28, జులై 2007, శనివారం

పదాలు చెప్పే కధలుSign off : లోకల్ ఏరియా నెట్‌వర్క్‌లో ఉన్న ఒక కంప్యూటర్ నుండి బయటకు రావడాన్ని లేదా మెయిల్ ఎకౌంట్ల నుండి వెలుపలికి రావడాన్ని Sign off లేదా log off, Sign Out అని వ్యవహరిస్తుంటారు.

Sign on/Sign In: కంప్యూటర్ సిస్టమ్‌లోకి ఇ-మెయిల్ ఎకౌంట్లలోకి ప్రవేశించే ప్రక్రియను sign on అని అంటారు. దీనినే ఒక్కోసారి Sign in అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రక్రియలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు అవసరమవుతాయి.

Signal-to-Noise Ratio: వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం ప్రసారం చెయ్యబడే సమయంలో డేటా ట్రాన్స్ఫరింగ్ లో మధ్యలో అవాంతరాలు ఏర్పడుతుంటాయి. దీనినే noise అంటుంటారు. ప్రసరించబడుతున్న సిగ్నల్‌కి నాయిస్‌కి మధ్య ఉన్న నిష్పత్తిని ఈ Signal-to-noise ratioగా పిలుస్తారు. సహజంగా దీన్ని డెసిబల్స్‌లో కొలుస్తారు.

Silicon: రాళ్ళు,ఇసుకలో లభిస్తూ కంప్యూటర్ చిప్‌లను తయారు చెయ్యడానికి ఉపయోగపడే మూలకమిది. ఈ సిలికాన్ అనే పదాన్ని ఆధారంగా చేసుకునే అమెరికాలోని SanJose, California చుట్టుపక్కల ప్రాంతాలకు సిలికాన్ వ్యాలీ అనే పేరుతో పిలుస్తుంటారు.

SIMD:Single Instruction/Multiple Data అనే పదానికి సంక్షిప్త రూపమిది. వేర్వేరు సమాచారంపై ఒకే ఆపరేషన్లను నిర్వహించే పారలల్ ప్రాసెసర్ ని SIMD పేరుతో పిలుస్తుంటారు.

1 కామెంట్‌:

Kesari చెప్పారు...

బాగు౦ది..శ్రీధర్ గారూ...!!

అలాగే..ఈ మధ్య బాగా ఆచరణ లో ఉన్న.."సి౦గిల్ సయినాన్ " గురి౦చి ...వీలున్నప్పుడు.. పేర్కొన౦డి..క్రొత్త వారికి ఉపయొగపడుతు౦ది...