24, నవంబర్ 2007, శనివారం

డిజిటల్ కెమెరా వినియోగదారులకుఫోటోషాప్ వంటి శక్తివంతమైన ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లపై పెద్దగా ఆవగాహన లేనివారికి Turbo Photo అనే సాఫ్ట్ వేర్ చాలా సులభంగా అర్ధమవుతుంది. ప్రత్యేకించి ఈ సాఫ్ట్ వేర్‌ని డిజిటల్ కెమెరాల వినియోగదారుల కోసం రూపొందించారు. ఇందులో Color Balance, HSB mode adjustment, Noise reduction, Skin beautifuication, Rotate, Crop వంటి అన్ని రకాల ప్రామాణిక ఫోటో ఎడిటింగ్ సదుపాయాలు పొందుపరచబడ్డాయి. అలాగే ఫోటోలకు ఫ్రేమ్‌లను, టెక్ట్స్ నూ జతచేయవచ్చు. వందల సంఖ్యలో ఉన్న ఫోటోలను ఒకేసారి ఎడిట్/ప్రింట్ తీసుకోవచ్చు. స్లైడ్‌షో్‌లుగా ప్రదర్శించుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: