5, ఫిబ్రవరి 2008, మంగళవారం

డిజిటల్ కెమెరాలోని ఫొటోలను ప్రింట్ చేసేటప్పుడు


డిజిటల్ కెమెరాల్లో వేర్వేరు రిజల్యూషన్ సెట్టింగులు పొందుపరచబడి ఉంటాయి. ప్రత్యేకంగా ప్రింటింగ్ నిమిత్తం ఫోటోలను తీసేటప్పుడు మీ కెమెరాలో లభ్యమయ్యే గరిష్ట రిజల్యూషన్ ఎంచుకుని ఫోటోలను షూట్ చేయండి. కెమెరా నుండి పిసికి ఫోటోలను ట్రాన్శ్ ఫర్ చేసిన తర్వాత JPG వంటి కంప్రెస్డ్ ఫార్మేట్లని ఉపయోగించేటప్పుడు కొంతవరకూ ఇమేజ్‍లోని కలర్ పిక్సెళ్ళు తొలగించబడతాయి. అలాగే కెమెరా నుండి సిస్టమ్‍లోకి ట్రాన్శ్ ఫర్ చేసిన వెంటనే ఫోటోని నేరుగా ప్రింట్ చేసుకోకుండా ఓసారి ఫోటోని ఆపాదమస్తకం పరిశీలించి ఏవైనా లోపాలు కన్పిస్తునట్టయితే Adobe Photoshop వంటి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లతో వాటిలోని లోపాలను సరిచేసిన తర్వాత మాత్రమే ప్రింట్ చేసుకోండి. 4x6 అంగుళాల ఫోటోలను ప్రింట్ చేసేటప్పుడు గ్లాసీ ఫోటోపేపర్‍ని ఉపయోగించడం కన్నా matte-finish ఫోటోకార్డులపై ప్రింట్ తీసుకోవడం వల్ల ఫోటోలు నాణ్యంగా కన్పిస్తుంటాయి. స్పెషల్ ఫోటో ఇంక్‍లను వాడడం వల్ల మరింత కలర్‍ఫుల్‍గా ఫోటోలు వస్తాయి.