1, మార్చి 2008, శనివారం

20% బ్యాండ్ విడ్త్ XP నే వాడుకుంటుంది…Windows XP ఆపరేటింగ్ సిస్ట్టమ్‍ని ఉపయోగించే దాదాపు ప్రతీ పిసి యూజర్‍కి తెలియని రహస్యం ఒకటుంది. ఇంటర్నెట్‍ని బ్రౌజ్ చేసేటప్పుడు మొత్తమ్ లభ్యమయ్యే బ్యాండ్ విడ్త్ లో 20% వరకూ XP అప్‍డేట్ల కోసం వెదకడం వంటి అవసరాలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. మిగిలిన బ్యాండ్ విడ్త్ మాత్రమే మనకు లభిస్తుంటుంది. ఇది మరీ అన్యాయంగా అనిపిస్తుంది కదూ… దీన్ని అధిగమించడానికి Start>Run కమాండ్ బాక్శ్ లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్ ప్రోగ్రామ్‍లోకి వెళ్ళి… Local Computer Policy> Computer Configuration>Administrative Templates>Network>QOS Packet Scheduler>Limit Reservable Bandwidth అనే ఆప్షన్‍ని డబుల్ క్లిక్ చేయండి. ఇది కాన్ఫిగర్ చేయబడలేదని చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదు. Explain అనే tab లో 20% తన స్వంతానికి వాడుకుంటున్నట్లు వివరించబడి ఉంటుంది. దీన్ని అడ్డుకోవడానికి ఆ ఆప్షన్‍ని ఎనేబుల్ చేసి Reservable bandwidthని 0 గా సెట్ చేయండి. సరిపోతుంది..

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మంచి విషయం చెప్పారు. ఇలాచెయ్యడం వల్ల నత్తనడకలు నడిచే కంప్యూటరు కాస్త త్వరగా నడవడం కూడా జరుగుతుందా

viswanath చెప్పారు...

very much helpful