31, ఆగస్టు 2007, శుక్రవారం

RAM కొనబోతున్నట్లయితే...





* కొత్త సిస్టమ్‌కి మెమరీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత మొత్తంలో అయితే RAM అమర్చుకోదలుచుకున్నారో అంత మొత్తానికి ఒకే RAM మాడ్యూల్‌ని మాత్రమే తీసుకోండి. రెండు మాడ్యుళ్ళు ఉన్నప్పుడు అనేక కారణాల వల్ల ఒక మాడ్యూల్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటే వాడండి.

* మాడ్యూళ్ళకి రెండు వైపులా ప్లాస్టిక్ కేసింగ్ ఉన్న RAMని ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోకండి. ఈ తరహా మాడ్యుళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి.ఓపెన్‌గా ఉన్న మాడ్యుళ్ళనే కొనుగోలు చేయండి.

* SDRM అయితే 133MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యుళ్ళని, DDR అయితే 400 MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యూళ్ళనే ఎంచుకోవడం వల్ల సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఒక వేళ మీ మదర్ బోర్డ్ సపోర్ట్ చెయ్యకపోతేనే తక్కువ బస్‌స్పీడ్‌ని ఎంచుకోండి.

* ఆల్రెడీ మీ సిస్టమ్‌లో పాత RAM మాడ్యూల్ ఉన్నట్లైతే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కొత్త రామ్ కొంటున్నట్లయితే పాత దానితో కొత్త మాడ్యూల్‌ని జత చేయకండి.పాత రామ్‌ని స్టాండ్‌బైగా ప్రక్కన పెట్తుకుని కేవలం కొత్తదాన్ని మాత్రమే వాడండి.

1 కామెంట్‌:

విహారి(KBL) చెప్పారు...

శ్రీధర్ గారికి ధన్యవాదాలు.ఇంత మంచి బ్లాగు నిర్వహిస్తున్నందుకు.చాలా ఉపయొగపడుతున్నయి మీరు ఇచ్చే ఇన్ ఫర్మేషన్.నాది ఒక సందేహం.దయచేసి తీర్చగలరని మనవి.నేను నెట్లొ సెర్చ్ చేసాక internet options కి వెళ్ళి clearHistory,delete cookies,delete files,అలాగే Temporary internet folders లొ వున్నవన్ని డెలీట్ చేసినా కొన్ని నేను addressbar లొ type చెసినప్పుడు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా power పొయినప్పుడు use చేస్తున్న సైటు address కనిపిస్తున్నాయి.
అవి కొన్ని నెలలు అలాగే వుంటున్నాయి.దయచేసి దీనికి పరిష్కారం తెలుపగలరు.