23, జులై 2007, సోమవారం

చిట్కాలు - 21. NVROM cleared by jumper అనే మెసేజ్ బూటింగ్ సమయంలో కనిపిస్తుంటే CMOS జంపర్ సరిగ్గా పెట్టలేదని అర్ధమన్నమాట.

2. PPT to SCR అనే సాప్ట్ వేర్ని ఉపయోగించి పవర్ పాయింట్ ప్రెజంటేషన్లను స్క్రీన్‌సేవర్లుగా మార్చుకోవచ్చు.

3. మానిటర్ రవాణాలో కదిలినప్పుడు,కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే "Out-of-Sync" అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

4. USB డివైజ్‌లను కొన్నప్పుడు మొదట డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేస్తూ డివైజ్‌ని కనెక్ట్ చెయ్యమని అడిగినప్పుడు మాత్రమే కనెక్ట్ చేయండి.

5. కంప్యూటర్ ద్వారా బార్‌కోడ్‌లను రీడ్ చెయడానికి తప్పనిసరిగా Barcode Reader అనే హార్డ్‌వేర్ పరికరం మన వద్ద ఉండాలి.

6. లేజర్‌జెట్ ప్రింటర్ కలిగి ఉన్నవారు ప్రింటర్‌ని UPSకి కాకుండా నేరుగా పవర్‌బోర్డుకి కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి.

7. ఫోటో్‌షాప్‌లో Clipping Path అనే టెక్నిక్‌ని అనుసరించి ఇమేజ్‌ల్లోని అదనపు భాగం ట్రాన్స్పరెంటుగా కనిపించేలా చేయవచ్చు.

కామెంట్‌లు లేవు: