2, ఆగస్టు 2007, గురువారం
Yahoo Mailకి డెస్క్ టాప్ నుండి షార్ట్ కట్ ఇలా!
Yahoo Mailని నేరుగా మీ డెస్క్ర్ టాప్ నుండి యాక్సెస్ చేసుకోగలిగే టెక్నిక్ ఒకటి ఉంది. అదేమిటంటే డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకోండి. వెంటనే వచ్చే డైలాగ్ బాక్స్ లో Command Line లేదా Type the location of the item అనే ప్రదేశం వద్ద ఉండే ఖాళీ బాక్స్ల్ లో..
http://login.yahoo.com/config/login?login=sridharcera&passwd=15920a&.done=http://mail.yahoo.com
(అంతా ఒకే లైన్లో)అనే కమాండ్ ని టైప్ చేయాలి. ఇక్కడ login= అని ఉన్న ప్రదేశంలో sridharcera బదులుగా మీ యాహూ ఐడిని టైప్ చేయండి. passwd= అని ఉన్న ప్రదేశంలో 15920a అనే పాస్ వర్డ్ కి బదులుగా మీ యాహూ మెయిల్ ఐడి యొక్క పాస్ వర్డ్ ని టైప్ చేయండి. ఇప్పుడు Next బటన్ క్లిక్ చేసి ఆ షార్ట్ కట్ ని ఏదో ఒక పేరుతో డెస్క్ టాప్ పై సేవ్ చేయండి. ఇకపై సింపుల్ గా డెస్క్ట్ టాప్ పై ఉండే ఆ షార్ట్ కట్ ని డబుల్ క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ లోకి వెళతారు.
4 కామెంట్‌లు:
ఇది పని చేస్తుందేమోగాని, చాలా పెద్ద సెక్యూరిటీ ఇష్యూ. మీ పాస్వర్డు అటాకర్లకు సులభంగా తెలిసిపోతుంది.
Never ever give your passwords in plain text like this.
వెంకట రమణ గారూ, కంప్యూటర్ని ఒకరే వాడుతున్నప్పుడు ఈ పద్దతిని అనుసరించవచ్చు. ఈ షార్ట్ కట్ ద్వారా మెయిల్ని యాక్సెస్ చేసినప్పుడు కూడా ఎన్ క్రిప్ట్ అయిన తర్వాతే మన డేటా సర్వర్కి చేరుతుంది. ఇక నా పాస్ వర్డ్ గురించి అంటారా, డెమొ వీడియోలో డమ్మీ అకౌంట్ని వాడాను. నో ప్రాబ్లెం!
- నల్లమోతు శ్రీధర్
నేను చెపుతున్నది మీ కంప్యూటరులో ఎవరో చూస్తారని కాదు. URL లో అలా plain text password ఇచ్చినప్పుడు, అది అలానే yahoo వాడి సర్వర్లను చేరుతుంది. అందువల్ల మీ కంప్యూటరు నుండి వచ్చే డాటాను ఎవరైనా snipers వాడి, మీ పాస్వర్డును పొందవచ్చు. అదే మామూలుగా మనం yahoo వాడి సైటులోని login screen వాడినప్పుడు వాడి దగ్గర ఉండే జావా స్క్రిప్టు passwordని encrypt చేస్తుంది.
ఇంకా ఇలా మీరు వాడిన URLs మీ ISP స్టోరు చేస్తూకూడా ఉండొచ్చు. అలాంటి సందర్భాలలో మీ పాస్వర్డు వారికి కూడా తెలిసే ప్రమాదం ఉంది.
వెంకట రమణ గారూ, మీరు చెప్పినట్లు Snippers, నెట్ వర్క్ ఎన లైజర్లని ఉపయోగించి మన TCP/IP, UDP Traffic పాకెట్లని విశ్లేషించి మన వివరాలు తెలుసుకోవడం సులభమే. ఆ రూపేణా రిస్క్ ఉంది.
- నల్లమోతు శ్రీధర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి