26, సెప్టెంబర్ 2007, బుధవారం

ప్లే అయ్యే పాటలు మధ్యలో కొద్ది క్షణాలు ఆగడానికి కారణం

C, D వంటి డిస్క్ద్ డ్రైవ్ లలో మనం భద్రపరుచుకున్న MP3 ఫైళ్లు Winamp వంటి మీడియా ప్లేయింగ్ సాప్ట్ వేర్ల ద్వారా ప్లే అయ్యేటప్పుడు కొన్నిసార్లు అప్పటివరకూ బాగానే ప్లే అయిన ఆడియో కొన్ని క్షణాలపాటు నిలిచిపోతున్నట్లు కొందరు చెబుతుంటారు. ఇదే విధంగా పినాకిల్ వంటి కేప్చరింగ్ కార్డ్ ల సాయంతో వీడియోని కేప్చర్ చేసేటప్పుడు అన్ని ఫ్రేములూ డిస్క్ లో స్టోర్ చేయబడక కొన్ని ఫ్రేములు డ్రాప్ చేయబడడం

కొంతమంది గమనించే ఉంటారు. దీనికి కొంతవరకూ హార్డ్ డిస్క్ మెకానిజం కారణమవుతుంది. హార్డ్ డిస్క్ లో ఉండే ప్లాటర్లు, డిస్క్ లోని Servo-Motorsకీ మధ్య ఎలైన్ మెంట్ స్థిరంగా ఉండాలి. ఐతే ఉష్ణోగ్రతలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఒక్కోసారి ఈ ఎలైన్ మెంట్ గతి తప్పుతుంటుంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోవడానికి హార్డ్ డిస్క్ నిరంతరాయంగా ధర్మల్ కాలిబ్రేషన్ అనబడే ప్రక్రియ ద్వారా Servo-Motorsకీ, ప్లాటర్లకూ మధ్య ఎలైన్ మెంట్ ని తనిఖీ చేస్తుంటుంది. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఎలైన్ మెంట్ తిరిగి కుదుర్చుకునేటప్పుడు ఆడియో విషయంలో ప్లే అవుతున్నది కాస్తా కొద్ది క్షణాలపాటు ఆగిపోవడం జరుగుతుంటుంది. దీని గురించి ఆందోళన చెందనవసరం లేదు.

కామెంట్‌లు లేవు: