11, మార్చి 2008, మంగళవారం

మంచితనం మూర్తీభవించిన మిత్రునికి జన్మధిన శుభాకాంక్షలు

ట్రెక్కింగ్ లో సేదదీరుతూ మిత్రులు గిరిచంద్

అందరూ మాటలు చెబుతారు.. కొందరే చేతల్లో చూపిస్తారు. ఆ చేతలు కూడా మనస్ఫూర్తిగా నిర్వర్తించి అందరికీ ఆత్మీయులవుతారు. అటువంటి అరుదైన ఆదర్శదాయకమైన వ్యక్తిత్వం నువ్వుశెట్టి సోదరుల్లో ఒకరైన గిరిచంద్ గారిది. కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ప్రారంభమైనది మొదలుకుని నిరంతరం దానిని అభివృద్దిపరచడంలో, చాట్ లో జరిగిన సంభాషణలను అర్థవంతంగా పదిలపరచడంలో, కొత్తవారిని ఉత్తేజపరచడంలో, ఛాట్ లో సందర్భానుసారం నవ్వులు పూయిస్తూ ఉల్లాసాన్ని నింపడంలో ఆయనది అందెవేయిన చేయి. నిజంగా గిరిచంద్ లాంటి మిత్రులు కంప్యూటర్ ఎరా టీమ్ మొత్తానికీ లభించినందుకు నేను వ్యక్తిగతంగా గర్వపడని రోజంటూ లేదు. మీజిల్స్ తో బాధపడుతూ నిలువెల్లా నీరసం ఆవహించినా ఛాట్ లో ఓపిగ్గా పలువురి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అవసరమైతే మధ్యలో ఫోన్ చేస్తూ ఆయన ప్రదర్శించిన కమిట్ మెంట్ మనసుని కదిలిస్తుంది. మానవత్వమంటే ఇదే అన్పిస్తుంది. అవకాశం వస్తే అందరూ కబుర్లు చెబుతారు, కానీ గిరిచంద్ గారిలా కట్టుబడేవారు చాలా చాలా అరుదు. వారు తమ స్నేహపూరిత స్వభావంతో అందరినీ సమన్వయపరుస్తూ ఛాట్ లో పోషిస్తున్న పాత్ర నిజంగా అద్భుతమైనది. నేను ఈ ప్రాజెక్ట్ కి కట్టుబడి పనిచేస్తాను అని ఆయన ప్రకటించిన క్షణం నుండి ఈరోజు వరకూ ఆయనలో అదే ఉత్సాహం. మనిషి ఆర్థికంగా ఎదగవచ్చు.. కానీ మానవత్వంలో మనీషి గా ఎదడగమెలాగో ఆత్మీయులు గిరిచంద్ గారిని చూస్తే అర్థమవుతుంది. ఇది ఆయనని పొగడడం కాదు.. మామూలు సందర్భాల్లో మా టీమ్ సభ్యులందరి మనసులో ఆయనపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా అవి వ్యక్తపరడానికి సరైన సందర్భం లభించదు, అందుకే ఆయన గొప్పదనాన్ని కనీసం ఆయన జన్మదినం రోజైనా ఈ పోస్ట్ రూపంలో వ్యక్తపరిచే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గిరిచంద్ గారు మనసువిప్పి చెబుతున్నాను మీరు మాకు అత్యంత ఆత్మీయులు, మిమ్మలను చూసి, మీ కమిట్ మెంట్ ని చూసి గర్వపడని క్షణమంటూ
లేదు. మీ వ్యక్తిత్వంలోని ఔన్నత్యం మరో పదిమందికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తూ..

జ్యోతి, ప్రసాద్, జీవి, శ్రీనివాస్ కర, సాయి పోతూరి, జాకబ్, మొయిన్, జాహ్నవి, రాధిక, రామ్ యనమల, వినయ్, రవీంద్ర కాట్రగడ్డ, టి.రామచంద్రరావు, నాగభూషణం, నరేష్ వంటి ఎందరో మిత్రుల ఆశీస్సులతో మీరు కలకాలం ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...

- మీ మిత్రుడు
నల్లమోతు శ్రీధర్

13 కామెంట్‌లు:

గోపాల్ వీరనాల(జీవి) చెప్పారు...

పగలంతా ఉద్యోగ రీత్యా అలసి పోయి కూడా, అర్థరాత్రి వేళ 1-2 గం సమయంలో కూడా అందరం హాయిగా నవ్వుకుంటూన్నమంటే అది గిరిచంద్ గారి చలవే,

ఒక్క మాట ..గిరిచంద్ గారు మీరు కనిపించకున్నా చాలా బాగా నవ్వుతారు...

ఈ నవ్వులు మాకు ఇలానే పంచండి,

అజ్ఞాత చెప్పారు...

మీరింత అభిమానాన్ని చూపించి, కదిలించేసారు శ్రీధర్ గారు. మనిషన్నతరువాత రోజుకి కనీసం అరగంటైనా మరొకరికి సాయం చేయాలి అన్న మీ నినాదమే నన్ను ఆకర్షించింది. నాకు కాని ఇంకా సాంకేతిక సహాయం లో నిరంతరం శ్రమిస్తున్న ఇతర మిత్రులకు గాని ప్రోత్సాహాన్నిచ్చి, స్పూర్తి గా నిలిచింది మీరే. ఈ మన బంధాన్ని ఎన్నటికీ మరచిపోలేను. పుట్టినరోజుని చాట్ రూంలో ఇంత సరదాగా అందరితో గడుపుతానని అనుకోలేదు. జ్యోతి గారు, జీవి గారు, సాయి, శ్రీనివాస కర గారు, జాకబ్, వినయ్, జాహ్నవి, రాధిక, ప్రసాద్ గారు, మధు, రాజేష్ ... ఇంకా ఎందరో అందరికీ ధన్యవాదాలు.

-గిరిచంద్

కొత్త పాళీ చెప్పారు...

Happy Birthday Girichand!

రాధిక చెప్పారు...

ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా బ్లాగ్ మిత్రులందరి మాటల్లో ఆయన గురించి చాలా సార్లు వినివుండడంవల్ల ఈ మాటలు చెప్పగలుగుతున్నాను.తప్పుగా,తక్కువగా రాసివుంటే మన్నించాలి.
"మంచితనం మూర్తీభవించిన మా ఈ మిత్రుడు
నిరంతర సేవలో అలసిపోని శ్రామికుడు
సమస్యను ఛేధించడం లో సైనికుడు
సాహితీ వనం లో సేద తీరే భావకుడు "

గిరి చంద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ప్రసాద్ చెప్పారు...

శ్రీధర్ గారూ, జీవీ గారు

శ్రీ గిరిచంద్ గారి వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా వ్యక్త పరిచారు. అతి కొద్ది సమయంలో ఎందరికో ఆప్తులుగా స్నేహాన్ని ఉల్లాసాన్ని అందించే శ్రీ గిరిచంద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు kotha ravi

Unknown చెప్పారు...

గిరిచంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

జాహ్నవి చెప్పారు...

వివరించి విపులంగా చెప్పడం, కుదించి సంక్షిప్తంగా చెప్పడంలో నేను కాస్త poor. కాని చెప్తామనుకున్నది మాత్రం చెప్పగలను అదే
"ఆగిపోని కాలానికి సాగిపోవడమే తెలుసు.
అలుపెరుగని గిరిచంద్ గారికి సాయపడటమే తెలుసు
& నవ్వులు పూయించడం కూడా"

మరొక్కసారి
మీకు "జన్మదిన శుభాకాంక్షలు"

నిషిగంధ చెప్పారు...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గిరిచంద్ గారూ..

అజ్ఞాత చెప్పారు...

# జీవి గారు! మీ అభిమానానికి థ్యాంక్స్. అసలు మీరే గనక చాట్ రూంలో అడుగిడకుండా ఉండిఉంటే దానికీ రూపు వచ్చేదా? ఇన్ని నవ్వులూ పువ్వులూ పండేవా?

#కొత్తపాళీ గారు! ధన్యవాదాలు.

#రాధిక గారు! అయ్యబాబోయ్ నా మీద కవితా? అంతటివాడిని కాదు. ఇదంతా శ్రీధర్ గారు మరియు ఇతర మిత్రుల అభిమానం మాత్రమే. ఏది ఏమైనా ఇది నా మీద వ్రాయబడిన మొదటి కవిత(ఇదే ఆఖరు కావాలని కోరుకుంటున్నాను), దీన్ని భద్రం గా దాచుకుంటాను. థ్యాంక్యు వెరీమచ్.

#ప్రసాద్ గారు ధన్యవాదాలు సర్. మీరు మరియు మిగిలిన మిత్రులూ స్నేహహస్తాలు అందించే స్వభావం కలిగినవారు కాబట్టే మీ నుండి నేనూ నేర్చుకోగలుగుతున్నాను.

#రవన్నా! మీ అభిమానానికి చీర్స్:)

#ప్రవీణ్ గారు! ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం మరువలేనిది.

అజ్ఞాత చెప్పారు...

నిషిగంధ గారు! ధన్యవాదాలు:)

అజ్ఞాత చెప్పారు...

మరో కవిత!!! జాహ్నవి! మీ కవితలు బ్లాగులో చదివి సేదతీరుతున్నాము కదా! అసలిదంతా శ్రీధర్ గారి వల్లే, కవితలు ఆయనమీద వ్రాయటమే న్యాయం. :) ధన్యవాదాలు.

దీపారాధన చెప్పారు...

నిండు కుండలో ఉన్న స్వభావ అలలు. ఆ అలలపై వీచే చల్లని గాలి నిర్మానుశ్యం గా ఉంది సవ్వడి చేయక. నీ మనసు విప్పి మాట్లాడే కవితల అలలపైన అందరి మన్ననలను స్వీకరించి, ఏమో ఏమోమో చేయాలన్న తపన నీ పట్టుదలకి నాందియై నూరేళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలుగా, జీవితంలో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మీ మిత్రులందరి కోరిక.