24, ఫిబ్రవరి 2008, ఆదివారం

ఫిబ్రవరి 24, 2008 మీటింగ్ రిపోర్ట్

ఫిబ్రవరి 24, 2008 సమావేశ నివేదిక
ప్రదేశం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
సమయం: మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకూ.
హాజరైన సభ్యుల వివరాలు:
1. ఎం. భాస్కర్
2. ఎల్. రాము (మిర్యాలగూడ)
3. బి. పట్టాభిరాం
4. ఎన్. కృష్ణకిషోర్
5. ఆర్. శ్రీనివాస్
6. పి. శ్రీనివాస్
7. రవీంద్ర కాట్రగడ్డ
8. సాయిచరణ్
9. సి.పి.ఆర్. దీక్షితులు (రాము)
10. ఆర్. ఎల్. నాయక్
11. ఎ.వి.యం. రావు (మల్లిఖార్జునరావు)
12. బి. రఘురాం
13. బి.వై. శివరాం
14. జి. చైతన్య
15. సిహెచ్. సత్యనారాయణ
16. కె. నాగభూషణం (వరంగల్)
17. నల్లమోతు శ్రీధర్
18. గణపతి (రైతేరాజు బ్లాగు)
19. గణపతి గారి స్నేహితులు

మున్నాకాల్పనిక్ టైఫాయిడ్ ఫీవర్ వల్ల రాలేకపోయారు. నవీన్ రెడ్డి గారు ముఖ్యమైన ఆఫీస్ పనుల వల్ల, శ్రీనివాస్ (Mr. Srinu) బెంగుళూరులో ఉండడం వల్ల, గోవర్థన్ కుమార్ (కర్నూల్)లో ఉండడం వల్ల మరికొంతమంది సభ్యులు సన్నిహితుల పెళ్లిళ్లు ఉండడం వల్ల ఈ సమావేశానికి రాలేకపోయారు.
సరిగ్గా 2.55 నిముషాలకు నేను కృష్ణకాంత్ పార్క్ వద్దకు చేరుకునేసరికి ఆ సరికే అక్కడకు వచ్చిన పట్టాభిరాం గారు వాళ్ల అబ్బాయిచే కృష్ణకాంత్ పార్క్ టికెట్ కౌంటర్ వద్ద వినైల్ పెయింటింగ్ బ్యానర్ కట్టిస్తూ కన్పించారు. నేను ఆశ్చర్యపడి ఇంత ఆర్భాటం ఎందుకు సర్.. అంటే సమావేశానికి హాజరయ్యే వారు కన్ ఫ్యూజ్ కాకుండా అంటూ బదులిచ్చారు. 3.10 వరకూ చూసినా ఐదారుగురం మాత్రమే ఉన్నాం.. సరే పెళ్లిళ్ల తాకిడి కదా ఇంకా ఎవరూ రారులే అన్న ఉద్దేశ్యంతో లోపలికి వెళ్లాం. ఒకరొకరిగా వచ్చి కలుస్తూ మొత్తం 19 మందిమి అయ్యాం.

1

టికెట్ గేట్ వద్ద పట్టాభిరాం గారు ఏర్పాటు చేసిన వినైల్ ప్రింట్

 

ఫోరమ్ విషయమై చర్చించిన అంశాలు:


http://computerera.co.in/forum అనే మన ఫోరంలో అందరినీ ఇబ్బందిపెట్టే వైరస్ లకు పరిష్కారాలు, చిట్కాలు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్లు వంటి సమగ్ర సమాచారాన్ని పొందుపరచడానికి కమిటెడ్ సభ్యులందరూ కనీసం రోజుకి ఒకటి రెండు పోస్టులైనా చేయాలన్న ప్రతిపాదనకు అందరి నుండి సుముఖత వ్యక్తమైంది. రవీంద్ర కాట్రగడ్డ వంటి కొంతమంది సభ్యులు తమ వద్ద కంటెంట్ ఉండీ దానిని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పలేమోమో అన్న సందేహంతో రాయడం లేదని అభిప్రాయం వ్యక్తపరిచారు. కంటెంట్ ముఖ్యం కానీ, దానిని ఎలా వ్యక్తపరిచినా అందరికీ ఉపయోగపడుతుందని, అంతగా అవసరం అయితే తర్వాత మోడరేటర్లు ఎడిట్ చేస్తారని చెప్పాం. ఫోరంలో తెలియక రాంగ్ సెక్షన్లలో పోస్టులు చేసేవారిని ఎడ్యుకేట్ చెయ్యడం ఎలా.. అన్న అంశం చర్చకు వచ్చినప్పుడు. ప్రతీ విభాగంలో Sticky పోస్టులు పెట్టి ఆ విభాగంలో ఎలాంటి అంశాలు పోస్టు చేయాలన్నది వివరంగా రాసిపెడితే బాగుంటుంది అని రాము (మిర్యాలగూడ) సూచించారు.

2

ఎడమ నుండి కుడికి వరుసగా: పట్టాభిరాం, భాస్కర్, రాము (మిర్యాలగూడ), నల్లమోతు శ్రీధర్, శ్రీనివాస్

 

ఇంతమంది కమిటెడ్ గా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టుల గురించి మరింత మంది దృష్టికి తీసుకువెళ్లడం ఎలా అనే అంశం చర్చకు వచ్చినప్పుడు.. Friends Listలోకి వారికి లింకులు ఫార్వార్డ్ చేయడంతోపాటు Orkutలోని వివిధ కమ్యూనిటీలను విజిట్ చేసే మన సభ్యులే వాటిలో మన కార్యకలాపాల గురించి లింకులు పోస్ట్ చేయడం, అలాగే తాము విజిట్ చేసే ఇతర ఫోరంలలోనూ వీటి గురించి పోస్టులు చేయడం ద్వారా మరింతమంది వీటి ద్వారా ప్రయోజనం పొందవచ్చనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. అలాగే ఫోరంలో ప్రతీ పోస్ట్ యొక్క పేజీ క్రింద Send to a friend వంటి లింకు పొందుపరిస్తే తమకు నచ్చిన వ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు పంపించి తద్వారా వారూ ఇటువైపు చూసేలా చేయవచ్చనే సూచనా వచ్చింది. చాలా మంచి సూచన. దీని సాధ్యాసాధ్యాలు వీలైనంత త్వరగా పరిశీలించాలి. అలాగే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు చాలావరకూ స్వంత వెబ్ సైట్లు ఉన్న కారణంగా ఆయా కాలేజీల మెయిల్ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు సేకరించి మన కార్యకలాపాల గురించి వివరంగా ఓ note ప్రిపేర్ చేసి వారికి పంపించడం ద్వారా వారి సైట్లలో మన లింకులు పెట్టేలా.. లేదా కనీసం వారి నోటీస్ బోర్డ్ లో ఒక్కసారైనా మన లింకులు పొందుపరిచేలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని నాగభూషణం గారు (వరంగల్) ప్రస్తావించడం జరిగింది. నిజంగా చాలా మంచి ఆలోచన ఇది. కానీ సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి. వీలైనంతవరకూ ప్రయత్నిస్తే తప్పేముంది అన్పిస్తోంది, మన ప్రయత్నం చేయకుండా ఏమీ సాధ్యం కాదుగా!

3

ఎడమ నుండి కుడికి వరుసగా: ఆర్. ఎల్. నాయక్ (సగభాగమే ఫొటోలో వచ్చారు), రవీంద్ర కాట్రగడ్డ, సాయిచరణ్, భాస్కర్, నాగభూషణం (వరంగల్), నల్లమోతు శ్రీధర్, రాము (మిర్యాలగూడ), దీక్షితులు (రాము)

 

4

ఎడమ నుండి కుడికి వరుసగా: నల్లమోతు శ్రీధర్, రాము, దీక్షితులు, నాయక్, మల్లిఖార్జునరావు, పట్టాభిరాం

 

8

ఎడమ నుండి కుడికి వరుసగా: దీక్షితులు, నాయక్, మల్లిఖార్జునరావు, పట్టాభిరాం,  శివరాం, కృష్ణకిషోర్ (నువ్వుశెట్టి సోదరులు)

ఛాట్ రూమ్ గురించి జరిగిన చర్చ సారాంశం:
ఛాట్ రూమ్ లో ప్రశ్నలు అడిగేవారు ఎక్కువయ్యారు, సమాధానాలు చెప్పేవారు తక్కువయ్యారు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఓ విచిత్రమైన సమస్య బయటపడింది. ఛాట్ రూమ్ లో రెగ్యులర్ గా ఏక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న కొంతమంది కూడా నేను (నల్లమోతు శ్రీధర్), ప్రసాద్ గారు, సాయిపోతూరి గారు వంటి వారు ఉన్నప్పుడు... తాము చెప్పే సమాధానం కరెక్టో కాదో ఎందుకు చెప్పడం.. పెద్దవాళ్లు ఉన్నారు కదా, వాళ్లే చూసుకుంటారు అన్న తరహా ఆలోచనతో కొంతమంది తమకు ఇతరుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉన్నా ఆగిపోతున్నారని ఈ మీటింగ్ లో తెలిసింది. "ఇక్కడ ఎవరమూ నాలెడ్జ్ విషయంలో మాస్టర్లం కాదు.. అందరికీ తెలిసింది కొద్దోగొప్పో కాబట్టి నిస్సంకోచంగా మీకు తెలిసిన నాలెడ్జ్ ని ఇతరులతో షేర్ చేసుకోండని" చెప్పడం జరిగింది. అలాగే ఫోరంని మోడరేట్ చెయ్యడానికి నాగభూషణం గారు (వరంగల్), రవీంద్ర కాట్రగడ్డ గారు, రాము గారు (మిర్యాలగూడ), చైతన్య గారు ఉత్సుకత చూపించారు. ఇకపోతే శ్రీనివాస్ గారు, పట్టాభిరాం గారు తెలుగు చదవడం విషయమై (అక్షరాలు విడిపోయి కన్పించడం వల్ల) చాలా ఇబ్బంది పడుతూ ఫోరం, ఛాట్ రూమ్ లకు రాలేకపోతున్నామని చెప్పారు. ఇలాంటి సమస్యని అధిగమించడం ఎలాగన్నది కొద్దిగా ఆలోచించాలి. కేవలం మనలను నేరుగా అప్రోచ్ అయేవారికే మనం తెలుగులో వచ్చే సందేహాలను గైడ్ చెయ్యగలుగుతున్నాం తప్ప మనల్ని అప్రోచ్ అవని వారు విసుగుచెంది వెళ్లిపోయే ప్రమాదం ఉంది కదా! అలాగే ఫోరం యొక్క ఇంటర్ ఫేస్ మరింత ఆకర్షణీయంగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం చాలామంది వ్యక్తపరిచారు. దానిని ప్రయత్నించాలి.

 

సరదా సరదా డిస్కషన్లు మధ్యలో కృష్ణకాంత్ పార్క్ వాళ్ల కళ్లుగప్పి దొంగచాటుగా తీసుకువెళ్లిన తినుబండారాలు ఆరగిస్తూ చాలా ఉత్సాహంగా జరిగింది సమావేశం. కృష్ణకిషోర్ గారు, పట్టాభిరాం గారు తీసిన ఫొటోలు.. నేను సెల్ లో రికార్డ్ చేసిన కొద్ది నిడివి గల ఆడియో ఈ సమావేశపు జ్ఞాపకాలుగా నిలిచాయి.

- నల్లమోతు శ్రీధర్
24-02-2008
10.49 PM

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

ప్చ్..గురువు గారు.మేము కూడ రావలసింది. చాల మిస్సయ్యాం. నెక్స్ట్ టైమ్ భాగ్యనగరం వస్తే తప్పకుండ వస్తాం.