21, సెప్టెంబర్ 2007, శుక్రవారం

డివిడి విలువని పెంచే లేబుళ్ళు
డిజిటల్ కామ్‍కోడర్, సెల్‍ఫోన్ కెమెరాల ద్వారా మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలను వీడియోగా తీసుకుని MPEG to DVD Converter వంటి మృదులాంత్రముల(Software) సాయంతో DVD ఫార్మేట్‍లోకి కన్వర్ట్ చేసుకుని చివరిగా ఖాళీ డివిడి డిస్క్ లో రైట్ చేసుకున్నారనుకుందాం. అంతా బానే ఉంది. ఈ డివిడిలపై డిస్క్ లో పొందుపరిచిన ఏదైనా దృశ్యాన్ని లేబుల్‍గా పొందుపరిస్తే ఇంకాస్త రిచ్ లుక్ వస్తుంది కదూ! మీ డివిడిలను ప్రొఫెషనల్‍గా తీర్చిదిద్దుకోవడమెలాగో తెలుసుకుందాం.

లేబులింగ్‍కి కావలసిన వస్తువులు.

ఒక ఖాళీ డివిడి బాక్స్, ఇంక్ జెట్ ప్రింటర్, ఫోటోపేపర్, లేబుళ్ళని రూపొందించడానికి ఓ మృదులాంత్రము(software) మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు మీ డివిడి డిస్క్ పై లేబుల్‍గానూ, Jewel Case యొక్క లేబుల్‍గానూ ప్రింట్ చేయడానికి మన వద్ద ఉన్న వీడియో నుండి ఓ ఆకర్షణీయమైన ఫోటోని కేప్చర్ చేసుకోవాలి. దానికిగాను Windows Movie Maker లో మీ వీడియో ప్లె చేస్తూ నచ్చిన ఫ్రేమ్‍ను కేప్చర్ చేసి Adobe Photoshop వంటి ఫోటో ఎడిటింగ్ మృదులాంత్రం(software)తో ఆ ఫోటోలో ఏవైనా లోపాలు ఉంటే ఎడిట్ చేసుకోవాలి. డిస్క్ మధ్యభాగంలో hole ఉంటుంది కాబట్టి డిస్క్ కి లేబుల్‍గా ఉపయోగించదలుచుకున్న ఇమేజ్‍కి hole వచ్చే ప్రదేశంలో ముఖ్యమైన చిత్రాలు ఏమీ లేకుండా ఉంటే మంచిది. మూవీ నుండి లేబుల్‍గా ఉపయోగించదలుచుకున్న ఇమేజ్‍ని కేప్చర్ చేసేటప్పుడు వీలైనంత స్పష్టమైన ఫ్రేమ్‍ని ఎంచుకోండి. దీనివల్ల లేబుల్ చూడటానికి బాగుంటుంది. కేప్చర్ చేసిన ఫోటోని BMP, TIFF వంటి అన్‍కంప్రెస్డ్ ఫార్మేట్‍లో సేవ్ చేయడం వల్ల నాణ్యత లోపించకుండా ఉంటుంది.

డివిడి లేబుల్ డీజైనింగ్

ఇప్పుడు మనం డివిడి లేబుళ్ళని డిజైన్ చెయ్యడానికి CD Label Designer అనే మృదులాంత్రమును (software) ఉపయోగిద్దాం. www.datalandsoftware.com అనే వెబ్‍సైట్ నుండి దీని ట్రయల్ వెర్షన్ డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‍లో ఎడమచేతివైపు కనిపించే Labels అనే లిస్ట్ వద్ద Disk అనే అంశాన్ని ఎంచుకోండి. వెంటనే మెయిన్ విండోలో డిస్క్ రూపంలో గుండ్రని చిత్రం ప్రత్యక్షమవుతుంది. ఆ డిస్క్ బొమ్మ వద్ద మౌస్‍తో రైట్‍క్లిక్ చేసి Insert > Picture అనే ఆప్షన్‍ని ఎంచుకోండి. డిస్క్ పై ఏ ఇమేజ్‍ని లేబుల్‍గా అతికించదలుచుకున్నారో ఆ ఇమేజ్‍ని ఎంచుకోండి. ఒకవేళ మనం ఎంచుకున్న పిక్చర్ లేబుల్ కన్నా పెద్దదిగా ఉంటే దానిని Resize, Crop లలో ఏం చేయమంటారని అడుగుతుంది. Resize (keep aspect ratio) ఆప్షన్‍ని ఎంచుకోండి. Object మెనూలో ఉండే Arrange, Rotate వంటి ఆప్షన్లని ఉపయోగించి డిస్క్ పై లేబుల్ మనకు నచ్చిన విధంగా అమర్చబడేలా జాగ్రత్త వహించవచ్చు. డిస్క్ పై లేబుల్ మనకు నచ్చిన విధంగా అమర్చబడేలా జాగ్రత్త వహించవచ్చు. డిస్క్ పై ఏమైనా మేటర్ టైప్ చేయాలంటే Object > Insert > Text లేదా Circled Text అనే ఆప్షన్లని ఉపయోగించి పొందుపరచవచ్చు. ఇదే విధంగా Labels అనే విభాగంలో DVD Box అనే ఆప్షన్‍ని ఎంచుకుని బాక్స్ల్ల్ లో అమర్చదలుచుకున్న లేబుల్‍ని సైతం డిజైన్ చేసుకోండి. చివరిగా File > Print అనే ఆప్షన్ ద్వారా మీ ఇంక్‍జెట్ ప్రింటర్‍ని ఉపయోగించి లేబుళ్ళని ప్రింట్ చేసుకుని.. డిస్క్ యొక్క లేబుల్‍ని గుండ్రంగా నీట్‍గా కట్ చేసుకుని అంటించండి. అలాగే DVD Box యొక్క లేబుల్‍ని Front , Back ఇమేజ్‍్‍లకు మధ్య ఫోల్డ్ చేసి నీట్‍గా బాక్స్ ప్లాస్టిక్ కవర్ లోపల అమర్చండి. లేబుళ్ళపై సాధ్యమైనంతవరకూ దృశ్యాలు ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి అవసరం అయితేనే తప్ప text ని అదనంగా జతచేయకండి. Nero Vision Express వంటి మృదులాంత్రములతో(software) డివిడి ప్లే అయ్యేటప్పుడు మెనూ చూపించబడేలా కూడా ఆటోరన్‍లో డిజైన్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: