11, జులై 2007, బుధవారం

డివైజ్ డ్రైవర్లు లేవా.. ఆందోళన చెందకండి

మీరొక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ని కొన్నారు. అయితే డ్రైవర్ల సిడి మాత్రం మిస్ అయింది. మరి అలాంటప్పుడు మదర్ బోర్డ్, సౌండ్, డిస్ ప్లే, లాన్ కార్డ్ డ్రైవర్లు ఎలా ఇన్ స్టాల్ చేస్తారు.. కష్టం కదూ? కొంతమంది కొత్తగా కొన్న కంప్యూటర్ యొక్క డ్రైవర్ల సిడిని కూడా కొద్దికాలానికే పారేసుకుంటారు. అలాంటివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్ పై www.pcdrivers.com అనే వెబ్ సైట్లో అన్ని రకాల పాత, కొత్త హార్డ్ వేర్ పరికరాల డివైజ్ డ్రైవర్లు ఒకేచోట లభిస్తున్నాయి. మీరు చేయవలసిందల్లా మీ హార్డ్ వేర్ పరికరం యొక్క మోడల్ని ఎంచుకుని దాని డ్రైవర్ని డౌన్ లోడ్ చేసుకోవడమే. 40 వేలకు పైగా డివైజ్ డ్రైవర్లు ఉన్నాయిక్కడ!


4 కామెంట్‌లు:

worthlife చెప్పారు...

శ్రీధర్ గారూ...

కంప్యూటర్, ఇంటర్నెట్ వాడకానికి సంబంధించి చాలా మంచి కథనాలను అందిస్తున్నారు. మీకోసం ఈ బ్లాగ్ రూపొందించిన జ్యోతి వలబోజు గారికి కూడా కృతజ్ఞతలు. మీ ఈ వినూత్న కథన పరంపర విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించిన ఆధునిక హార్డ్‌వేర్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు వాటి వాడకంపై మీ నుంచి మరిన్ని అంశాలను ఆశిస్తున్నాం.

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాస కుమార్ గారూ మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదాలు. తప్పకుండా మంచి అంశాలు మున్ముందు వస్తాయి.
-నల్లమోతు శ్రీధర్

Phanindra చెప్పారు...

Really..Its a gr8 effort from you sir......I think it will be very helpful for many of them

అజ్ఞాత చెప్పారు...

hello mee articals baga uindhi naku english radhu telugu low chadhava tha ni ki veelu ga baga uindhi ienka manchi articalas rastha ru kadha