14, సెప్టెంబర్ 2007, శుక్రవారం

Wikia అందిస్తున్న ఉచిత హోస్టింగ్

వికియా సంస్థ తాజాగా ఉచిత వెబ్ హోస్టింగ్ సేవలను ప్రారంభించింది. Open Serving పేరిట
అందించబడుతున్న ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించి ఎవరైనా తమ
స్వంత వెబ్‍సైట్లని ఇంటర్నెట్‍పై పొందుపరుచుకోవచ్చు. వెబ్‍స్పేస్, బ్యాండ్‍విడ్త్
పూర్తి ఉచితంగా అందించబడుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఇతర ఫ్రీ వెబ్
హోస్టింగ్ సర్వీసులు ఉచిత బ్యాండ్‍విడ్త్ ని కల్పించిన మన వెబ్‍సైట్లలో
అడ్వర్‍టైజ్‍మెంట్లని గుప్పిస్తుంటాయి. దీని వల్ల మన సైట్‍ని విజిట్ చేయాలనుకునే
యూజర్లు వెనుకాడుతుంటారు. అయితే వికియా అందిస్తున్న
Open Serving సర్వీస్ ద్వారా మనమ్ వెబ్‍సైట్‍ని క్రియేట్ చేసుకున్నప్పుడు
మన సైట్‍లో ఎలాంటి అడ్వర్‍టైజ్‍మెంట్లు ప్రదర్శింపబడవు. నిజంగా ఇది పెద్ద విశేషమే.
YouTube సంస్థకి, Openservingకీ ఉన్న సంబంధాల దృష్ట్యా ఇది సాధ్యపడుతుంది
అని అంటున్నారు.. www.openserving.com సైట్ ద్వారా మీ సైట్‍ని
హోస్ట్ చేయండి.

3 కామెంట్‌లు:

రవి వైజాసత్య చెప్పారు...

నేనిదివరకు ఇక్కడ స్థలంకొరకు దరఖాస్తు పెట్టినట్టు గుర్తు కానీ వీళ్ళనుండి ఏ జవాబూ రాలేదు. మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసి చూస్తా

వీవెన్ చెప్పారు...

ఓపెన్‌సెర్వింగ్, వికియా (wikia.com) సైట్లకు మరియు వికీపీడియా(wikipedia.org) కు ఏ సంబంధం లేదు. ఆ రెండూ వికియా అనే లాభాపేక్ష సంస్ధకి సంబంధించినవి. ఈ వికియా సంస్ధని వికీపీడియా స్ధాపకుడు జిమ్మీ వేల్స్ ప్రారంభించినప్పటికీ, వికీపీడియా మరియు వికియా రెండూ వేర్వేరు.

ఈ టపాలో wikipedia ఉన్న చోట్ల wikia అని మార్చుకుంటే సరి.

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

వీవెన్ గారూ, మీ సవరణకు ధన్యవాదాలు. పోస్ట్ల్ లో సరిచేయడం జరిగింది.
-నల్లమోతు శ్రీధర్