
పరిమాణంలో చాలా చిన్నగా ఉండే లాప్ టాప్ ల్లో ఇతర హార్డ్ వేర్ పరికరాల మాట అలా ఉంచితే ప్రాసెసర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కువ విద్యుత్ నీ, సిస్టం వనరులను వినియోగించుకుంటూ విపరీతమైన వేడిమిని వెలువరించే ప్రాసెసర్ ని లాప్ టాప్ కి అనుగుణంగా తీర్చిదిద్దడంలో చిప్ తయారీ కంపెనీల ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. Micro FCPGA2, FCBGA2 ప్యాకేజింగ్ టెక్నాలజీల ద్వారా రూపొందించబడే ఈ ప్రాసెసర్లు స్వల్ప మొత్తంలో మాత్రమే విద్యుత్ ని వినియోగించుకుంటూ, తక్కువ మొత్తంలో వేడిని వెలువరించే విధంగా ఉంటాయి. లాప్ టాప్ ఖాళీగా ఉండే సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి తద్వారా బ్యాటరీని ఆదా చేసే Quick Start సదుపాయం కూడా వీటిలో పొందుపరచబడి ఉంటుంది. ఒక్క సెకండ్ మనం కంప్యూటర్ ని ఉపయోగించకపోయినా Deeper Sleep Alert State ఏక్టివేట్ చేయబడి విద్యుత్ ని ఎక్కువగా వినియోగించుకునే పరికరాలకు వీలైనంత తక్కువ విద్యుత్ అందించబడుతూ తద్వారా బ్యాటరీ ఆదా చేయబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి