిసి యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కమ్యూనిటికేట్ చెయ్యడానికి వీలు కల్పించే ప్రతీ అంశం "షెల్" క్రిందికే వస్తుంది.

Shockwave: మాక్రోమీడియా సంస్థచే డెవలప్ చేయబడిన మల్టీ మీడియా ప్లేయర్‌నే shockwave player అంటాఅరు. షాక్‌వేవ్ ఫైళ్ళని క్రియేట్ చెయ్యడానికి Macromedia Director వంటి ప్రోగ్రాములని ఉపయోగిస్తారు. ప్రధానంగా ఇంటరాక్టివ్ గేమ్‌లను డెవలప్ చేయడానికి ఈ ఫార్మేట్ ఎంతో అనుగుణంగా ఉంటుంది.

Shortcut: ఒక ఫైల్, ఫోల్డర్ లేదా ప్రోగ్రామ్‌కి ప్రాతినిధ్యం వహిస్తూ డెస్క్‌టాప్‌పై గానీ, Quick launch bar లేదా Start మెనూల్లోగానీ, వివిధ ఫోల్డర్లలో గానీ పొందుపరచబడి ఉండే ఐకాన్లని షార్ట్‌కట్‌లుగా వ్యవహరిస్తారు. షార్ట్ కట్ ని క్లిక్ చేసినప్పుడు ఒరిజినల్ ప్రోగ్రాం యొక్క పాత్ గుర్తించబడి ఒరిజినల్ ప్రోగ్రాం/ఫైల్ ఓపెన్ చెయ్యబడుతుంది.

Shotgun debugging: ఒకేసారి పలు పరిష్కారాలను పరిగణనలోకి తీసుకుని ఏదైనా ప్రోగ్రామ్/హార్డ్‌వేర్/సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరిచెయ్యడానికి ప్రయత్నించడాన్ని "షాట్‌గన్ డీబగ్గింగ్" అంటారు. ఉదా.కు.. స్క్రీన్‌పై డిస్‌ప్లే రానప్పుడు క్యాబినెట్‌ని విప్పదీసి RAM మాడ్యూళ్ళని తొలగించి తిరిగి అమర్చడం, అదే సమయంలో హార్డ్‌డిస్క్ IDE, SATA కనెక్టర్లను రీకనెక్ట్ చెయ్యడం వంటి పలు పనుల్ని ఒకేసారి చెయ్యడం వల్ల ప్రాబ్లెం సాల్వ్ కావచ్చు. అయితే ఏ అంశం ప్రాబ్లెంకి దారి తీసిందన్నది మాత్రం గుర్తించలేం. ఇలా గుడ్డిగా డీబగ్ చెయ్యడాన్నే Shotgun Debugging అంటారు.

Shovelware: ఇతర వెబ్‌సైట్ల ద్వారా గానీ, ఫోరమ్‌ల నుండి గానీ సమాచారాన్ని సేకరించి డిజైనింగ్ వంటి ఏ అంశం గురించి ఆలోచించకుండా మరో వెబ్‌సైట్‌లో అదే సమాచారాన్ని ఉన్నది ఉన్నట్ట్లు పొందుపరచడాన్ని Shovelware అంటారు. ఆ సమాచారం ఎవరికి ఉపయోగపడుతుంది, డిజైనింగ్ ఎలా ఉండాలి వంటి అంశాలపై ఎటువంటి దృష్టి ఇలా చేసేటప్పుడు తీసుకోవడం జరగదు.

Show Control: హార్డ్‌వేర్, సాప్ట్ వేర్‌లచే నియంత్రించబడే లైటింగ్, సౌండ్, విజువల్ ఎఫెక్టులు తదితరాలు అందించే కంప్యూటర్ సిస్టమ్‌ని Show Control అంటారు.ఈ సిస్టమ్ DMX512, MediaLink,MIDI, SMPTE వంటి పలు టెక్నాలజీలను కలిగి ఉంటుంది.

కామెంట్‌లు లేవు: