ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతున్న అనేక ఉచిత టెలివిజన్ చానెళ్ళని మన కంప్యూటర్ స్క్రీన్ మీదే వీక్షించడానికి “JLC Internet TV” అనే ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. చాలా తక్కువ పరిమాణం గల ఈ ప్రోగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అది నెట్‌కి కనెక్ట్ అయి ప్రస్తుతం లభిస్తున్న చానెళ్ళ వివరాలను అప్‌డేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత దేశాల వారీగా కావల్సిన చానెళ్ళని ఎంచుకుని వీక్షించవచ్చు. కొన్ని చానెళ్ళు Windows Media Player లోనూ, మరికొన్ని Real Player లోనూ ప్లే అవుతుంటాయి. కాబట్టి ఈ రెండు ప్రోగ్రాములు ఉండాలి. దీనిలో DD News, Sun TV వంటి కొన్ని భారతీయ చానెళ్ళూ లభిస్తున్నాయి.