1, మార్చి 2008, శనివారం

పిసి ఆన్ చేయగానే ఏమి జరగకపోతేకంప్యూటర్‍ని ఆన్ చేసిన వేంటనే క్యాబినెట్‍పై LEDలు వెలగకుండా, మోనిటర్‍పై డిస్‍ప్లే రాకుండా, మదర్ బోర్డ్ నుండి ఎలాంటి బీప్‍కోడ్‍లు విన్పించబడకుండా పూర్తి సైలెంట్‍గా ఉన్నట్లయితే క్యాబినెట్‍ని విప్పదీసి మదర్ బోర్డ్ కి, హార్డ్ డిస్క్ , సిడిరామ్ వంటి పరికరాలకు SMPS నుండి వచ్చే పవర్ కేబుళ్ళని ఒకసారి తొలగించి తిరిగి అమర్చండి. అలగే మదర్ బోర్డ్ పై front panel లో స్పీకర్, LED, పవర్ బటన్‍లకు కేబుళ్ళు సరిగ్గా కాన్ఫిగర్ చెయ్యబడ్డాయో లేదో తనిఖీ చేయండి. Front Panel కాన్ఫిగరేషన్ గురించి మీ మదర్ బోర్డ్ మేన్యూవల్‍లో వివరంగా రాయబడి ఉంటుంది. కనెక్టివిటీ మొత్తం సక్రమంగానే ఉండి సిస్టమ్ రెస్పాండ్ అవకపోతున్నట్లయితే SMPS పెయిలైనట్లు భావించాలి. కొత్త SMPS కొనే ముందు అందుబాటులో వేరే సిస్టమ్ యొక్క ప్రస్వ్తుతం మీవద్ద ఉన్న SMPS యొక్క wattageని కలిగిన మరో SMPS ఉన్నట్లయిఏ దాన్ని టెంపరరీగా మీ సిస్టమ్‍లో అమర్చి చూడండి. ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్లయితే కొత్త SMPSని కొని అమర్చుకోండి. SMPS ని కొనేటప్పుడు మీ సిస్టమ్‍లో ఉన్న హార్డ్ వేర్ పరికరాల విద్యుత్ ధృష్టిలో ఉంచుకుని ఎక్కువ వాటేజిది కొనుగోలు చేయండి.

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, థాంక్స్, నాకు ఒక సారి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. కాల్ అటెండ్ చెయ్యటానికి ఒక అఫీస్ కు వెళ్ళా, డిస్ప్లే రాక పోయెసరికి క్యాబినెట్ విప్పి చూశా, అన్నీ సరిగ్గానే వున్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ కాలెదు. తీరా చివరికి తెలిందేంటంటే మానిటర్ కలర్ కట్రోలర్స్ అన్నీ ఒకే వైపుకు తిప్పి వుంచడం వల్ల డిస్ప్లే రావటంలేదని.