1, ఆగస్టు 2007, బుధవారం
ఆన్ లైన్లో కరెంట్, వాటర్ బిల్లుల వంటివి ఎలా చెల్లించాలి?
ఇంటర్నెట్ కనెక్షన్, ICICI, HDFC, UTI వంటి కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ లు ఉన్నవారు http://www.esevaonline.com/ అనే వెబ్ సైట్ ద్వారా కరెంట్, వాటర్, మున్సిపల్ టాక్స్ వంటి వివిధ రకాలైన బిల్లులను చెల్లించే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంగా వ్యక్తిగతంగా నేను ఈ సర్వీసుని వాడుతున్నాను. దీనికిగాను ముందుగా పై వెబ్ సైట్లోకి వెళ్లి కొత్తగా ఓ యూజర్ నేం, పాస్ వర్డ్ లను రిజిస్టర్ చేసుకుని ఉచిత అకౌంట్ ని పొందాలి. ఆ తర్వాత మీ యూజర్ నేం ద్వారా రెగ్యులర్ గా ఏయే బిల్లులను చెల్లించదలుచుకున్నారో ఆయా యుటిలిటీ సర్వీసులను ఎంచుకోవాలి. ఉదా:కు. కరెంట్ బిల్లులను చెల్లించదలుచుకుంటే TRANSCOని ఎంచుకోవాలి. వెంటనే మీ సర్వీస్ నెంబర్, అడ్రస్ వివరాలు తెలుపమంటూ ఓ ఫారం వస్తుంది. ఇకపై ప్రతీనెలా ఆ సర్వీస్ నెంబర్ ని ఎంచుకుని చెల్లించదలుచుకున్న మెత్తాన్ని తెలియజేసి,Payment అప్షన్ ద్వారా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ కంపెనీని ఎంచుకుని Card Type, Card Number, Expiry Date, Customer Name వంటి మీ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన వివరాలను అందిస్తే మీ క్రెడిట్ కార్డ్ నుండి చెల్లింపు జరుపబడుతుంది. వెంటనే Print ఆప్షన్ ద్వారా రసీదుని ప్రింట్ చేసుకుని భద్రపరుచుకుంటే సరిపోతుంది. ఆడియో వివరణతో కూడిన పై వీడియోని చూడండి, వివరంగా అర్థమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి