Mainframe, Minicomputer, Micro-computer: కంప్యూటర్లలోని ప్రధానమైన మూడు సైజులివి. భారీ కార్పోరేట్ సంస్థలు, బ్యాంకులు మెయిన్ ఫ్రేమ్‌లను ఉపయోగిస్తుంటాయి. స్కూళ్ళు, ఇతరత్రా మధ్యస్థాయి సంస్థలు మినీ కంప్యూటర్లను వాడుతుంటాయి. చివరగా మనం ఇళ్ళలో , ఆఫీసుల్లో వాడే పర్సనల్ కంప్యూటర్లు మైక్రో కంప్యూటర్లుగా పరిగణించబడుతూ ఉంటాయి. ఎక్కువ వాడుకలో ఉన్నవివే.
Male Connector పిన్‌లను కలిగిఉండే కంప్యూటర్ కనెక్టర్‌ని Male Connector గా పిలుస్తారు. ఉదా.కు పేరలల్ పోర్ట్ ప్రింటర్, స్కానర్లను కంప్యూటర్‌కి కనెక్ట్ చేసే కేబుల్, హార్డ్‌డిస్క్,సిడిరామ్ డ్రైవ్ వంటి వివిధ డిస్క్‌లకు మనం పవర్ సప్లై నిమిత్తం కనెక్ట్ చేసే కేబుళ్ళు,మేల్ కనెక్టరుకు చెందినవిగా చెప్పబడుతున్నాయి.
Margin : పేజ్ డిజైనింగ్, వర్డ్ ప్రాసెసింగ్, ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లలో ఈ పదం వినిపిస్తుంటుంది. ఒక ప్రామాణికమైన పేజీసైజ్‌ని తీసుకుని , అందులో పేజీ అంచులకు పెజీలో పొందుపరిచే సమాచారానికి మధ్య మనం వదిలివేసే ఖాళీ స్థలాన్ని మార్జిన్ అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి