21, సెప్టెంబర్ 2007, శుక్రవారం

MP3 ఫైల్‍ని GIF పిక్చర్‍లో దాచిపెట్టడం



మైక్రోఫోన్ ద్వారా మీ మాటలని MP3 ఫార్మేట్‍లో రికార్డ్ చేసి ఆ MP3 ఫైల్‍ని ఏదైనా GIF ఇమేజ్‍లో గోప్యంగా దాచిపెట్టి మీ స్నేహితులకు పంపించుకోవచ్చు. వారు ఆ ఫైల్‍‍ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చెస్తే కేవలం ఫోటో కన్పిస్తుంది తప్ప ఆడియో వినిపించబడదు. అదెలాగో చూద్దాం. మన వద్ద picture.gif మరియు audio.mp3 అని రెండు ఫైళ్ళు ఉన్నాయనుకుందాం. Start>Run బాక్స్ లో CMD అని టైప్ చేసి కమాండ్ ప్రామ్ట్ లోకి వెళ్ళి…copy picture.gif /b + audio.mp3 /b combined.gif అనే కమాండ్‍ని టైప్ చేయండి ఆ రెండు ఫైళ్ళ పాత్‍లని సరిగ్గా స్పెసిఫై చేయాలి సుమా! దీనితో audio.mp3 అనే ఫైల్ picture.gif అనే ఫైల్‍లో దాచివేయబడి కొత్తగా combined.gif అనే ఫైల్ రూపొందించబడుతుంది. ఇప్పుడు ఈ ఫైల్‍ని ఎవరికైనా పంపిస్తే కేవలం picture.gif ఫైల్‍‍లో ఉండే ఫోటోని చూడగలుగుతారు తప్ప audio.mp3 అనే ఫైల్‍లోని ఆడియో మాత్రం వారికి విన్పించబడదు. ఆడియో వినిపించాలంటే ఓ చిట్కా ఉంది. WinAmp ప్రోగ్రామ్‍లో ఆ combined.gif ఫైల్‍ని ఓపెన్ చేస్తే సరిపోతుంది.

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

ఈ చిట్కా అద్భుతమ్..కృతజ్ఞతలు