25, జులై 2007, బుధవారం

ప్రోగ్రామ్స్ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోండి...



ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ నెట్ కనెక్షన్ ఉంటోంది. అన్ లిమిటెడ్ కనెక్షన్ ఉంది కదా అని వివిధ వెబ్‌సైట్ల ద్వారా వెనకాముందు ఆలోచించకుండా భారీ మొత్తంలో ప్రోగ్రాములను డౌన్‌లోడ్ చేసుకుంటున్నవారూ ఉన్నారు. 'ఉచితం' అని ప్రస్తావించబడుతున్న కొన్ని సాప్ట్ వేర్లు స్పైవేర్, ఏడ్ వేర్ ప్రోగ్రాములను కలిగి ఉంటున్నాయి. సాధారణంగా Free Software కనిపించగానే లైఫ్‌లాంగ్ పనిచేస్తుంది కదా అని వెనక ముందూ ఆలోచించకుండా డౌన్‌లోడ్ చేస్తుంటాము. BonziBuddy, Kazza, Morpheus, audiogalaxy, Limewire వంటి ప్రోగ్రాముల్లో స్పైవేర్ కోడ్ ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. స్పైవేర్ కలిగున్న ప్రోగ్రాముల్ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇంటర్‌నెట్ స్పీడ్ గణనీయంగా తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు పాపప్ విండోలు స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంటాయి. అలాగే స్పైవేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ మన బ్రౌజింగ్ అలవాట్లని రికార్డ్ చేసి సర్వర్‌కి చేరవేస్తుంటుంది. అంటే మనం ఏమేం చేశామన్నది ఇతరులకు చేరవేయబడుతుందన్నమాట. ఈ సమాచారం ఆధారంగా రిమోట్ సర్వర్ మన సిస్టమ్‌లోకి అనేక అడ్వర్‌టైజ్‌మెంట్లని నెట్ ద్వారా పంపిస్తుంటుంది. మన కంప్యూటర్లోని కీలకమైన సమాచారాన్ని తస్కరిస్తుంది. కాబట్టి జాగ్రత్త పాటించండి.

కామెంట్‌లు లేవు: