5, ఆగస్టు 2007, ఆదివారం
మల్టీ సెషన్ సిడిలో కొత్త ఫైళ్లే కనిపిస్తున్నాయా?
సహజంగా Nero వంటి సాప్ట్ వేర్ల ద్వారా సిడిలను రైట్ చేసేటప్పుడు, సిడిలో ఖాళీ ఉంటే మరోమారు ఆ ఖాళీ స్థలంలో రైట్ చేసుకోగలిగే విధంగా చాలామంది Burn Settingsలో Write Method అనే ఆప్షన్ వద్ద Track-at-once ఆప్షన్ ఎనేబుల్ చేయబడి ఉండగా సిడి రైట్ చేస్తుంటారు. సిడిలో ఖాళీ స్థలాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఇది బాగా దోహదపడుతుంది. అయితే ఇలా ఒకే సిడిలో వేర్వేరు పర్యాయాలు కొంత కొంత చొప్పున సమాచారాన్ని రైట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు చివరిగా రికార్డ్ చేసిన సమాచారం మాత్రమే లభిస్తూ గతంలో అదే సిడిలో రికార్డ్ చేసిన సమాచారం తుడిచిపెట్టుకుపోయి ఆందోళనకు గురిచేస్తుంది. మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంకి ఫైళ్లు, ఫోల్డర్ల వివరాలతో FAT32, NTFS వంటి ఫైల్ సిస్టంలు ఎలా ఉంటాయో సిడిలలోనూ వాటిలో మనం రికార్డ్ చేసిన సమాచారం TOC (Table Of Contents)పేరిట భద్రపరచబడి ఉంటుంది. మల్టీ సెషన్లో (Track-at-once) సిడిలను రైట్ చేసినప్పుడు చివరిసారిగా సిడిని రైట్ చేసినప్పుడు TOC రాయబడేటప్పుడు గతంలో ఉన్న TOC పరగణనలోకి తీసుకోవకపోవడం వల్ల కేవలం మనం తాజాగా రైట్ చేసిన సమాచారం మాత్రమే సిడిలో కనిపిస్తూ పాతది మాయమైపోతుంటుంది. అలాంటప్పుడు మనం ఏ సిస్టంలో ఏ సిడి రైటర్లో ఆ సిడిని రైట్ చేశామో ఆ రైటర్లో సిడిని పెట్టి చూడండి. చాలావరకూ పాత సమాచారం కనిపిస్తుంది. వేరే సిస్టంలలో మాత్రం అది కనిపించదు. అలాంటప్పుడు సిడిలోని ఖాళీ స్థలం వృధా అయినా Disk-at-once అనే ఆప్షన్ ని ఎంచుకోవడం ఉత్తమం.
1 కామెంట్:
use "iso buster" to retreive data from CDs,which R not visible after multisession okits working...
కామెంట్‌ను పోస్ట్ చేయండి