ఇటీవల podcasting అనే పదం ఎక్కడోచోట నెట్‌పై తారసపడుతూ ఉంది కదూ ! ipod వంటి పోర్టబుల్ మీడియా ప్లేయర్లు, పీసీలపై ప్లే చేయడానికి అనువుగా రేడియో తరహాలో నెట్‌పై RSS ఫీడ్‌ల ద్వారా పంపిణీ చేయబడే మీడియా ఫైళ్ళని podcast అంటారు. Pod అంటే అర్ధం ... ఏదైనా కొంత సమాచారాన్ని కలిగి ఉన్న కంటేనర్ అని. ఆడియో సమాచారాన్ని pod ల రూపంలో broadcast(ప్రసారం) చేసే ప్రక్రియ కాబట్టి దీనికి podcast అనే పేరు వచ్చింది. ఒకప్పుడు మన ఆలోచనలను డైరీల్లో రాసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరి ఆలోచనలు, ఎవరి నాలెడ్జ్‌ని బట్టి వారు తమకు తాము స్వంతంగా blogsని క్రియేట్ చేసుకుని నెట్‌పై అందరికీ తెలిసేలా ప్రచురించుకుంటున్నారు. డైరీలకు బ్లాగ్‌లు ఎలా ప్రత్యామ్న్యాయంగా నిలిచాయో ఆన్‌లైన్ రేడియో స్టేషన్లకి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మొదట్లో Apple iPod డివైజ్‌ల్ని దృష్టిలో ఉంచుకొని podcastలు రూపొందించబడినా ఇప్పుడు వేర్వేరు ఆడియో ఫార్మేట్లలో podcastలు రూపొందించబడుతుండడం వల్ల ఇతర పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్లలోనూ, పీసీలో సైతం ప్లే చేసుకోవడానికి అనువుగా podcast లు ఉంటున్నాయి. మనం స్వయంగా కూడా podcast లను రూపొందించుకోవచ్చు. మీరు సృష్టించుకున్న podcast లకు ఇతరులు సబ్‌స్క్రైబ్ చేసినట్లయితే మీరు కొత్త ఆడియో ఫైళ్ళని ప్రసారం చేసే ప్రతీసారీ వారు వాటిని పొందగలుగుతారు. తరచూ మేసేస్జ్‌లతో, ఏదైనా అంశంపై సమాచారంతో సముదాయానికి చేరువలో ఉండడానికి ఇది సరైన మార్గం.
ఆడియో పోడ్‌కేస్ట్లను అందించే ప్రముఖ వెబ్‌సైట్లు.
podcast లను సృష్టించడం చాలా సులువైనప్పటికి వాటిని నెట్‌పై పొందుపరచడం కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఆడియో podcast లను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో ...
http://www.podcastalley.com/
http://www.apple.com/
http://www.amigofish.com/
http://www.audiofeeds.com/
http://www.blastpodcast.com/
http://www.blogdigger.com/
http://www.gigadial.net/
http://www.gofish.com/
http://www.podcaster.com/
ఇటువంటి అనేక వెబ్‌సైట్లు, NBC News, BBC వంటి వార్తా సంస్థలు అనేకం పోడ్‌కేస్ట్‌లను అందిస్తున్నాయి. ఉచితంగా రిజిస్టర్ చేసుకుని కేస్ట్‍లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పోడ్‌కేస్ట్ లను ఇలా రూపొందిస్తారు.
podcast ని రూపొందించబోయే ముందు అందులో పొందుపరచదలుచుకున్న సమాచారం, ప్రసార నిడివి, ఆడియో ఫ్రీక్వెన్సీ వంటి అంశాలపై ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉండే రూంలో మైక్రోఫోన్ సయంతో తమ స్వరాన్ని Total Recorder వంటి సాఫ్ట్‌వేర్లతో mp3 ఫార్మేట్‌లోకి రికార్డు చేస్తారు. ఒకవేల ఆడియోలో ఏవైనా లోపాలు ఉంటే Sound Forge వంటి ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లలోని ఫిల్టర్ల సాయంతో లోపాలను సరిచేస్తారు. ఇక ఇప్పుడు podcast చేయదలుచుకున్న ఫైళ్ళూ రెడీ అయినట్లే. podcast లను నెట్‌పై పబ్లిష్ చేయడానికి మనకు RSS ఫీడ్‌లను అప్‌లోడ్ చేసే సర్వీస్ ఏదైనా కావాలి. http://www.feedforall.com/ వంటి సైట్ల ద్వారా కొంత రుసుముని చెల్లించి RSS Feed సర్వీసుని పొందవచ్చు. మీ స్వంత RSS ఫీడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత http://www.podcastalley.com/ వంటి సైట్ల సహాయంతో మీ RSS ఫీడ్‌కి మీఇవద్ద సిద్ధంగా ఉన్న podcast లను అప్లోడ్ చేసుకుని అందుబాటులోకి తేవచ్చు.
పోడ్‌కేస్ట్ లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సహజంగా వివిధ పోడ్‌కేస్టింగ్ పోర్టళ్ళలో Arts, Comedy, Music అనే వివిధ విభాగాల క్రింది వందల కొద్ది podcast లు లభ్యమవుతాయిల్. వాటిలో నచ్చిన podcast ని సెలెక్ట్ చేసుకుని దాని అడ్రస్‌ని Podcast Aggregator వంటి సాఫ్ట్‌వేర్‌లో టైప్ చేస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని www.podcastalley.com/podcast.software.php వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ ఫీడ్‌లలోని podcast లను వినడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. పోడ్‌కేస్ట్‌ని అందిస్తున్న వెబ్‌సైట్ అడ్రస్ సర్వర్‌గానూ, మన సిస్టం క్లయింట్‌గానూ వ్యవహరించబడి ఆడియో ప్లే అవుతుంది. ఇదే podcast టెక్నాలజీని ఆధారంగా చేసుకుని వీడియో, ఇమేజ్‌లు, టెక్స్ట్,pdf, వంటి అన్ని రకాల ఫైళ్ళని ఇతర కంప్యూటర్లకి ప్రసారం చేయవచ్చు. ఇంతవరకూ podcast ల గురించి తెలియని వారు ఓసారి మీకు మీరుగా వాటిని వినడానికి ప్రయత్నించి చూడండి.
4 కామెంట్‌లు:
భళా భళి....
కర్తా కారయితాచైవ ప్రేరకశ్చానుమోదక:
కాబట్టి మీ ఇద్దరికీ అభినందనలు - అభివందనములు..
బావుంది...
audacity కూడా మంచి సాఫ్ట్‌వేర్ పాడ్కాస్టింగ్ కోసం.
కందర్ప కృష్ణ మోహన్ గారూ, ప్రవీణ్ గార్లపాటి గారూ మీ స్పందన తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. Audacity గురించి రాయడం మర్చిపోయాను. రాస్తాను.
-నల్లమోతు శ్రీధర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి