2, నవంబర్ 2007, శుక్రవారం

పిసి పనితీరు బాలేదా??


మీ వద్ద P4 DualCore ప్రాసెసర్, 512 MB RAM ఉన్నా సిస్టమ్ స్లోగా ఉంటుందా. సిస్టమ్ పెర్ఫార్మెన్స్ విషయంలో పలు అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ప్రాసెసర్ పాత్ర పరిమితమే....

ప్రాసెసర్ ఎంత శక్తివంతమైనదైనా డేటాని ప్రాసెస్ చెయ్యడం వరకే దాని పనితీరు ప్రతిఫలిస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల విషయంలో ప్రోగ్రాములను కంపైల్ చెయ్యడం, రన్ చెయ్యడం, గ్రాఫిక్ అప్లికేషన్ల విషయంలో ఎఫెక్టులను రెండర్ చెయ్యడం, ఎడిటింగ్ వేగంగా జరగడం వరకే ప్రాసెసర్ బాధ్యత వహిస్తుంది. ప్రాసెసర్ వేగవంతమైనదైనా FSB (front Side bus) తక్కువగా ఉంటే ఎప్పటికప్పుడూ ప్రాసెస్ చెయ్యవలసిన సమాచారం కోసం ప్రాసెసర్ స్లో అయినట్లు కనిపిస్తుంది.

మెమరీ లోడింగ్‌గే పనికొస్తుంది...

128, 256, 512 MB మొదలగు వివిధ మొత్తాల్లో RAM ప్రస్తుతం వాడుకలో ఉంది . RAM ఎక్కువగా ఉన్న కొద్ది అప్లికేషన్లు, డివైజ్ డ్రైవర్లు ఎక్కువగా లోడ్ అవుతాయి. ఏకకాలంలో ఎక్కువ మొత్తంలో డేటా మెమరీలో ఇమడగలగడం వల్ల ఒకేసారి పలు అప్లికేషన్లపై పనిచేసేటప్పుడు ఒకదాని నుండి మరో దానికి స్విచ్ అవడం వేగంగా జరుగుతుంది. ప్రాసెసింగ్ నిమిత్తం ప్రాసెసర్‌కి తగిన మొత్తంలో సమాచారాన్ని తన నుండి మెమరి పంపించగలుగుతుంది.


హార్డ్‌డిస్ స్టోరేజ్ విషయంలోనే...


ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ,RPM కలిగిన హార్డ్‌డిస్క్‌ల్లో డేటాని సేవ్ చేసేటప్పుడు,తిరిగి యాక్సెస్ చేసేటప్పుడూ స్పీడ్ కనిపిస్తుంది. అంటే ఫైల్ సేవింగ్, ఓపెనింగ్, డిలీటింగ్ ఏక్టివిటీలు మాత్రమే హార్డ్‌డిస్క్ కెపాసిటీపై ఆధారపడి ఉంటాయి.

పెర్ఫార్మెన్స్‌ని ప్రభావితం చేసే ఇతర అంశాలు...


సహజంగా పై మూడు అంశాలు శక్తివంతమైనట్లయితే వాస్తవంగా సిస్టమ్ పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉండాలి. అయితే పిసి యూజర్లు సిస్టమ్‌ని ఎప్పటికప్పుడు సరిగ్గా మెయింటైన్ చెయ్యడం తెలియకపోవడం వల్ల అన్నీ బాగున్నా పని తీరు మాత్రం తక్కువగా ఉంటోంది.

అనవసరమైన ప్రోగ్రాములు, విండోస్‌తోపాటు మెమరీలోకి లోడ్ చెయ్యబడడం వల్ల బూటింగ్ స్లో అవుతుంది. MSCONFIG ద్వారా అవసరం లేని స్టార్టప్ ప్రోగ్రాముల్ని డిసేబుల్ చెయ్యండి.

మనం ఒక చిన్న ఫైల్‌ని ఓపెన్ చేసి క్లోజ్ చేసినా రిజిస్ట్రీలో రెండు ఎంట్రీలు అదనంగా చేర్చబడతాయి. అవన్నీ పనికిరానివే. ఇలా రిజిస్ట్రీ పరిమాణం పెరిగిపోయే కొద్దీ రిజిస్ట్రీ కూడా విండోస్‌తోపాటు మెమరీలోకి లోడ్ అయి సిస్టమ్ స్లో అవుతుంది. రిజిస్ట్రీ క్లీనింగ్ టూల్స్‌తో రిజిస్ట్రీని క్లీన్ చేస్తుండండి.

కామెంట్‌లు లేవు: