24, నవంబర్ 2007, శనివారం

మనం వాడేది అసలైన కొటేషన్ మార్క్ కాదు..


కీబోర్డ్ ద్వారా ' మరియు " చిహ్నాలను మనం కొటేషన్ మార్కులుగా ఎంటర్ చేస్తుంటాం కదా. వాస్తవానికి అవి నిజమైన కొటేషన్ మార్కులు కావు. వీటిని Hash Marks అంటారు. అడుగులు, అంగుళాలను తెలియజేసేటప్పుడు మాత్రమే (ఉదా.కు.. 9'6") వీటిని ఉపయోగించాలి. వంపులుగా ఉండే (“) నిజమైన కొటేషన్ మార్కులకు బదులుగా ఈ హాష్ మార్క్ ని మీరు ఉపయోగిస్తున్నట్లయితే మీకు సరైన పరిజ్ఞానం లేనట్లే భావిస్తారు. మరి నిజమైన కొటేషన్ మార్కులకు కీబోర్డ్ నుండి పొందడం ఎలాగంటే..

ముందు న్యూమరిక్ కీప్యాడ్ ని ఆన్ చేయండి. ఇప్పుడు..

Alt+0145 (న్యూమరిక్ కీపాడ్ పై సంఖ్యలని ప్రెస్ చేయాలి) - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ‘ అనే ఎడమచేతి వైపు సింగిల్ కోట్ వస్తుంది.
Alt+0146 - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ’ అనే కుడిచేతి వైపు సింగిల్ కోట్ వస్తుంది.
Alt+0147 - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే “ అనే ఎడమ చేతి వైపు డబుల్ కోట్ వస్తుంది.
Alt+0148 - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ” అనే కుడిచేతి వైపు డబుల్ కోట్ వస్తుంది.

అంతా బాగానే ఉంది కానీ, ఇలా కొటేషన్ మార్కులు ఎంటర్ చేయవచ్చినప్పుడల్లా అన్ని కీలను ప్రెస్ చేయడం కష్టంగా ఉంటుంది కదూ! అందుకే పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ ప్రెస్ వంటి సాఫ్ట్ వేర్లలో Typographer's Quotes లేదా Smart Quotes పేరిట ఆప్షన్లు పొందుపరచబడి ఉంటాయి. ఈ ఆప్షన్లని ఎనేబుల్ చేసిన తర్వాత ఇంతకాలం మనం ఎంటర్ కీకి పక్కనే కనిపించే హాష్ మార్క్ కీని ప్రెస్ చేస్తే అని నిజమైన కర్లీ కొటేషన్ మార్కుగా మార్చబడుతుంటుంది.

2 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

ఎమ్మెస్ వర్డులో మామూలుగానే ఆ వంపుదిరిగిన కోట్లు పడతాయండి. నిటారుగా ఉండేవి కావాలంటే.. నాకు తెలిసిన మార్గం, ముందా కోటున్నొక్కి తరవాత, “ctrl z” ను నొక్కితే సరిపోతుంది. ఇది వర్డు 2003 సంగతి.

Unknown చెప్పారు...

చదువరి గారూ, మీ ఫీడ్ బ్యాక్ కి ధన్యవాదాలు. నేను వర్డ్ ని పెద్దగా వాడను. సహజంగా పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ ప్రెస్, నోట్ ప్యాడ్ లలో ఇలా హాష్ మార్కులు వస్తుంటాయి. నేను వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ అంశం రాయడం జరిగింది. సో.. మీరు చెప్పినట్లు వర్డ్ లో డీఫాల్ట్ గానే టైపోగ్రఫర్ కోట్స్ ఎనేబుల్ చేయబడ్డాయని అర్థం చేసుకోవాలన్న మాట.

- నల్లమోతు శ్రీధర్