14, జులై 2007, శనివారం
వర్డ్ డాక్యుమెంట్ కరప్ట్ అయిందా?
ఎం.ఎస్.వర్డ్ ప్రోగ్రాం క్రాష్ అయినప్పుడు అప్పటివరకూ ఓపెన్ చేయబడి ఉన్న డాక్యుమెంట్ సైతం కరప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎం.ఎస్.ఆఫీస్ సూట్లో పొందుపరచబడిన Office Application Recovery అనే సదుపాయం కారణంగా.. తదుపరి పర్యాయం వర్డ్ ని ఓపెన్ చేసినప్పుడు ఇంతకుముందు కరప్ట్ అయిన డాక్యుమెంట్ ని వర్డ్ క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా ఉన్న సమాచారాన్ని వేరొక ఫైల్ పేరుతో సేవ్ చేస్తుంది. ఒక్కోసారి ఇలా కూడా జరగక పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే Windows Explorer ద్వారా ఇంతకుముందు బాగా కరప్ట్ అయిన డాక్యుమెంట్ ని వేరే లొకేషన్ లోకి అదనపు కాపీ బ్యాకప్ తీసుకుని.. వర్డ్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి డామేజ్ అయిన ఫైల్ మొదటి కాపీ ఉంది కదా.. ఆ ఫైల్ ని File>Open కమాండ్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఆ Open డైలాగ్ బాక్స్ లోనే క్రింది భాగంలో కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ లో Open and Repair అప్షన్ ని ఎంచుకోవడం మరువకండి. అప్పటికీ ఫలితం లేకపోతే.. .wbk ఎక్స్ టెన్షన్ పేరు కలిగిన బ్యాకప్ ఫైల్ ఏదైనా ఉందేమో సిస్టంలో వెదికి ఓపెన్ చేసి చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి