29, ఆగస్టు 2007, బుధవారం
మీ మెయిల్ స్పామ్ కాకుండా…
మీ ఫ్రెండ్‍కొక ముఖ్యమైన మెసేజ్ పంపించారనుకోండి. అయితే పొరబాటున అది Bulk ఫోల్డర్‍లోకి వెళితే, దానిని చెక్ చేసుకోకుండానే అతను ఆ ఫోల్డర్‍ని క్లీన్ చేస్తే మీరు పంపించిన మెసేజ్ నిరుపయోగమైనట్లే కదా! అవును… అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం పంపించే మెసేజ్‍లలో Yahoo, Rediff, Gmail వంటి సర్వర్లలోని స్పామ్ ఫిల్టర్లు వడగట్టే ఏ ఒక్క లక్షణం ఉన్నా మన మెయిల్ అవతలి వ్యక్తి Inbox కి వెళ్ళడానికి బదులు Junk/Bulk/Spam ఫోల్డర్లకి చేరుకుంటుంది. ఒక్కోసారి మనం పంపించే మెసేజ్‍లలోని సబ్జెక్ట్ లైన్‍లను చూడగానే రిసీవ్ చేసుకున్నవారు స్పామ్ మెసేజ్ అని పొరబాటుపడి డిలీట్ చేసే అవకాశామూ ఉంది. ఈ నేపధ్యంలో మన మెసేజ్ స్పామ్‍గా పరిగణించబడకుండా ఉండాలంటే మెయిల్ పంఫించేటప్పుడు క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
సబ్జెక్ట్ అర్ధవంతమైనదై ఉండాలి.
మీరు కంపోజ్ చేసే మెయిల్ మెసేజ్‍లకు సబ్జెక్ట్ అనే ప్రదేశంలో మెసేజ్‍లోని అర్ధాన్ని ప్రతిఫలించే విధంగా వాక్యాన్ని పేర్కోనాలి.కొంతమంది అసలు Subject అనే కాలమ్‍లో ఏమీ టైప్ చేయరు. అది అదనపు శ్రమ అని వదిలివేస్తుంటారు. ఇలా ఎలాంటి సబ్జెక్ట్ లైనులనూ కలిగి ఉండని మెసేజ్‍లను చాలా మెయిల్ సర్వర్లు Junk/Spam ఫోల్డర్‍లోకి పంపిస్తుంటాయి. అలాగే Subject లైన్‍గా Stuff, Hello , HI, Help, New, Free వంటి పదాలను టైప్ చేయకండి. అలాంటి మెసేజ్‍లు స్పామ్‍గా పరిగణించబడతాయి.
ఫార్మేటింగ్ మెళకువలు పాటించండి…
మెయిల్ మెసేజ్‍లో మనం పొందుపరిచే సమాచారంలో మొదటి పేరాలో ఫ్రీ ఆఫర్స్ వంటి పదాల్ని వాడితే అవి స్పామ్‍గా పరిగణించబడే ప్రమాదం ఉంది. అలాగే అన్నీ కేపిటల్,అన్నీ స్మాల్ లెటర్స్ తో టైప్ చేసిన మెసేజ్‍లను మెయిల్ సర్వర్‍లోని Spam Filters స్పామ్ మెసేజ్‍లుగా పరిగణించి నేరుగా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క Junk ఫోల్డ్రర్‍లోకి తరలించే అవకాశముంది. సహజంగా మెసేజ్‍లోని Text కి Bold, Italic, Font color, Alignment వంటి ఫార్మేటింగ్‍లను అప్లై చేసినప్పుడు ఆయా మెసేజ్‍లను స్పామ్ ఫిల్టర్లు సాధారణ మెసేజ్‍లుగా గుర్తించడం ఇక్కడ గమనార్హం. కాబట్టి మెసేజ్ ఫార్మటింగ్ చేయండి.
Bulk Mail ప్రోగ్రాములు వాడవద్దు.
ఒకేసారి భారీ సంఖ్యలో మెయిల్ అడ్రస్‍లకు మెసేజ్‍లను పంపించగలిగే Bulk మెయిల్ మృదులాంత్రముల(Software) ద్వారా పంపించబడే అన్ని మెసేజ్‍లను Yahoo వంటి అన్ని సర్వర్లూ స్పామ్‍గానే పరిగణిస్తాయి.
1 కామెంట్:
nice tips sridhar garu....
thanks.
కామెంట్‌ను పోస్ట్ చేయండి