3, ఆగస్టు 2007, శుక్రవారం

సిడికి మనకు నచ్చిన ఐకాన్ జత చేయడం


కొన్ని సిడిలను సిడిరామ్ డ్రైవ్‌లో ఉంచినప్పుడు MyComputer, Windows Explorer లను ఓపెన్ చెయ్యగానే సిడిరామ్ డ్రైవ్ ప్రదేశంలో మామూలు సిడిరామ్ డ్రైవ్ ఐకాన్‌కి బదులు ఆ సిడిలో ఉన్న కంటెంట్‌ను ప్రతిబింబించే విధంగా ఐకాన్ మారుతుంటుంది. ముఖ్యంగా Adobe Photoshop, Spiderman వంటి అప్లికేషన్ ప్రోగ్రాముల సెటప్ సిడిల్లో ఇలాంటి కస్టమైజ్డ్ ఐకాన్లు దర్శనమిస్తుంటాయి. మీవద్ద సిడిరైటర్ ఉంటే మీరు రైట్ చేసుకునే సిడిలకూ ఇలా కస్టమైజ్డ్ ఐకాన్లు జత చేసుకోవచ్చు. ముందుగా http://www.aha-soft.com/iconutils/index.htm అనే వెబ్ సైట్లో లభించే IconUtilis వంటి థర్డ్‌పార్టీ సాప్ట్ వేర్లను ఉపయోగించి మీ ఫోటోనో లేక మీకు నచ్చిన ఇత గ్రాఫిక్‌నో .ico ఫైల్‌గా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు Notepad ఓపెన్ చేసి క్రింది లైన్లని టైప్ చేయండి.

[AUTORUN]
icon=1.ico (ఇక్కడ 1.ico బదులు మీరు క్రియేట్ చేసుకున్న ఐకాన్ ఫైల్ పేరుని ఇవ్వండి) ఇప్పుడు ఆ Notepad ఫైల్‌ని autorun.inf పేరుతో సేవ్ చేసి , సిడిని రైట్ చేయబోయేటప్పుడు ఇతర కంటెంట్‌తో పాటు ఐకాన్ .ico ఫైల్‌నీ, autorun.inf ఫైల్‌ని రెండింటినీ సిడి యొక్క రూట్ డైరెక్టరీలో add చేసి సిడిరైట్ చేస్తే సరిపోతుంది.

కామెంట్‌లు లేవు: