22, ఫిబ్రవరి 2008, శుక్రవారం

ఇక అశ్రద్ధ చేయవద్దుతమ కంఫ్యూటర్ సెక్యూరిటి పట్ల చాలామంది ఉదాసీనత కనబరుస్తుంటారు. ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్‍గా వాడే అప్లికేషన్ ప్రోగ్రాములకు సంబంధించి సెక్యూరిటీ ఫిక్స్ లు లభిస్తున్నా అవేమి తమకు అవసరం లేవన్నట్లు నెట్‍లో ఏ సైట్లని బడితే వాటిని స్వేచ్చగా ఓపెన్ చేస్తుంటారు. Mpack పేరిట ఇటీవల రష్యన్ హ్యాకర్లు, ఓ హ్యాకింగ్ ప్యాకేజిని రూపొందించి, అనేక ఆన్‍లైన్ సైట్లని హైజాక్ చేసారు. అలాగే ఈ ప్యాక్‍ని ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈప్యాక్‍ని కొనుగోలు చేసినవారు దీని సహాయంతో వివిధ వెబ్ సైట్లని హైజాక్ చేయడంతో పాటు, Internet Explorer 6, 7, Windows XP SP2, Vista IE7, Windows 2000 SP4 వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‍లు, అప్లికేషన్ ప్రోగ్రాముల్లోని సెక్యూరిటీ లోపాల ఆధారంగా ఇతర కంప్యూటర్లపై సులభంగా నియంత్రణ పొందగలుగుతున్నారు. ఈ తరహ అటాక్‍ల ప్రమాదాన్ని గుర్తించి మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ లోపాలని పూడ్చే విధంగా Fixలను, అప్‍డేట్లని అందిస్తోంది. ఆన్‍లైన్‍లో స్నేహితులుగా మారిన పలువురు కలిసి Mpack రూపకల్పనలో భాగం పంచుకున్నారు. మీరు ఇంతకుముందు చెప్పుకున్న అప్లికేషన్ ప్రోగ్రాములను ఉపయోగించకపోయినా ఒక్క చెత్త సైట్‍ని విజిట్ చేస్తే చాలు Mpack అటాక్ బారిన పడే ప్రమాదం ఉంది. Windows Xp SP2 సిస్టమ్‍లు Secure Sockets Layer and Transport Level Security ఆధారంగా ఎన్‍క్రిప్టెడ్ కనెక్షన్లని కలపడంలో సమస్యాత్మకంగా ఉన్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని హ్యాకర్ మన సిస్టమ్‍లోకి ప్రవేశించగలుగుతున్నారు. ఈ Mpack హ్యాకింగ్ సెట్‍ని మొదట్లో రష్యన్ హ్యాకర్లకు మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత వివిధ ఫోరమ్‍లు, న్యూస్ గ్రూపుల నుండి భారీ స్పందన రావడంతో దానిని రూపొందించిన ఒరిజినల్ ప్రోగ్రామర్లు ఆ ప్యాక్‍ని 700-1000 డాలర్లకు విక్రయించడం మొదలుపెట్టారు. అంత ఎక్కువ ధర నిర్ణయించినా దాదాపు అధికశాతం సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని అది రిమోట్ కంప్యూటర్‍పై ఆధిపత్యం సంపాదించగలగడం వల్ల దానిని కొనుగోలు చేయడానికి వందలాదిమంది ఉత్సుకత చూపిస్తున్నారు. ఓ వెబ్‍సైట్ ఆ Mpack రూపకర్తలలొ ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాంటి పలు విషయాలు వెలుగు చూశాయి. సో… అసలు ఫైర్‍వాల్ అంటే ఏమిటో తెలియకుండా, ఏంటీవైరస్ లేకుండా, Windowsని, అప్లికేషన్ ప్రోగ్రాములనూ అప్‍డేట్ చేసుకోకుండా మనం ఎన్ని చిక్కులు తెచ్చుకుంటున్నామో చూడండి...

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, Windows XP Sp3 పైనల్ రిలీజ్ ఎప్పుదొస్తుంది?. COMODO మరియు Zone Alarm లలో ఏది బాగ పనిచెస్తుంది?. COMOCO 3 లొ లొపాలు వున్నాయని స్నేహితులు అంటున్నారు. నిజమెనా?