11, సెప్టెంబర్ 2007, మంగళవారం

Ashampoo - illuminator
ఎలా ఉపయోగించాలి?


అన్ని రకాల ఫైళ్ళని అక్కడికక్కడే ఓపెన్ చేసి చూపించడంతో పాటు వీడియో, మ్యూజిక్, ఇమేజ్‍లు, డాక్యుమెంట్ ఫైళ్ళని Ashampoo Illuminator హార్డ్ డిస్క్ నుండి వెదికి పట్టుకుంటుంది. ఇమేజ్‍లను క్వాలిటీ నష్టపోకుండా ౧౫౦ పిక్సెల్స్ వరకూ ధంబ్ నెయిల్స్‍గా చూపిస్తుందీ ప్రోగ్రామ్! Illuminator లో స్వంతంగా స్క్రీన్‍సేవర్లు తయారు చేసుకోవడానికి కావలసిన సదుపాయాలు, ఇమేజ్‍లతో పాటు మన వాయిస్ జతచేసుకుని Talking Slideshowని డిజైన్ చేసుకునే ఆప్షన్లు పొందుపరచబడి ఉన్నాయి. బ్యాచ్ ప్రొసెసింగూ చేయవచ్చు.

ఓపెనింగ్ స్క్రీన్… Illuminator ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసిన వెంటనే Windows Explorer తరహాలో క్రింది విధంగా స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. ఎడమచేతి వైపు డ్రైవ్/ఫోల్డర్‍ని సెలెక్ట్ చేసుకోగానే అందులోని మీడియా ఫైళ్ళ ధంబ్‍నెయిల్స్, ఇతర ఫైళ్ళ పేరు కుడిచేతి వైపు చూపించబడతాయి. ఏదైనా ఇమేజ్ ఫైల్ ధంబ్‍నెయిల్‍ని మౌస్‍తో డబుల్‍క్లిక్ చేసినట్లయితే అది పుల్‍స్క్రీన్‍తో ఫైల్‍సైజ్/రిజల్యూషన్ వంటి వివరాలతో సహా చూపించబడుతుంది.

విజార్డ్ లు … Wizards మెనూలో వాల్‍పేపర్, ఇల్యుమినేటర్, స్లైడ్‍షో, కన్వర్షన్, స్క్రీన్‍సేవర్, SeeYa, బర్నిట్ అనే పలు విజార్డ్ లు దర్శనమిస్తుంటాయి. ఏదైనా ఇమేజ్‍ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే Wallpaper Wizard బటన్‍ని క్లిక్ చేసినట్లయితే మనమ్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ వాల్‍పేపర్‍గా సెట్ చెయ్యబడుతుంది. Illuminator Wizard అనే ఆప్షన్ ఏదైనా ఇమేజ్ ఫైల్ ఆల్రెడీ హార్డ్ డిస్క్‍లో ఉండీ అది ఎక్కడుందో వెదికిపట్టుకోవడానికి ఇబ్బంది అవుతున్నపుడు ఉపయోగపడుతుంది. డ్రవి‍నీ, ఫైల్‍టైప్‍ని, గుర్తుంటే సుమారు ఫైల్ సైజ్‍ని పేర్కొంటే ఆయా లక్షణాలు గల అన్నీ ఫైల్స్ వెదికిపట్టుకోబడి ఆయా ఇమేజ్‍ల ధంబ్‍నెయిల్స్ స్క్రీన్‍పై కన్పిస్తాయి.

స్లైడ్ షో తయారు చెయ్యడానికి … స్లైడ్ షో తయారు చెయ్యదలుచుకున్నప్పుడు అందులో పొందుపరచదలుచుకున్న ఇమేజ్‍లను ఎంపిక చేసుకుని SlideShow Wizard అనే ఆప్షన్‍ని క్లిక్ చేసిన వెంటనే ఒక డైలాగ్‍బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అందులో స్లైడ్‍షో పెరు , ఫోటోలు, ఏ క్వాలిటీతో చూపించబడాలి తదితర వివరాలను ఎంచుకుని Go బటన్ ప్రెస్ చేసినట్లయితే స్లైద్‍షో తయారై Illuminator ప్రోగ్రామ్‍లోని SlideShow Paneలో ప్లే చెయ్యడానికి రెడీగా ఉంచబడుతుంది.

ఫైల్ ఫార్మేట్లని కన్వర్ట్ చెయ్యడానికి…. ఏకకాలంలో పలు ఇమేజ్‍లను సెలెక్ట్ చేసుకుని వాటన్నింటినీ JPG, TIF, PNG, BMP వంటి ఇతర ఫైల్ ఫార్మేట్లకు సులభంగా కన్వర్ట్ చెయ్యవచ్చు. ఫార్మేట్ కన్వర్షన్ చేసే సమయంలోనే ఇమేజ్‍లు రొటేట్ చెయ్యబడేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక Screen Saver Wizardని ఉపయోగించి మనమ్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్‍లు ఆటోమేటిక్‍గా ఒక దాని తర్వాత ఒకటి ప్లే అయ్యే స్క్రీన్ సేవర్లుగా క్రియేట్ చేసుకోవచ్చు. పలు రకాల ట్రాన్సిషన్ ఎఫెక్ట్లు, ఇమేజ్‍కి ఇమేజ్‍కి మధ్య మనం కోరుకున్న వ్యవధి మెయింటైన్ చెయ్యబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. SeeYa Wizardని ఉపయోగించి మనమ్ ఎంపిక చేసుకున్న ఇమేజ్‍లతో పాటు మన స్వంత వాయిస్‍ని జత చేసుకుని ఆ అంశాలన్నీ కలిపి ఒకే ఒక ఫైల్‍గా కన్వర్ట్ చేసుకుని Talking SlideShowని డిజైన్ చేసుకోవచ్చు.నిర్దిష్టమైన సమయంలో షట్‍డౌన్..

www.sashazur.com అనే వెబ్‍సైట్‍లో లభించే Sleepy అనే మృదులాంత్రము(Software)ని ఉపయోగించి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతీరోజూ ఫలానా టైమ్‍లో షట్‍డౌన్ చెయ్యబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ మృదులాంత్రమును డౌన్‍లోడ్ చేసుకోకపోతే మీరు ఇన్‍స్టాల్ చేసుకున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍తోపాటు Resourse Kit మీవద్దే ఉండి , AT అనే కమాండ్ గనుక ఎనేబుల్ చేయబడి ఉన్నట్లయితే ఆ కమాండ్ ద్వారా కూడా మనం పేర్కొన్న టైమ్‍కి సిస్టమ్ షట్‍డౌన్ చేయబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కమాండ్‍తోపాటు,, /c అనే పారామీటర్‍ని ఉపయోగిస్తే షట్‍డౌన్ సమయంలో అన్ని ప్రోగ్రాములు క్లోజ్ అవుతాయి. /y అనే బటన్‍ని ఉపయోగించినట్లయితే షట్‍డౌన్ సమయంలో ఏమైనా ప్రామ్ట్లన్నీ క్లోజ్ చేయబడతాయి. లోకల్ పిసిని షట్‍డౌన్ చెయ్యడానికి /c అనే బటన్‍ని ఉపయోగించాలి. షట్‍డౌన్‍కి బదులు రీబూట్ చేయడానికి /r బటన్‍ని పేర్కొనాలి.

కామెంట్‌లు లేవు: