20, సెప్టెంబర్ 2007, గురువారం

Yahoo! Go మీడియా ప్లేయర్



తన మార్కెట్‍ని విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా Yahoo సంస్థ
Yahoo!Go పేరిట ఓ కొత్త ప్రోడక్ట్ పరిచయం చేసింది. ప్రస్తుతం
Beta దశలో ఉన్న ఈ ప్రోడక్ట్ ని http://go.connect.yahoo.com/go
అనే వెబ్‍సైట్ నుండి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో వాడుకలో ఉన్న మీడియా
ప్లేయర్ మృదులాంత్రముల(software) కంటే భిన్నంగా ఈ Yahoo!Go
అనే మీడియా ప్లేయర్ మృదులాంత్రము కేవలం ఆడియో, వీడియో ప్లేయింగ్‍కి
ఉపయోగపడడమే కాకుండా DVR సిస్టమ్‍గానూ, మన సిస్టమ్‍లో ఉన్న
ఫోటోలను చూసుకోవడానికి Picture Viewerగా కూడా పనికొస్తుంది.
టివి ట్యూనర్ కార్డ్ ద్వారా ప్రసారం అయ్యే వీడియో సన్నివేశాలను కూడా ఈ
ప్రోగ్రామ్ ఉపయోగించి సిస్టమ్‍లో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్‍ఫోన్లని దృష్టిలో
ఉంచుకుని ఈ ప్రోగ్రామ్‍కి మొబైల్ వెర్షన్ కూడా విడుదల చేశారు. మీ ఫోన్‍లో
వాడుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: