26, జులై 2007, గురువారం

సాప్ట్ వేర్ బగ్‌ల బారిన పడకుండా!


ఇప్పటివరకూ బాగానే పనిచేసిన కంప్యూటర్ 'ఆ ఒక్క' సాప్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేయగానే ఇష్టమొచ్చినట్లు ఎర్రర్ మెసేజ్‌లు ఇవ్వడం మొదలు పెట్టిందనుకోండి. ఆ సాప్ట్ వేర్ లో ఏదో లోపం ఉన్నట్లు భావించాలి. సాధారణంగా మనం అను నిత్యం ఉపయోగించే సాప్ట్ వేర్లను పలువురు ప్రోగ్రామర్లు కొన్ని మాడ్యూళ్ల చొప్పున పంచుకుని అభివ్ళద్ధి పరుస్తుంటారు. సాప్ట్ వేర్ ప్రోగ్రామర్ల మధ్య సమన్వయం లోపించడం వల్ల ప్రోగ్రామింగ్ కోడ్‌లో చోటు చేసుకునే లోపాలు ఆ సాప్ట్ వేర్ ని ప్రాక్టికల్ గా ఉపయోగించేటప్పుడు ఇలా ఎర్రర్ల రూపంలో బహిర్గతం అవుతుంటాయి. అందుకే ఏదైనా కంపెనీ కొత్త సాప్ట్ వేర్ ని డెవలప్ చేసిన వెంటనే Beta వెర్షన్‌ని రిలీజ్ చేస్తుంది. దాన్ని ఉపయోగించిన యూజర్లు ఏమైనా కంప్లైంట్లు చేసినట్లయితే ఆ లోపాలను సరిచేసి ఫైనల్ వెర్షన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ నేపధ్యంలో బీటా వెర్షన్ల వల్ల సిస్టం క్రాష్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సాధ్యమైనంతవరకూ ఫైనల్ వెర్షన్ విడుదల అయ్యేటంతవరకు ఎదురు చూడండి. అలాగే మీరు ఇన్‌స్టాల్ చేయదలుచుకున్న సాప్ట్ వేర్ కి ఇతర కంపాటబులిటీ సమస్యలు ఏవైనా ఉన్నాయేమో వివిధ ఫోరంలలో ఇతర యూజర్ల అభిప్రాయాలను చదవడం ద్వారా తెలుసుకున్న తర్వాతే ఇన్‌స్టాల్ చేయండి.

1 కామెంట్‌:

Kesari చెప్పారు...

భలే..!! అదే౦టో.. మీరు చెప్తున్న౦త సేపూ...నాకు..Microsoft IE 7 తెగ గుర్తొచ్చి౦ది సుమ౦డీ...!! ;))