13, ఆగస్టు 2007, సోమవారం
మెమరీ Latency గురించి తెలుసా?
కంప్యూటర్‌ని ఆన్ చేసి మనం పనిచేసుకుంటూ పోతాం.మనం టైప్‌చేసే డేటా మొత్తం సైలెంట్‌గా RAM మాడ్యుళ్ళలో తాత్కాలికంగా భద్రపరచబడుతుంది. ఎప్పుడైతే మనం ఫైల్‌ని సేవ్ చేస్తామో అప్పుడు ఆ సమాచారం RAM నుండి హార్డ్‌డిస్క్‌కి సేవ్ చేయబడుతుంది.చాలామందికి ఇంతవరకు మాత్రమే తెలుసు తప్ప RAM పనితీరు ఇంతకన్నా వివరంగా తెలియదు.. ఒక్కసారి నిలువు,అడ్డ గళ్ళతో కూడిన లుంగీలను గుర్తు తెచ్చుకోండి. ప్రతీ నిలువు,అడ్డ గడి కలిసే చోట ఒక పెట్టె తయారవుతుంది కదా! సరిగ్గా అదే పద్ధతిలో మెమరీ అడ్రస్‌లు పలు పెట్టెలుగా ఉంటాయి.సిపియు నుండి ఏదైన సమాచారం అందించమని అభర్థన పంపించబడితే మెమరీ ముందు ఆ సమాచారం ఏ అడ్డువరుసలో ఉందో చెప్పమని సిపియుని కోరుతుంది. ఆ వివరాలు లభించేటంత వరకూ ఆగుతుంది. ఇలా అడ్డువరుస కోసం వేచి చూసే సమయాన్ని RAS (Row Address Strobe) Latency అంటారు. అలాగే అడ్డువరుస వివరాలు లభించిన తర్వాత ఆ సమాచారం ఏ నిలువు వరుసలో ఉన్నదన్నది మళ్ళీ మెమరీ సిపియుని అడుగుతుంది. ఆ వివరాలు వచ్చేటంతవరకు కొద్దిసేపు ఆగుతుంది. ఈ వెయిట్ టైంని CAS ( Column Address Strobe) Latency అనే పేరుతో వ్యవహరిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి