17, జులై 2007, మంగళవారం

రూట్‍కిట్ లను గుర్తించండి...మన కంప్యూటర్‌లో రన్ అవుతున్న అప్లికేషన్లు, ప్రాసెస్‌లు, సిస్టం డేటాని దాచిపెట్టడానికి ఉపయోగించే ప్రోగ్రాముల్ని Rootkit అంటారు. అనేక మంది హ్యాకర్లు మన సిస్టంలోకి సీక్రెట్‌గా వైరస్‌లు, స్పైవేర్లు వంటి వాటిని ప్రవేశపెట్టడానికి Rootkitలను ఆసరా చేసుకుంటున్నారు. రూట్‌కిట్ ద్వారా మన సిస్టంలో గోప్యంగా దాగి ఉన్న malwareలను ఏంటి్‌వైరస్ సాప్ట్ వేర్లు గుర్తించలేవు. ఈ నేపధ్యంలో మన సిస్టంలో రూట్‌కిట్‌లు ఏమైనా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్నాయేమో వెదికి పట్టుకునే ప్రోగ్రామ్సు గురించి తెలుసుకుందాం.

BitDefender Rootkit Uncover : ప్రస్తుతం Beta-2 వెర్షన్‌గా లభిస్తున్న ఈ ప్రోగ్రామ్ ని http://download.bitdefender.com/windows/desktop/internet_security/beta/ అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. DarkSpy 1.05 అనే మరో ప్రోగ్రామ్ ని http://www.fyyre.net/~cardmagic/index_en.html అనే సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. F-Secure సంస్ఠ F-Secure Black Light అనే రూట్‌కిట్ రిమూవల్ టూల్‌ని రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ట్రయల్ వెర్షన్‌ని http://www.f-secure.com/blacklight/try_blacklight.html అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. http://www.gmer.net/index.php అనే వెబ్‌సైట్ నుండి GMER అనే మరో టూల్, http://helios.miel-labs.com/ అనే సైట్ నుండి Helios Lite అనే టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చైనీస్ భాషలో లభించే IceSword అనే టూల్‌ని http://www.xfocus.net/tools/200509/1085.html అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భాష అర్ధం కాకపోతే AltaVista ఆన్‌లైన్ ట్రాన్స్లేషన్ సర్వీస్ సాయం తీసుకోండి. http://www.rkdetector.com/ వెబ్‌సైట్లో RKDetector ప్రోగ్రాం, http://download.sysinternals.com/Files/RootkitRevealer.zip అనే సైట్‌లో Rootkit Revealer 1.71 అనే ప్రోగ్రాం, http://greatis.com/unhackme/ అనే సైట్ నుండి UnHackMe అనే ప్రోగ్రాంని డౌన్‌లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఏవైనా రూట్ కిట్లు ఉన్నాయోమో తనిఖీ చేసుకోండి.

కామెంట్‌లు లేవు: