29, నవంబర్ 2008, శనివారం

మీ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోవాలంటే..

ఆనందకరమైన సందర్భాలను కెమెరాలో బంధించుకుని విదేశాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులతో షేర్ చేసుకోవాలనిపించడం సహజం. దీనికి పెద్ద కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదు. ముందు మీ డిజిటల్ కెమెరాని మీ పిసికి కనెక్ట్ చేసి మీ కెమెరాలోని ఫోటోలన్నింటిని పిసిలోకి బదిలీ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇంటర్నెట్‍కి అప్‍లోడ్ చేయడం చాలా సులభం. ఇంటర్నెట్‍లో అనేక ఫోటోషేరింగ్ వెబ్‍సైట్లు లభిస్తున్నాయి. flickr అనే సైట్‍ని ఓపెన్ చేయండి. అందులోకి ప్రవేశించగానే Create your account అనే బటన్ ఉంటుంది . దాన్ని క్లిక్ చేయండి. ఈ వ్యాసం మొదట్లొ చెప్పిన ప్రకారం మీరు ఇప్పటికే యాహూ మెయిల్ అకౌంట్‍ని క్రియేట్ చేసుకున్నారు కదా ! ఆ యాహూ అకౌంట్‍తొ నేరుగా Flickr లో ఉచిత అకౌంట్ సృష్టించుకోవచ్చు. తర్వాత మీ కంఫ్యూటర్లో ఉన్న ఫోటోలను ఆ సైట్‍లోకి అప్‍లోడ్ చేసుకుని Send an invite to Flickr అనే బటన్‍ని ఉపయోగించి మీ ఆత్మీయులకు వారి మెయిల్ అడ్రస్‍కి ఇన్విటేషన్ పంపించవచ్చు. వారు మీ ఫోటోలను Flickr లోకి వచ్చి చూడగలుగుతారు. Flickr మాదిరిగానే Photobucket, Zommr, Phanfare, Snapfish, Webshots, Smugmug, Woophy వంటి అనేక ఫోటొ షేరింగ్ సర్వీసులు లభిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు: