4, ఫిబ్రవరి 2008, సోమవారం

నిర్దిష్ట సమయానికి క్లీన్ చేసే సాఫ్ట్ వేర్లు.


సాధారణంగా అనునిత్యం Windows>Temp ఫోల్డర్‍లోనూ, టెంపరరీ ఇంటర్నెట్
ఫైల్స్ ఫోల్డర్‍లోనూ, ఇతర ఫోల్డర్లలోనూ tmp,gid,bak వంటి ఎక్స్ టెన్షన్ నేమ్‍లతో
వృధా ఫైళ్లు క్రియేట్ అవుతుంటాయి. వాటిని ఆటోమేటిక్‍గా క్లీన్ చేయ్యడానికి ఆల్రేడీ
పలు రకాల సాఫ్ట్ వేర్లు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్లని రన్ చెయ్యవలసిన పని
లేకుండా మనం నిర్దేశించిన సమయానికి లేదా విండోస్ బూట్ అయిన ప్రతీసారీ వేస్ట్
ఫైళ్ళని గుర్తించి తొలగించే విధంగా "షెడ్యూలర్"ని కలిగిన ప్రోగ్రాములు చాలా అరుదుగా
ఉన్నాయి. అలాంటి వాటిలొ "Trash it" ఒకటి.

కామెంట్‌లు లేవు: