18, ఆగస్టు 2007, శనివారం

ప్లగ్-ఇన్స్ గురించి తెలుసుకుందాం




'మా సిస్టమ్‌లో వెబ్‌సైట్లలోని ఫ్లాష్ ఏనిమేషన్లు ప్లే అవడంలేదు.'అని కొందరు కంప్లేంట్లు చేస్తుంటారు. ఫోటోషాప్‌లో ఫలానా ప్లగ్ ఇన్ చాలా ఉపయోగకరంగా ఉందంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ Plug-ins అనే పదం మనకు వినిపిస్తున్నా దాని గురించి వివరంగా అందరికీ తెలీదు.


Plug-in అంటే ఏమిటి?

ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫోటోషాప్, Adobe Premier, 3DStudioMax వంటి మృదులాంత్రము(Software) ప్రోగ్రాములే Plug-ins ఉదా.కు ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్‌నే తీసుకుందాం. IE వెర్షన్ 5 కి ముందు వెర్షన్లు వాడేవారు. నెట్‌లో ఫ్లాష్ ఏనిమేషన్లని ప్లే చెయ్యలేదు. ఫ్లాష్ ఏనిమేషన్లు పొందాలంటే దానికోసం ప్రత్యేకంగా Macromedia Flash Plug-in అదీ IE కోసం రూపొందించబడింది.సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడాలి. ప్రస్తుతం IEలోనే అది రెడీమేడ్‌గా లభిస్తుంది.

బ్రౌజర్ ప్లగ్ఇన్‌లు నెట్ బ్రౌజింగ్‌కి కీలకమైనవ్...

నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని సైట్లలో .dcr ఎక్స్‌టెన్షన్ పేరు గల షాక్‌వేవ్ ఏనిమేషన్ ఫైళ్ళు కనిపిస్తుంటాయి. మరికొన్ని సైట్లలో .mov ఎక్స్‌టెన్షన్ పేరు గల QuickTime మూవీ ఫైళ్ళు దర్శనమిస్తుంటాయి. ఇలా పలు రకాల మల్టీమీడియా ఫైళ్ళని నేరుగా బ్రౌజర్లోనే ప్లే చెయ్యాలంటే ఆ పర్టికులర్ మృదులాంత్రము(Software) గానీ,దాని ప్లగ్ఇన్ గానీ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉండాలి.

మల్టీమీడియా అప్లికేషన్లకి ఉపయోగపడేవి...

Adobe Photoshop,Premiere, SoundForge, 3D Studio Max,Director వంటి పలురకాల మల్టీమీడీయా క్రియేషన్ ప్రోగ్రాముల కోసం అనేక ప్లగ్-ఇన్‌లు రూపొందించబడ్డాయి. ఆయా ప్లగ్ఇన్‌లు ఉంటేనే ఇన్‌స్టలేషన్ సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆ ఇన్‌స్టలేషన్ ప్యాకేజీలోనే పేరెంట్ మృదులాంత్రము(Software) యొక్క Plug-ins ఫోల్డర్‌ని వెదికి అది కనిపిస్తేనే ఇన్‌స్టలేషన్ కొనసాగేటట్లు ఏర్పాటు చెయ్యబడి ఉంటుంది. ఒక హైఎండ్ మృదులాంత్రాన్ని(Software) దృష్టిలో ఉంచుకుని డెవలప్ చేసిన ప్లగ్ ఇన్‌లు ఇతర ప్రోగ్రాముల మాదిరిగా Start మెనూలో కనిపించవు.


ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత...


ఏదైనా ప్లగ్ఇన్‌లు డౌన్‌లోడ్ చేసుకుని మన సిస్టమ్‌లో ఇన్‌స్తాల్ చేసుకునేటప్పుడు అది ఏ ప్రోగ్రామ్‌కి సంబంధించినదో ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉండకూడదు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇన్‌స్టాల్ చేస్తున్న ప్లగ్ఇన్ ఇన్‌స్టలేషన్ సమయంలో మెయిల్ ప్రోగ్రామ్‌కి అదనంగా షెల్‌లను క్రియేట్ చెయ్యవలసి ఉంతుంది. ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్లయితే అది సాధ్యపడదు. ప్లగ్ఇన్ ఇన్‌స్టలేషన్ పూర్తయిన వెంటనే ఒరిజినల్ ప్రోగ్రామ్‌తో పాటు అవి మెమరీలోకి లోడ్ చెయ్యబడి, యూజర్ కోరుకున్నపుడు ఒరిజినల్ ప్రోగామ్‌లో అంతర్భాగంగా కానీ లేదా టెంపరరీగా ప్రత్యేకమైన విండోలో గాని ఓపెన్ అయి యూజర్ కోరుకున్న పని నెరవేర్చి పెడతాయి. నెట్‌లో అనేక రకాల ప్లగ్ ఇన్‌లు లభిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు: