15, సెప్టెంబర్ 2007, శనివారం

ఫోటోల్లో అవసరం లేని ఆబ్జెక్ట్ లుంటే…ఓ గార్డెన్‍లో మీ కుటుంబ సభ్యులను నిలబెట్టి మీ దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాతో
ఫోటో తీస్తున్నారనుకుందాం. Snap బటన్ క్లిక్ చేసేలోపే మీ ఫ్యామిలీ మెంబర్స్
వెనుకగా ఎవరైనా వ్యక్తులు వెళుతున్నా, జంతువులు వెళుతున్నా, కార్లు
వంటివి మూవ్ అవుతున్నా ఆ ఆబ్జెక్టులు సైతం మీరు తీసే ఫోటోలోకి చేరే అవకాశం
ఉంది. కొంతమంది నేచురాలిటీ కోసం అలాంటి అదనపు ఆబ్జెక్టులను పెద్దగా
పట్టించుకోరు. మరి కొంతమంది Photoshop వంటి సాఫ్ట్ వేర్లతో ఎలాగైనా ఆ
అనవసరమైన వస్తువులను తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి
కోసమే Tourist Remover అనే ఆన్‍లైన్ సర్వీస్ ఒకటి ఉపయోగపడుతుంది. www.snapmania.com/ అనే వెబ్‍సైట్‍లో
లభిస్తున్న ఈ సర్వీస్ ఫోటోగ్రాఫర్లకి ఉపయోగపడుతుంది. అనవసరమైన అంశాలు
ఫోటోలో తారసపడిన వెంటనే ఆలస్యం చేయకుండా మరో ఫోటోని షూట్ చేయండి.
ఈ రెండు ఫోటోలని Tourist Remover ప్రోగ్రామ్‍ని ఇస్తే అది మొదటి ఫోటోని
రెండవ ఫోటోతో మిక్స్ చేయడం ద్వారా మనం ఏ అంశాలైతే ఫోటోలో
కనిపించకూడదనుకుంటున్నామో వాటిని తొలగిస్తుంది. ఇది అధికభాగం పెయిడ్ సర్వీస్ కావడం కొద్దిగా ఇబ్బంది.

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

ఇది చాలా బాగుంది. కృతజ్ఞతలు. కానీ మీరిచ్చిన లింకు పనిచెయ్యట్లేదు. సరైన లింకు ఇదనుకుంటా http://www.snapmania.com/info/en/trm/
దీన్ని ఉపయోగించి ఎలా వచ్చిందో చెబుతా!!