20, జులై 2007, శుక్రవారం

సిడి డ్రైవ్ ప్రాబ్లెమ్



Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిడిరామ్ డ్రైవ్ నుండి కొంత డేటాని సిస్టమ్‌లోకి
కాపీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా లేదా సిడిలో ఉన్న ఏదైనా సాప్ట్ వేర్ ని ఇన్‌స్టాల్
చెయ్యబోతున్నా.. The request could not be performed
because of an I/Q device error లేదా only part of a
read process memory or write process memory request
was completed అనే మాదిరి ఎర్రర్ మెసేజ్‌లు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంటే విండోస్
XP ఆపరేటింగ్ సిస్టమ్ మీ వద్ద ఉన్న సిడిరామ్ డ్రైవ్ సపోర్ట్ చెయ్యని ట్రాన్స్‌ఫర్ మోడ్‌ని
దానికి సెట్ చేసినట్లుగా భావించవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో..
Start>Run కమాండ్ బాక్స్‌లో devmgmt.msc అని టైప్ చేసి Device
Manager లోకి వెళ్ళి.. IDE ATA/ATAPI controllers అనే
విభాగాన్ని expand చేసి మీ సిడిరామ్ డ్రైవ్ ఏ IDE చానెల్‌కి అయితే కనెక్ట్ అయి
ఉందో ఆ చానెల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సాధారణంగా సెకండరీ IDE కేబుల్‌కి కనెక్ట్
చేసినట్లయితే Secondary Channelని ఎంచుకోండి. ఇప్పుడు Advanced
Settings అనే విభాగంలో మీ సిడిరామ్ deviceని ఎంచుకుని Transfer
Modeని PIO Only గా సెట్ చేయండి.

కామెంట్‌లు లేవు: