13, జులై 2007, శుక్రవారం

ఆఫ్ లైన్ డిక్షనరీ ప్రోగ్రామ్




ఆన్‌లైన్ డిక్షనరీలు అనేకం అందుబాటులో ఉన్నప్పటికీ కంప్యూటరున్న అందరికీ ఇంటర్‌నెట్ ఉండాలని లేదు. ఒకవేళ ఉన్నా నిత్యం ఆన్‌లైన్లో ఉండడం ఇబ్బందే!! కాబట్టి డిక్షనరీ అవసరాల కోసం ఆఫ్‌లైన్లో పని చేసే ఓ పూర్తి స్థాయి సాప్ట్ వేర్ చాలా అవసరం. నిజానికి ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ అవి సైజులో పెద్దవి. ఖరీదైనవి! ఉచితంగా లభిస్తూనే, అత్యంత సమర్ధంగా పని చేస్తూనే తక్కువ బరువు కలిగి ఉండే బెస్ట్ ఆఫ్‌లైన్ డిక్షనరీ ఒకటి ఉంది. అదే వర్డ్‌వెబ్. దీని పాతవర్షన్లు చాలా మందికి పరిచితాలే. అయితే మరిన్ని అప్‌డేట్స్, మరింత విస్తృత పదజాలంతో కొత వర్షన్ 4.5a వచ్చిందిప్పుడు.

వర్డ్‌వెబ్ కేవలం అర్ధాలు చెప్పే డిక్షనరీ మాత్రమే కాదు. పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, సంబంధిత పదాలు అన్నింటినీ అందించే మంచి ధిసారస్ కూడా! పదాల అర్ధాల్లో, వివరణల్లో మళ్ళీ ఏ పదం క్లిక్ చేసినా చాలు దాని అర్ధం ఓపెన్ అవుతుంది. మనం చేసిన సెర్చ్‌లో ముందుకీ, వెనక్కీ వెళ్ళే వీలూ ఉంది.




టాస్క్‌బార్ మీద 'W' అనే ఐకాన్‌గా కనిపించే ఈ చిన్న డిక్షనరీ నిజంగా ఓ అద్భుతమైన సాప్ట్ వేర్ . ఇంత సింపుల్‌గా, సమర్ధంగా ఉండే ఉచిత డిక్షనరీ మరొకటి లేదనే చెప్పవచ్చు.

Wordweb Pro అనే పేరున్న ప్రొఫెషనల్ వర్షన్‌లో మరిన్ని అదనపు సౌకర్యాలూ, వివరాలు ఉన్నాయని పబ్లిషర్స్ వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఉచిత వర్షన్ కొన్ని రోజులు పని చేసి ఆగిపోదు. పూర్తిగా సమర్ధవంతంగా పని చేస్తుంది. మామూలు అవసరాలన్నిటికీ ఇందులోని లక్షాయాభైవేల పదాలు, లక్షా పద్దెనిమిది వేల పర్యాయ పదాల గ్రూపులు సరిపోతాయి.

ఇక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు: http://wordweb.info/
ఫైల్ పరిమాణం: 7.40 ఎం.బీ.

2 కామెంట్‌లు:

S చెప్పారు...

మృదులాంత్రాలు... పేరు వెరైటీ గా ఉందే!
ఇంతకీ wordweb లాంటివి లినక్సు కి కూడా ఉంటే చెబుదురూ. ఒకటీ అరా పేర్లు విన్నా కానీ.. ఉపయోగించలేదు ఇంతదాకా :(

అజ్ఞాత చెప్పారు...

లినక్స్ కోసం ftp://ftp.cogsci.princeton.edu/pub/wordnet అనే వెబ్ సైట్లో ఉండే Wordnet అనే సాప్ట్ వేర్ని వాడండి.
-నల్లమోతు శ్రీధర్