22, జులై 2007, ఆదివారం

XP SP2 లోని "ఇన్‌ఫర్మేషన్ బార్" ఇబ్బందులుWinXPలో SP2 ఇన్‌స్టాల్ చేసిన తర్వాత Internet Explorer లో Information Bar పేరిట కొత్త సదుపాయం జతచేయబడుతుంది. ఈ ఇన్‌ఫర్మేషన్ బార్ ఇంటర్నెట్ నుండి ఆటోమాటిక్‌గా ఫైళ్ళు సిస్టంలోకి డౌన్‌లోడ్ అవకుండా అడ్డుకుంటుంది. కొన్ని ప్రమాదకరమైన వెబ్‌సైట్ల నుండి దాడిని ఎదుర్కొనడానికి ఈ సదుపాయం పొందుపరచబడింది. అయితే దీనివల్ల Automatic download ఆప్షన్ ఉన్న cnet.com వంటి కొన్ని సైట్ల నుండి ఫైళ్ళు మనం మనకు కావాలి అని ఉద్దేశ్యపూర్వకంగా డౌన్ లోడ్ చేసుకుంటున్నా డౌన్ లోడ్ అవకుండా నిరోధించబడతాయి. ఈ నేపధ్యంలో ఈ ఆప్షన్ డిసేబుల్ చేయడానికి Internet Explorer>Tools>Internet Options>Security>CustomLevel అనే విభాగంలో.. "Automatic prompting for file downloads అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఇకపై ఇన్‌ఫర్మేషన్ బార్ ఫైళ్ళని అడ్డుకోకుండా ఉంటుంది.

కామెంట్‌లు లేవు: