20, మార్చి 2008, గురువారం

ముఖ్యమైన సమాచారాన్ని వెదికి పట్టుకోవాలంటేమీ స్నేహితులు పంపించిన SMS మెసేజ్‌లలో ఎక్కడో ముఖ్యమైన సమాచారం ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూద్దామంటే Inbox ఉన్న భారీ మొత్తంలోని మెసేజ్‌లను ప్రతీదాన్నీ ఓపెన్ చేసే ఓపిక మీకు లేదనుకోండి. అలాంటప్పుడు AllFinder అనే సాఫ్ట్ వేర్ సాయం తీసుకోండి. NokiaS60 3rd జనరేషన్ ఫోన్లు అయిన N71, N93,E60, E61, E70,E50,5500, N91 వంటి మోడళ్ళపై ఈ సాఫ్ట్ వేర్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏ పదం కోసమైతే వెదకదలుచుకున్నారో ఆ పదాన్ని టైప్ చేస్తే.. మీ ఫోన్‌లోని SMS, Email, Calendar, Contact List వంటి వేర్వేరు ప్రదేశాల్లో ఆ పదం వెదకబడి ఎక్కడ తారసపడినా పట్టుకోబడుతుంది.

కామెంట్‌లు లేవు: