18, జులై 2007, బుధవారం

చిట్కాలు -1


1. ఇంటర్‌నెట్‌లో ఉండే వివిధ ఆన్‌లైన్ టివి చానెళ్ళని విండోస్ మీడియా ప్లేయర్,
రియల్ ప్లేయర్ల ద్వారా ఆక్సెస్ చేసుకోవచ్చు.

2. ఒకటి కంటే ఎక్కువ డయలప్ కనెక్షన్లు ఉన్నప్పుడు అన్నింటిలోనూ Save
Password ఆప్షన్ టిక్ చేయబడితేనే ఆ ఆప్షన్ పని చేస్తుంది.
లేదంటే మళ్లీ మళ్లీ పాస్ వర్డ్ టైప్ చేయవలసి వస్తుంది.

3. Dos Command ప్రాప్ట్‌లో Windows డైరెక్టరీలో ఉండగా scanreg/
backup అనే కమాండ్‌ని ఉపయోగించి విండోస్ రిజిస్ట్రీని బ్యాకప్ తీయవచ్చు.

4. ఆప్టికల్ మౌస్‌లలో క్రింది భాగంలో ఉండే సెన్సార్ టేబుల్, మౌస్ పాడ్ వంటి వాటి
ఉపరితలాన్ని గుర్తించడం ద్వారా మౌస్ మూమెంట్‌ని నిర్ణయించుకుంటుంది.

5. పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉన్న RAR ఫైళ్ళని Advanced RAR
Password Recovery సాప్ట్ వేర్ తో రికవర్ చేసుకోవచ్చు.

6. www.aponline.gov.in వెబ్‌సైట్‌లో సర్వర్ బాండ్‌విడ్త్ తక్కువగా
ఉండడంవల్ల 10వ తరగతి, ఇంటర్ వంటి పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది.

7. ఫోటోషాప్‌లోకి ఇతర సిస్టమ్‌ల నుండి ఫొటోలను కాపీ చేసుకువచ్చినపుడు
"కలర్ ప్రొఫైల్" సైతం అలాగే ఉంచడం మంచిది.

8. screensaverకి పాస్‌వర్డ్‌ని సెట్ చేసి మర్చిపోయినట్టైతే విండోస్ రిజిస్త్ట్రీ
ద్వారా పాస్‌వర్డ్‌ని తొలగించే అవకాశం ఉంటుంది.

9. External TV Tunercardని ఉపయోగించి టివి ప్రోగ్రాముల్ని రికార్డ్
చేసుకోవడానికి వీలుపడదు. ఇంటర్నల్ కార్డ్ ఉండవలసిందే!

10. డిజిటల్ కెమెరాల్లో "డిజిటల్ జూమ్" వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఎక్కువ ఆప్టికల్ జూమ్ ఉన్న కెమెరాలనే ఎంపిక చేసుకోండి.

కామెంట్‌లు లేవు: