20, జులై 2007, శుక్రవారం
మెసెంజర్ సర్వీస్ పాపప్
Messenger Service పేరిట సిస్టమ్‌లో పాపప్ అడ్వర్‌టైజ్‌మెంట్లు ప్రత్యక్షమవుతుంటే ఎదో స్పైవేర్ ప్రోగ్రామ్ సిస్టమ్‌లోకి ప్రవేశించిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. Spybot,PestPatrol వంటి ఏంటిస్పైవేర్ ప్రోగ్రాములతో సిస్టమ్ మొత్తాన్నీ స్కాన్ చేసినా స్పైవేర్ ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్ళూ కనిపించవు. Windows 2000, XP ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పొందుపరచబడిన "Messenger Service" అనే ప్రోగ్రామ్ మూలంగా ఈ పాపప్‌లు ప్రత్యక్షమవుతుంటాయి. MSN Messenger చాటింగ్ ప్రోగ్రామ్ కాదిది. Wide Area Network(WAN) లో వివిధ నెట్‌వర్క్‌లోని సిస్టమ్‌లకు మధ్య కమ్యూనికేషన్ జరపడానికి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించబడింది. సాధారణంగా WAN కార్పోరేట్ ఆఫీసుల్లో మాత్రమే ఉపయోగించబడుతుంటుంది. ఈ నేపధ్యంలో సాధారణ పిసి యూజర్లకి ఈ Messenger Service ఏమాత్రం ఉపకరించదు. సో..ControlPane>Administrative Services/Component Services>Services(Loca) అనే విభాగంలో కుడిచేతి వైపు కంపించే Messenger అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుని డిసేబుల్ చేసుకుంటే ఇలాంటి పాపప్‌లు ఇకపై రావు.
3 కామెంట్‌లు:
could not read the fonts of telugu so easily to understand that word. please improve the language font.
T.Ramachandrarao
why would a service which was designed for "WAN" will show "advertisements" ? I dont think you are right..
నిజంగా ఒకసారి మీరు ఆ సర్వీస్ పాపప్ ల బారిన పడితే తప్ప మీకు నా మాటల మీద నమ్మకం కలిగేటట్లు లేదు. సరే.. అంతవరకూ నేను రాసినది తప్పు అనే నమ్మండి. నాకు తెలియనివి రాయడం ఇంతవరకూ నాకు అలవాటు లేదు. నా సిస్టము పై ఇబ్బంది పడ్డాకే అది రాశాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి