31, ఆగస్టు 2007, శుక్రవారం
RAM కొనబోతున్నట్లయితే...
* కొత్త సిస్టమ్‌కి మెమరీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత మొత్తంలో అయితే RAM అమర్చుకోదలుచుకున్నారో అంత మొత్తానికి ఒకే RAM మాడ్యూల్‌ని మాత్రమే తీసుకోండి. రెండు మాడ్యుళ్ళు ఉన్నప్పుడు అనేక కారణాల వల్ల ఒక మాడ్యూల్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటే వాడండి.
* మాడ్యూళ్ళకి రెండు వైపులా ప్లాస్టిక్ కేసింగ్ ఉన్న RAMని ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోకండి. ఈ తరహా మాడ్యుళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి.ఓపెన్‌గా ఉన్న మాడ్యుళ్ళనే కొనుగోలు చేయండి.
* SDRM అయితే 133MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యుళ్ళని, DDR అయితే 400 MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యూళ్ళనే ఎంచుకోవడం వల్ల సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఒక వేళ మీ మదర్ బోర్డ్ సపోర్ట్ చెయ్యకపోతేనే తక్కువ బస్‌స్పీడ్‌ని ఎంచుకోండి.
* ఆల్రెడీ మీ సిస్టమ్‌లో పాత RAM మాడ్యూల్ ఉన్నట్లైతే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కొత్త రామ్ కొంటున్నట్లయితే పాత దానితో కొత్త మాడ్యూల్‌ని జత చేయకండి.పాత రామ్‌ని స్టాండ్‌బైగా ప్రక్కన పెట్తుకుని కేవలం కొత్తదాన్ని మాత్రమే వాడండి.
స్పీకర్లని కొనుగోలు చేయబోతున్నట్లయితే..
పవర్ రేటింగ్ : మార్కెట్లో లభిస్తున్న అన్ని స్పీకర్లూ పవర్ రేటింగ్‌ని PMPO ప్రమాణంలో పేర్కొంటున్నారు. అయితే PMPO అర్ధం లేని స్పెసిఫికేషన్! దీనికి బదులు స్పీకర్ సిస్టమ్ యొక్క RMS పవర్‌ని పరిగణనలోకి తీసుకోండి. సరౌండ్ సౌండ్ స్పీకర్ల విషయంలో కనీసం 40 Watts RMS పవర్ ఉన్న స్పీకర్లని ఎంచుకోవడం మంచిది. నిరంతరాయంగా పవర్‌ని హ్యాండిల్ చెయ్యగల సమర్ధత స్పీకర్‌లో ఎంత ఉందో తెలుసుకోవడానికి RMS మాత్రమే సరైన ప్రమాణం.
ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: మీరు కొనే స్పీకర్ యొక్క ఫ్రీక్వెన్సీ 16 KHz కంటే ఎక్కువ లభించనపుడు క్లాసిక్ మ్యూజిక్ వినేటప్పుడు high treble లభించదు. అలాగే 50 KHZ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీని మీ స్పీకర్ సపోర్ట్ చెయ్యకపోతే డ్రమ్ సౌండ్లు, సినిమాల్లో భారీ పేలుళ్ళ శబ్దాలను ఎఫెక్టివ్‌గా వినడానికి వీలుపడదు. ఈ నేపధ్యంలో మీ స్పీకర్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్‌ని సపోర్ట్ చేసేదై ఉండాలి.
ఆడియో ఇన్‌పుట్: 2.1 స్టీరియో స్పీకర్ సిస్టమ్‌ని ఎంచుకుంటే కేవలం అనలాగ్ లెఫ్ట్, రైట్ చానెళ్ళు మాత్రమే లభిస్తాయి. అదే 4 చానెల్ సరౌండ్‌సౌండ్ సిస్టమ్ విషయంలో స్పీకర్ సిస్టమ్‌కి మొత్తం నాలుగు అనలాగ్ ఆడియో ఇన్‌పుట్‌లు ఉండేలా చూసుకోవాలి.అదే 5.1 స్పీకర్స్ విషయంలో మొత్తం ఆరు సపరేట్ RCA ఇన్‌పుట్‌లు స్పీకర్‌కి లభించేలా జాగ్రత్త వహించాలి.
30, ఆగస్టు 2007, గురువారం
గూగుల్ ఎర్త్….GOOGLE EARTH
’తాతా కంప్యూటర్లో మన ఇల్లు, పురులు, సూర్యలంకలు సముద్రపు ఒడ్డు కనిపిస్తున్నాయే’! అంటూ ఓ మనవడు చెబుతుంటే ఆ తాత మొహంలో సంభ్రమం కొట్టొచ్చినట్లు కనిపించింది. Google Earth, Wikipedia ల పుణ్యమా అని ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశం గురించైనా క్షణాల్లో ఉపగ్రహ చిత్రాల ద్వాఅరా తెలుసుకోవడం సాధ్యపడుతోంది.
ఎక్కడ లభిస్తుంది, ఎంత సైజ్ ఉంటుంది?
Google Earth అనేది ఓ ఉచిత మృదులాంత్రము (Software). 11 MB సైజుగల ఈ ప్రోగ్రామ్‍ని http://earth.google.com అనే సైట్ నుండి పొందవచ్చు. ఫ్రీవర్షన్‍ని డౌన్‍లోడ్ చేసుకునేటప్పుడు ఓ రిజిస్ట్రేషన్ ఫారంని నింఫి యూజర్‍నేమ్, లైసెన్స్ కీలను పొందాలి. Google Earth ని నెట్‍కి కనెక్ట్ చేసే సమయంలో వీటిని తెలియజేస్తేనే లాగిన్ అవుతుంది.
ఎలా ఎక్స్ ప్లోర్ చేయాలి?
Google Earth ప్రోగ్రామ్‍ని రన్ చేసిన వెంటనే ఓ globe గుండ్రంగా తిరుగుతూ మన ముందుకు వస్తుంది. ఆ గ్లోబ్‍లో ఏ ప్రదేశం వద్ద అయినా మౌస్‍ని ప్రెస్ చేసి పట్టుకుని మీకు కావల్సిన దేశం వచ్చేటంతవరకూ కుడి, ఎడమ వైపులకు మౌస్‍ని డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మీకు కావలసిన దేశం వచ్చిన తర్వాత Mapsకి క్రింది భాగంలో కన్పించే కంట్రోళ్ళని ఉపయోగించి ఆ దేశంలోని ఇతర నగరాలు, పట్టణాలని వెతుకుతూ వెళ్ళాలి. ఉదా.కు New Delhi, Mumbai, Hyderabad వంటి నగరాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా నగరాన్ని సెంటర్ పొజిషన్‍లోకి తెచ్చుకుని.. ఆ నగరాన్ని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ నగరంలోని వివిధ ప్రాంతాల పేర్లు కన్పిస్తుంటాయి. హైదరాబాదుని జూమ్ చేసుకుంటూ వెళితే హుస్సేన్‍సాగర్, అమీర్‍పేట్, ఎల్.బి. స్టేడియం, వంటి వివిధ ప్రదేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకుని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశం పరిసర ప్రాంతాలు, భవనాలు, రోడ్లు ఉపగ్రహచిత్రం రూపంలో చూపించబడతాయి. మన రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాల రూపురేఖలని సైతం Google Earth ప్రోగ్రామ్ ద్వారాఎక్స్ ప్లోర్ చేసుకోవచ్చు.
చిటికెలో కావలసిన ప్రదేశాన్ని చూడాలా?
Globe బొమ్మని జూమ్ చేస్తూ కావలసిన ప్రదేశానికి చేరుకోవడం కష్టంగా ఉందా … అయితే Google Earth ప్రోగ్రామ్‍లోని Fly to అనే బాక్సులో మీరు ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారో దాని పేరుని టైప్ చేయండి. ప్రముఖ ప్రాంతాలని సందర్శించడానికి ఇది సులభంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సైతం Google Earth ద్వారా పొందవచ్చు. ఏదైనా ప్రముఖ ప్రదేశానికి బ్రౌజ్ చేసేటప్పుడు అక్కడికి దగ్గరలో హైవేలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, బ్యాంకులు, రిటైల్‍షాపులు, ఫార్మసీలు, వంటి ఎలాంటీ వనరులైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అవకాశముంది. దీనికి గాను Google Earth ప్రోగ్రాములో Layers అనే ప్రదేశం వద్ద కావలసిన అంశాలని ఎంచుకుంటే సరిపోతుంది. వివిధ ప్రదేశాలని బ్రౌజ్ చేసేటప్పుడు పలురకాల సింబల్స్ రూపంలో ఇవి చూపించబడతాయి.
ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లు సైతం లభిస్తున్నాయి…
Google Earth ప్రోగ్రాములో ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదా… అయితే www.googleearthhacks.com అనే వెబ్‍సైట్‍లో అదనపు మ్యాపులు, ఫోటోలు లభించడంతో పాటు ఈ ప్రోగ్రామ్‍ని ఉపయోగిస్తున్న ఇతర యూజర్ల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకోవడానికి Google News స్టోరీలు, Earth చిత్రాలు చూసి చూసి విసిగిపోయి కొద్ది భిన్నంగా వేరే గ్రహం చిత్రాలు చూడాలనుకుంటే Jupiter గ్రహం యొక్క చిత్రాలు చూపించే ప్లగ్‍ఇన్‍లు వంటివి ఎన్నో ఈ సైట్‍లో డౌన్‍లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తున్నాయి.ది
29, ఆగస్టు 2007, బుధవారం
మీ మెయిల్ స్పామ్ కాకుండా…
మీ ఫ్రెండ్‍కొక ముఖ్యమైన మెసేజ్ పంపించారనుకోండి. అయితే పొరబాటున అది Bulk ఫోల్డర్‍లోకి వెళితే, దానిని చెక్ చేసుకోకుండానే అతను ఆ ఫోల్డర్‍ని క్లీన్ చేస్తే మీరు పంపించిన మెసేజ్ నిరుపయోగమైనట్లే కదా! అవును… అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం పంపించే మెసేజ్‍లలో Yahoo, Rediff, Gmail వంటి సర్వర్లలోని స్పామ్ ఫిల్టర్లు వడగట్టే ఏ ఒక్క లక్షణం ఉన్నా మన మెయిల్ అవతలి వ్యక్తి Inbox కి వెళ్ళడానికి బదులు Junk/Bulk/Spam ఫోల్డర్లకి చేరుకుంటుంది. ఒక్కోసారి మనం పంపించే మెసేజ్‍లలోని సబ్జెక్ట్ లైన్‍లను చూడగానే రిసీవ్ చేసుకున్నవారు స్పామ్ మెసేజ్ అని పొరబాటుపడి డిలీట్ చేసే అవకాశామూ ఉంది. ఈ నేపధ్యంలో మన మెసేజ్ స్పామ్‍గా పరిగణించబడకుండా ఉండాలంటే మెయిల్ పంఫించేటప్పుడు క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
సబ్జెక్ట్ అర్ధవంతమైనదై ఉండాలి.
మీరు కంపోజ్ చేసే మెయిల్ మెసేజ్‍లకు సబ్జెక్ట్ అనే ప్రదేశంలో మెసేజ్‍లోని అర్ధాన్ని ప్రతిఫలించే విధంగా వాక్యాన్ని పేర్కోనాలి.కొంతమంది అసలు Subject అనే కాలమ్‍లో ఏమీ టైప్ చేయరు. అది అదనపు శ్రమ అని వదిలివేస్తుంటారు. ఇలా ఎలాంటి సబ్జెక్ట్ లైనులనూ కలిగి ఉండని మెసేజ్‍లను చాలా మెయిల్ సర్వర్లు Junk/Spam ఫోల్డర్‍లోకి పంపిస్తుంటాయి. అలాగే Subject లైన్‍గా Stuff, Hello , HI, Help, New, Free వంటి పదాలను టైప్ చేయకండి. అలాంటి మెసేజ్‍లు స్పామ్‍గా పరిగణించబడతాయి.
ఫార్మేటింగ్ మెళకువలు పాటించండి…
మెయిల్ మెసేజ్‍లో మనం పొందుపరిచే సమాచారంలో మొదటి పేరాలో ఫ్రీ ఆఫర్స్ వంటి పదాల్ని వాడితే అవి స్పామ్‍గా పరిగణించబడే ప్రమాదం ఉంది. అలాగే అన్నీ కేపిటల్,అన్నీ స్మాల్ లెటర్స్ తో టైప్ చేసిన మెసేజ్‍లను మెయిల్ సర్వర్‍లోని Spam Filters స్పామ్ మెసేజ్‍లుగా పరిగణించి నేరుగా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క Junk ఫోల్డ్రర్‍లోకి తరలించే అవకాశముంది. సహజంగా మెసేజ్‍లోని Text కి Bold, Italic, Font color, Alignment వంటి ఫార్మేటింగ్‍లను అప్లై చేసినప్పుడు ఆయా మెసేజ్‍లను స్పామ్ ఫిల్టర్లు సాధారణ మెసేజ్‍లుగా గుర్తించడం ఇక్కడ గమనార్హం. కాబట్టి మెసేజ్ ఫార్మటింగ్ చేయండి.
Bulk Mail ప్రోగ్రాములు వాడవద్దు.
ఒకేసారి భారీ సంఖ్యలో మెయిల్ అడ్రస్‍లకు మెసేజ్‍లను పంపించగలిగే Bulk మెయిల్ మృదులాంత్రముల(Software) ద్వారా పంపించబడే అన్ని మెసేజ్‍లను Yahoo వంటి అన్ని సర్వర్లూ స్పామ్‍గానే పరిగణిస్తాయి.
మౌస్ ఇష్టమొచ్చినట్టు మూవ్ అవుతుందా...
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍లో ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవడానికి, దాదాపు అన్నిరకాల
ఇతర పనులకూ మౌస్ లేనిదే కష్టం. అయితే ఒక్కోసారి మౌస్ పాయింటర్ మన
చేతితో మూవ్ చేస్తున్న పద్ధతికి అనుగుణంగా కాకుండా, మరీ స్లోగా కానీ,జెర్కీగా
గానీ మూవ్ అవుతుంటుంది. సాధారణంగా మౌస్ రోలర్‍లకు మురికి చేరినపుడు
ఈ పరిస్థితి తలెత్తుతుంది. అలాంటప్పుడు మౌస్ వెనుకభాగంలొ ఉండే మౌస్
కవర్‍ని తొలగించి అందులోని మౌస్ బాల్‍ని బయటకు తీయండి. ఇప్పుడు మౌస్
లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీప్రదేశం ద్వారా మౌస్ రోలర్లకు పట్టిన
మురికిని గుర్తించవచ్చు. నీటిలో ముంచిన ఒక గుడ్డను తీసుకుని ఆ రోలర్లకు
పట్టుకున్న మురికిని మెల్లగా గీరివేయండి. మురికి ప్యాచ్‍లుగా ఊడిపోతుంది..
అలాగే మౌస్‍బాల్‍ని కూడా శుభ్రంగా డిటర్జెంట్ నీళ్ళలో కడిగి శుభ్రంగా తుడిచి మౌస్
లోపల అమర్చండి. మౌస్ ప్యాడ్ ద్వారా ఎక్కువగా మురికి మౌస్ లోపలికి చేరుతుంది.
కాబట్టి ప్రతీరోజూ మౌస్ ప్యాడ్‍పై చేరుకున్న దుమ్ముని శుభ్రపరచడం శ్రేయస్కరం.
26, ఆగస్టు 2007, ఆదివారం
ఆధ్యాత్మిక భాండాగారం
నిత్యం 'ఆదిత్య హృదయం' చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుందని పారాయణం చేసేవారు చాలామంది అంటారు. మరికొందరు కార్తీకమాసం వచ్చిందంటే చాలు..లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాధాష్టకం, ఉమామహేశ్వరస్తోత్రం వల్లె వేస్తుంటారు. నాలిక స్పష్టత లేక కొందరు ఆడియో రూపంలో వాటిని విని తరిస్తుంటారు. పుస్తకాలు, క్యాసెట్లు, సిడిల రూపంలో మాత్రమే ఇంతకాలం లభించిన మన ఆధ్యాత్మిక సంపద ఇప్పుడు అంతర్జాలం(Internet)లోనూ పొందుపరచబడి ఉంది.ఆధ్యాత్మిక ప్రియుల కోసం నెట్‌పై లభించే వివిధ భక్తి వెబ్‌సైట్ల వివరాలను ఇప్పుడు అందించడం జరుగుతుంది. www.telugubhakti.com/telugupages/main.htm అనే వెబ్‌సైట్‌లో శివ, విష్ణు,వేంకటేశ్వరస్వామి,అయ్యప్ప,కృష్ణుడు,లక్ష్మీదేవి,దుర్గామాత,విఘ్నేశ్వరుడు,సరస్వతీమాత, రాముడు, హనుమంతుడు వంటి వివిధ భగవత్ స్వరూపాలకు సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అచ్చ తెలుగులో స్కాన్ చేయబడి పొందుపరచబడి ఉన్నాయి. చాలా అరుదుగా లభించే అనేక స్తోత్రాలు ఈ వెబ్‌సైట్‌లో లభిస్తున్నాయి. కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు MP3 ఫార్మేట్‌లో ఆడియోగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి సైతం ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచబడి ఉండడం విశేషం!!
చల్లని మాటలతో భావం మనసులో హత్తుకుపోయేలా వివరించే ఉషశ్రీ కంఠస్వరం చాలామందికి సుపరిచితమే. ఉషశ్రీ స్వరం నుండి జాలువారిన రామాయణం, భాగవతం,మహాభారతాలను వింటుంటే ఎంతవారైనా తన్మయులు కావడం ఖాయం. వీటిని http://surasa.net/music/ushasri-vani/ అనే వెబ్‌సైట్‌లో Real Player ద్వారా వినవచ్చు. www.telugufm.com/modules/music/devotional.aspx అనే వెబ్‌సైట్‌లోనూ,
www.andhravilas.com/devotional.asp
www.raaga.com/channels/devotional.asp
www.andhrakitchen.com/devmusic.php
www.telugusongs.allindiasite.com\devo.html
www.ragalahari.com/devotional.asp
www.devotionalsongs.com
www.telugutoranam.com/devotional/index.php,
www.annamayya.org/home.htm
www.shaivam.org/ste.htm
వంటి వెబ్‌సైట్లలో తెలుగు శ్లోకాలు, స్త్రోత్రాలు ఆడియో రూపంలో వినడానికి సిద్ధంగా లభిస్తున్నాయి.www.teluguone.com/bhakti అనే వెబ్‌సైట్‌లో శ్లోకాలు, స్త్రోత్రాలు ఆడియో రూపంలో లభించడంతోపాటు వివిధ పూజలు,వ్రతవిధానం, కాలజ్ఞానం వంటి అనేక అంశాలు సైతం పొందవచ్చు.
25, ఆగస్టు 2007, శనివారం
మెయిల్ చదివింది లేనిది తెలుసుకోవడమెలా???
మనం మన స్నేహితులకు పంపించే మెయిల్స్‌ని వారు రిప్లై ఇచ్చేవరకు వారు వాటిని చదివింది లేనిదీ అర్ధం కాదు. అయితే ఓ చిన్న చిట్కాని పాటించడం ద్వారా మనం పంపించిన మెయిల్ మెసేజ్‌ని వారు ఎప్పుడు చదివినది, వారికి తెలియకుండానే మనం ఓ రిపోర్ట్ ద్వారా పొందవచ్చు. అదెలాగంటే www.statcounter.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఉచిత ఎకౌంట్‌ని రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు install code ఆప్షన్లలోకి వెళ్ళి invisible tracking button and HTML only counter అనే ఆప్షన్‌ని ఎంచుకున్న వెంటనే statcounter.com వెబ్‌సైట్ మనకు ఓ HTML image snippetని అందిస్తుంది. ఇప్పుడు మనం Google, Yahoo వంటి మెయిల్ ఎకౌంట్ల ద్వారా మెసేజ్‌ని కంపోజ్ చేసేటప్పుడు HTML ఫార్మేట్‌లో మెసేజ్ పంపబడేలా సెట్ చేసుకుని ఆ HTML పేజీలో ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న snippetని ఎంబెడ్ చేయండి. అంతే... మీ ఫ్రెండ్ మీరు పంపిన మెసేజ్‌ని ఓపెన్ చేసిన వెంటనే ... అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా మెసేజ్ ఓపెన్ చేసిన తేదీ, టైం వివరాలు మనకు వచ్చేస్తాయి..ఇంకెందుకు ఆలస్యం...
ఆటోమేటిక్‍గా జిప్ చేసే ప్లగ్‍ఇన్...
Outlook ప్రోగ్రామ్ ద్వారా మనం మెయిల్ మెసేజ్‌లు పంపిస్తూ, స్వీకరిస్తుంటాము. అధిక సందర్భాల్లో మనం పంపించే మెయిల్స్‌తోపాటు ఫైల్ అటాచ్‌మెంట్లు కూడా పంపించవలసి వచ్చినప్పుడు ఎక్కువ పరిమాణం కలిగిన ఫైళ్ళని పంపించడానికి అధిక సమయం తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో మెయిల్‌తోపాటు మనం పంపించే ప్రతీ అటాచ్‌మెంట్‌ని ఆటోమేటిక్‌గా జిప్ చేసి పంపించే ప్లగ్ఇన్ ఒకటి www.baxbex.com సైట్‌లో లభిస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల మెయిల్స్ వేగంగా పంపించడానికి వీలు పడుతుంది.
24, ఆగస్టు 2007, శుక్రవారం
హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు
ప్రస్తుతం 250GB వరకూ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఇంటర్నల్ హార్డ్ డిస్క్‌లు లభిస్తున్నాయి. వీటి కొనుగోలు సమయంలో చాలా మంది ఏమాత్రం శ్రద్ధ చూపించరు. హార్డ్ డిస్క్‌లను కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన వివిధ అంశాల గురించి క్రింద డీటైల్డ్‌గా వివరించడం జరిగింది.
స్టోరేజ్ కెపాసిటీ...
సాధారణ అవసరాలకు 40GB హార్డ్‌డిస్క్ సరిపోతుంది. అయితే 40 GBకీ 80 GBకీ రెండు మూడు వందలకు మించి పెద్దగా వృత్యాసం లేకపోవడం వల్ల 80GBని ఎంచుకోండి.క్యాసెట్ -టు-సిడి/డివిడి కన్వర్షన్ వంటి కార్యకలాపాలు చేసేవారు స్టోరేజ్ అవసరాలు ఎక్కువగా ఉండడంవల్ల కనీసం 120/160GB హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయండి. అంతకన్నా ఎక్కువ కెపాసిటీ కలిగిన హార్డ్‌డిస్క్‌లు అవసరం అయితే ఇంటర్నల్ డిస్క్‌ల కన్నా USB పోర్ట్‌కి కనెక్ట్ చేసుకోగలిగే ఎక్స్‌టర్నల్ డిస్క్‌లను కొనండి. ప్రస్తుతం ఎక్స్‌టర్నల్ డిస్క్‌లు 400GB స్టోరేజ్ కెపాసిటీవి ఉన్నాయి.
రోటేషనల్ స్పీడ్..
దాదాపు అన్ని ATA హార్డ్‌డిస్క్‌లు 5400 లేదా 7200 rpm (నిమిషానికి తిరిగే చుట్లు) కలిగి ఉంటున్నాయి. వాస్తవానికి హార్డ్‌డిస్క్ యొక్క rpm ఎక్కువగా ఉంటే హార్డ్‌డిస్క్ నుండి డేటా వేగంగా వెలిగితీయబడుతుంది. అయితే rpm ఒక్కటే హార్డ్‌డిస్క్ యొక్క పనితీరుని ప్రభావితం చేయదు. డ్రైవ్ జామెంట్రీ, డేటాని రిట్రీవ్ చెయ్యడానికి డ్రైవ్ అనుసరించే పద్ధతి వంటి పలు అంశాలు డ్రైవ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం కనబరుస్తాయి. ఏదేమైనా 7200rpm ఉన్న హార్డ్‌డిస్క్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి.
ఇంటర్‌ఫేస్..
ATA/133 కోవకు చెందిన డ్రైవ్‌లను ఎంపిక చేసుకోండి. ఈ హార్డ్‌డిస్క్‌లు సెకనుకు 133 MB వరకూ డేటాని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాయి. కొన్ని మదర్‌బోర్డ్‌లు ATA/133 ఇంటర్‌ఫేస్‌ని సపోర్ట్ చేయవు. అలాంటి బోర్డ్‌లలో కూడా ATA/133 హార్డ్‌డిస్క్‌లను అమర్చుకోవచ్చు. అయితే డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ మాత్రం సెకనుకు 100MB మాత్రమే లభిస్తుంది. అలాంటి పాతతరం బోర్డ్‌లలో ATA/133 హార్డ్‌డిస్క్‌ల నుండి సెకనుకు 133MB ట్రాన్స్‌ఫర్ రేట్‌ని సాధించాలంటే add-in కార్డ్ ఒకటి అమర్చుకోవాలి.
బఫర్...
ప్రాసెసర్ కొంత డేటాని అందించమని హార్డ్‌డిస్క్‌ని కోరిందనుకుందాం. హార్డ్‌డిస్క్ ముందుగా ప్రాసెసర్ ఒక్కసారికి ఎంత మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చెయ్యగలుగుతుందో అంతమేరకే పంపించి కోరిన మొత్తం డేటాలో కొంత మొత్తాన్ని ప్లాటర్లలోనుండీ తనవద్దే టెంపరరీ స్టోరేజ్ ఏరియాగా ఉండే "బఫర్" లో స్టోర్ చేసుకుంటుంది.ప్రాసెసర్ మొదట పంపించిన డేటాని ప్రాసెస్ చేయడం పూర్తయిన వెంటనే బఫర్‌లోని డేటాని ప్రాసెసర్‌కి పంపించి తిరిగి బఫర్‌ని నింపుకుంటుంది. హార్డ్‌డిస్క్‌ని కొనేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 8MB బఫర్ ఉన్న డ్రైవ్‌లను కొనుగోలు చేయండి.
కొన్న వెంటనే తనిఖీ చేయండి..
హార్డ్‌డిస్క్‌ని కొని పార్టీషన్లు చేసి ఫార్మేట్ చేసిన వెంటనే డిస్క్‌లోని అన్ని పార్టీషన్లని Surface Test ద్వారా తనిఖీ చేయండి. మేన్యుఫాక్చరింగ్ లోపాల వల్ల, డీలర్స్ ఎలా పడితే అలా పడేయడం వల్ల కొన్ని డిస్క్‌లలో ఆల్రెడీ బాడ్ సెక్టార్లు ఉండే అవకాశం ఉంది. బాడ్ సెక్టర్స్ కనిపిస్తే వెంటనే డిస్క్‌ని గట్టిగా అమర్చండి. స్క్రూలు టైట్ చేయకపోవడం వల్ల డిస్క్‌రీడింగ్ సమయంలో క్యాబినెట్ కదలడం వల్ల డిస్క్ సైతం కదిలినట్లయితే మీడియా ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశం ఉంది.
22, ఆగస్టు 2007, బుధవారం
100.చాటింగ్ చేసేవారికి శుభవార్త..
Gaim అనేది విండోస్‌తోపాటు పలు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టెంట్
మెసేజింగ్ క్లయింట్‌గా పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామ్ MSN Messenger,
Yahoo! Messenger, AIM, ICQ, IRC, jabber వంటి ప్రముఖ
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వర్లను సపోర్ట్ చెయ్యడమే కాకుండా పెద్దగా ప్రాచుర్యం పొందని
Gadu-Gadu, Zephyr నెట్‌వర్క్‌లను సైతం సపోర్ట్ చేస్తుంది. ఈ క్లయింట్
ప్రోగ్రామ్‌తో ఒకేసారి పలు మెసేజింగ్ సర్వర్లలోకి లాగిన్ అవవచ్చు. అలాగే ఒక
చాట్ సర్వర్ నుండి మరో చాట్ సర్వర్‌కి ఈజీగా మారిపోవచ్చు. పలు ఇన్‌స్టెంట్
మెసేజింగ్ ఎకౌంట్లు కలిగి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్.
ఆకర్షణియమైన ఫ్లాష్ ప్రజంటేషన్లకు....
వ్యాపార, విద్యారంగాలలో ఎంతో నాణ్యతతొ తక్కువ పరిమాణంలో ఇమిడిపోయే
ఫ్లాష్ ప్రజంటేషన్లకు ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది అయితే Macromedia Flash
ప్రోగ్రామ్‌ని నేర్చుకోవడం సులభంగా సాధ్యపడే వ్యవహారం కాదు. ఈ నేపధ్యంలో
PowerBullet అనే మౄదులాంత్రము(Software) సాయంతో PNG,
GIF, JPEG వంటి ఇమేజ్ ఫార్మేట్లు, MP3, WAV వంటి ఆడియో
ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళ ఆధారంగా మనకు నచ్చిన విధంగా ఆటోమేటిక్‌గా ప్లే
అయ్యే ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రజంటేషన్లని చాల సులభంగా రూపొందించుకోవచ్చు.
ప్రజంటేషన్లో ప్లే అయ్యే ప్రతీ పేజీకి ట్రాన్సిషన్ ఎఫెక్టులు జతచేసుకోవచ్చు.
ప్రజంటేషన్‌లను పుల్ స్క్రీన్‌లో ప్లే చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌తో పాటు అందులోని
సౌండ్ సింక్రనైజ్ అయ్యే విధంగా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌ని EXE ఫైల్‌గా
సేవ్ చేసుకోగలిగే ఈ ప్రోగ్రామ్‌ని www.imagemagick.org నుండి పొందవచ్చు.
ఎలక్ట్రానిక్ డిజైన్లకి దీనిని మించింది లేదు..
ఎలక్ట్రానిక్ డిజైన్లని తయారు చెయ్యవలసి వచ్చినపుడు అందులో ఉపయోగించే
కెపాసిటర్లు, ట్ర్రాన్సిస్టర్లు, Diodes, రెసిస్టర్లు, సెమీకండక్టర్లు, స్విచ్‍లు,
ట్రాన్స్ఫార్మర్లు, వాల్వులు, ఓల్టేజి కంట్రోల్ వంటి విభిన్నమైన అంశాల
చిహ్నాలను ఉపయోగించవలసి వస్తుంటుంది. మామూలు డ్రాయింగ్
మృదులాంత్రముల ద్వారా వీటిని డిజైన్ చెయ్యడం కత్తి మీద సాము లాంటిది.
ఈ నేపధ్యంలో ఎలక్ట్రానిక్ డిజైనర్లకు, బుక్ పబ్లిషర్లకు ఉపయోగపడే విధంగా
Electronic Design Studio అనే మృదులాంత్రం (Software)
డెవలప్ చేయబడింది. ఒక్కసారి ఈ మృదులాంత్రాన్ని ఇన్‍స్టాల్ చేసి చూస్తే
ఇందులో పొందుపరచబడిన వందలకొద్ది మోడళ్ళని చూసి ఆశ్చర్యపోతారు.
PDF నుండి టెక్స్ట్ ఫార్మేట్‍లోకి…
వందలాది పేజీలు గల PDF డాక్యుమెంట్లలోని సమాచారాన్ని TEXT ఫార్మేట్‍లోకి
కన్వర్ట్ చేసుకోవడానికి ముందుగా ఆ PDF ఫైల్‍ని Acrobat Reader
మృదులాంత్రముతో ఓపెన్ చేసుకుని అందులో ప్రతీ పేజీలోని టేక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని
మరో ప్రక్క Notepad ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసుకుని అందులో పేస్ట్ చేయ్యవలసి
ఉంటుంది. ఈ తతంగం ఏమీ లేకుండా మనం ఏ PDF ఫైల్‍ని ఇన్‍పుట్‍గా ఇచ్చినా
దానిలో ఉన్న సమాచారం మొత్తాన్ని మనమ్ సెలెక్ట్ చేసుకున్న లోకేషన్‍లో Text
ఫైల్‍గా సేవ్ చేసే మృదులాంత్రం(Software) PDF2TXT.
21, ఆగస్టు 2007, మంగళవారం
ఫోటోలను మార్ఫ్ చేసే మృదులాంత్రం(Software)
సినిమా యాడ్‍లలో బ్రహ్మానందం మొహం కోవై సరళగా మారిపోవడం.. వంటి గ్రాఫిక్స్
గమనించే ఉంటారు. అదే మాదిరిగా రెండు వేర్వేరు ఫోటోలను తీసుకుని మొదటి ఫోటో
క్షణాల్లో రెండవ ఫోటోగా రూపాంతరం చెందే విధంగా మార్ఫింగ్ చేసే మృదులాంత్రం
(Software) Magic Morph. JPEG, BMP, PNG, GIF, TIFF,
ICO, TGA, PCX, WBMP, WMF, J2K, JBG వంటి అన్ని పాపులర్
ఇమేజ్ ఫైల్ ఫార్మేట్లకు చెందిన ఫోటోలను దీనికి ఇన్‍పుట్‍గా ఇవ్వవచ్చు. మార్ఫింగ్
పూర్తయిన తర్వాత ఔట్‍పుట్ ఫైల్‍ని AVI, GIF, SWF, JPG ఫైల్ ఫార్మేట్లలోకి
సేవ్ చేసుకునే అవకాశముంది.
వెరైటీ బటన్లని రూపొందించే మృదులాంత్రం (Software)
నెట్ బ్రౌజ్ చేస్తున్నపుడు వెబ్ పేజీల్లో Enter, Exit , Continue
వంటి పేర్లతో ఆకర్షణీయమైన బటన్లు కన్పింస్తుంటాయి కదా. అదే మాదిరిగా
వివిధ స్టైళ్ళలో మీరూ స్వంతంగా బటన్లను డిజైన్ చేసుకుని మీరు రూపొందించే
వెబ్ పేజీల్లో గానీ, పేజ్‍మేకర్, ఫోటోషాప్, కోరల్‍డ్రా, వర్డ్ వంటి ఇతర
అప్లికేషన్లలో గాని ఉపయోగించుకోగలిగేలా. BMP, JPEG, GIF ఇమేజ్
ఫైల్ ఫార్మేట్లలో సేవ్ చేసిపెట్టే ప్రోగ్రామే… 3D Web Button.
MP3 ఫైళ్ళ కటింగ్‍కి ఓ సాఫ్ట్ వేర్..
మీరొక పాట వింటున్నారనుకుందాం. అందులో చాలా బాగా నచ్చిన బీజియమో,
మ్యూజిక్ సీక్వెన్సో మాత్రమే సాంగ్ నుండి సపరేట్ ఫైల్‍గా తీసుకోగలిగితే బాగుణ్ణు
అని అనిపించవచ్చు. లేదా మీరు వింటున్న MP3 సాంగ్స్ల్ లో, సాంగ్ మొదటా,
చివర్లలో ఉండే సైలెన్స్ ని తొలగించి కేవలం సాంగ్‍ని మాత్రమే సేవ్ చేసుకోదలుచు
కున్నపుడు MPEG Audio Scissors అనే మృదులాంత్రం(Software)
ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. VCD cutter మాదిరిగానే ఈ మృదులాంత్రంలోనూ
MP3 ఫైలులో ఎక్కడి నుండి మనకు కావాలో ఆ ప్రదేశాన్ని Start Frame గానూ,
ఎక్కడివరకైతే పాట కావాలో ఆ భాగాన్ని End Frame గానూ డిఫైన్ చేసి, Start
Processing/Save to file అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకేసారి పలు ఫైళ్ళనూ క్లిప్ చేయవచ్చు.
18, ఆగస్టు 2007, శనివారం
ప్లగ్-ఇన్స్ గురించి తెలుసుకుందాం
'మా సిస్టమ్‌లో వెబ్‌సైట్లలోని ఫ్లాష్ ఏనిమేషన్లు ప్లే అవడంలేదు.'అని కొందరు కంప్లేంట్లు చేస్తుంటారు. ఫోటోషాప్‌లో ఫలానా ప్లగ్ ఇన్ చాలా ఉపయోగకరంగా ఉందంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ Plug-ins అనే పదం మనకు వినిపిస్తున్నా దాని గురించి వివరంగా అందరికీ తెలీదు.
Plug-in అంటే ఏమిటి?
ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫోటోషాప్, Adobe Premier, 3DStudioMax వంటి మృదులాంత్రము(Software) ప్రోగ్రాములే Plug-ins ఉదా.కు ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్‌నే తీసుకుందాం. IE వెర్షన్ 5 కి ముందు వెర్షన్లు వాడేవారు. నెట్‌లో ఫ్లాష్ ఏనిమేషన్లని ప్లే చెయ్యలేదు. ఫ్లాష్ ఏనిమేషన్లు పొందాలంటే దానికోసం ప్రత్యేకంగా Macromedia Flash Plug-in అదీ IE కోసం రూపొందించబడింది.సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడాలి. ప్రస్తుతం IEలోనే అది రెడీమేడ్‌గా లభిస్తుంది.
బ్రౌజర్ ప్లగ్ఇన్‌లు నెట్ బ్రౌజింగ్‌కి కీలకమైనవ్...
నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని సైట్లలో .dcr ఎక్స్‌టెన్షన్ పేరు గల షాక్‌వేవ్ ఏనిమేషన్ ఫైళ్ళు కనిపిస్తుంటాయి. మరికొన్ని సైట్లలో .mov ఎక్స్‌టెన్షన్ పేరు గల QuickTime మూవీ ఫైళ్ళు దర్శనమిస్తుంటాయి. ఇలా పలు రకాల మల్టీమీడియా ఫైళ్ళని నేరుగా బ్రౌజర్లోనే ప్లే చెయ్యాలంటే ఆ పర్టికులర్ మృదులాంత్రము(Software) గానీ,దాని ప్లగ్ఇన్ గానీ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉండాలి.
మల్టీమీడియా అప్లికేషన్లకి ఉపయోగపడేవి...
Adobe Photoshop,Premiere, SoundForge, 3D Studio Max,Director వంటి పలురకాల మల్టీమీడీయా క్రియేషన్ ప్రోగ్రాముల కోసం అనేక ప్లగ్-ఇన్‌లు రూపొందించబడ్డాయి. ఆయా ప్లగ్ఇన్‌లు ఉంటేనే ఇన్‌స్టలేషన్ సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆ ఇన్‌స్టలేషన్ ప్యాకేజీలోనే పేరెంట్ మృదులాంత్రము(Software) యొక్క Plug-ins ఫోల్డర్‌ని వెదికి అది కనిపిస్తేనే ఇన్‌స్టలేషన్ కొనసాగేటట్లు ఏర్పాటు చెయ్యబడి ఉంటుంది. ఒక హైఎండ్ మృదులాంత్రాన్ని(Software) దృష్టిలో ఉంచుకుని డెవలప్ చేసిన ప్లగ్ ఇన్‌లు ఇతర ప్రోగ్రాముల మాదిరిగా Start మెనూలో కనిపించవు.
ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత...
ఏదైనా ప్లగ్ఇన్‌లు డౌన్‌లోడ్ చేసుకుని మన సిస్టమ్‌లో ఇన్‌స్తాల్ చేసుకునేటప్పుడు అది ఏ ప్రోగ్రామ్‌కి సంబంధించినదో ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉండకూడదు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇన్‌స్టాల్ చేస్తున్న ప్లగ్ఇన్ ఇన్‌స్టలేషన్ సమయంలో మెయిల్ ప్రోగ్రామ్‌కి అదనంగా షెల్‌లను క్రియేట్ చెయ్యవలసి ఉంతుంది. ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్లయితే అది సాధ్యపడదు. ప్లగ్ఇన్ ఇన్‌స్టలేషన్ పూర్తయిన వెంటనే ఒరిజినల్ ప్రోగ్రామ్‌తో పాటు అవి మెమరీలోకి లోడ్ చెయ్యబడి, యూజర్ కోరుకున్నపుడు ఒరిజినల్ ప్రోగామ్‌లో అంతర్భాగంగా కానీ లేదా టెంపరరీగా ప్రత్యేకమైన విండోలో గాని ఓపెన్ అయి యూజర్ కోరుకున్న పని నెరవేర్చి పెడతాయి. నెట్‌లో అనేక రకాల ప్లగ్ ఇన్‌లు లభిస్తున్నాయి.
17, ఆగస్టు 2007, శుక్రవారం
స్పాం మెయిల్స్‌ని తనిఖీ చేసిపెట్టే పవర్‌ఫుల్ ప్రోగ్రామ్
ఇ-మెయిల్ యూజర్లని స్పామింగ్‌తోపాటు వైరస్‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపధ్యంలో
మన inbox లో చేరుకునే ప్రతీ మెసేజ్‌ని క్షుణ్ణంగా పరిశీలించి స్పామ్ మాదిరిగా
తోచిన మెయిల్స్‌తో పాటు వైరస్‌కోడ్, అటాచ్‌మెంట్లు ఉన్న మెయిల్స్‌ని తొలగించే
ప్రొగ్రామే MailWasher ఈ ప్రోగ్రామ్ స్పామ్ మెయిల్స్ పంపించినవారికి రిటర్న్
Bouncing మెసేజ్‌లను పంపిస్తుంది. దీనివల్ల మునుముందు అదే వ్యక్తి నుండి
తిరిగి స్పామ్ మెయిల్స్ నిరోధించవచ్చు. ఎందుకంటే బౌన్స్ అవని మెయిల్
ఎకౌంట్స్‌కి మాత్రమే స్పామర్లు మళ్ళీ మళ్ళీ మెయిల్స్ పంపిస్తుంటారు.ఇ-మెయిల్
యూజర్లకి పనికి వచ్చే ఈ ప్రోగ్రాం- www.mailwasher.net సైట్లో లభిస్తుంది.
కార్డ్‌లు డిజైన్ చేయడం ఎలా?
ప్రొఫెషనల్ క్వాలిటీ విజిటింగ్ కార్డులు, ఫోటో ఐడెంటిఫికేషన్ బ్యాడ్జ్‌లు, ఎన్వలప్‌లు,లేబుళ్ళూ,బార్‌కోడ్‌లు మొదలైనవి డిజైన్ చేయడానికి ఉపకరించే ప్రోగ్రామే Print Studio ఈ ప్రోగ్రామ్‌లో రెడీమేడ్‌గా, ఎక్కువగా వాడుకలో ఉన్న వివిధ పరిమాణాల టెంప్లేట్లు పొందుపరచబడి ఉన్నాయి.Custom Sizes కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ www.jollytech.com సైట్‌లో లభిస్తోంది.
16, ఆగస్టు 2007, గురువారం
టాబ్లెట్ పిసి ... ఏమి దాని కథ?
Tablet PC.. దీనిని చూసిన వారికన్నా ఈ పదం విన్నవారే ఎక్కువుంటారు. కంప్యూటర్ల వినియోగం ఊపందుకున్న తర్వాత Laptops,Desktop,Tablet PC, Pocket PC వంటి వేర్వేరు రూపాల్లో కంప్యూటర్ లక్షణాలు కలిగున్న డివైజ్‌లు ఆవిర్భవించాయి. అలాంటి వాటిలో Tablet PC ఒకటి. దాని పేరుకు తగ్గట్టే పేపర్ టాబ్లెట్ పరిమాణంలో ఉంటుందీ పిసి. టాబ్లెట్ పిసి స్క్రీన్‌పై నేరుగా డిజిటల్ పెన్ సహాయంతో పేపర్‌పై ఎలా రాస్తామో అదే విధంగా రాయవచ్చు. నోట్‌బుక్ కంప్యూటర్ల కన్నా మరింత సులువుగా ఒక చోటి నుండి మరో చోటికి తీసుకు వెళ్ళగలిగేలా ఈ టాబ్లెట్ పిసిలను రూపొందించారు. వీటి కోసం అనేక మౄదులాంత్రాలు(Software) లభిస్తున్నాయి.
ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడవచ్చు?
Tablet PC కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా XP ఆపరేటింగ్ సిస్టమ్‌ని రూపొందించింది. Windows XP Pro Tablet PC Edition పేరిట విడుదల చేయబడిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఒక్క పైసా చెల్లించనవసరం లేకుండా వాడుకోవచ్చు. అంటే ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ కోసం సర్వీస్ ప్యాక్2 కూడా విడుదల చేయబడింది. SP2ని Tablet PCలో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్ సదుపాయాలు, ఇన్‌పుట్ ప్యానెల్ మరింత మెరుగుపరచబడ్డాయి.
టాబ్లెట్ పిసినే ఎందుకు ఎంచుకోవాలి?
పోర్టబులిటీ, ప్రయోజనాల రీత్యా టాబ్లెట్ పిసి లాప్‌టాప్‌లు,PDA డివైజ్‌ల స్థానంలో ప్రత్యామ్నాయంగా వాడబడుతోంది. కీబోర్డ్ వాడడానికి వీల్లేని మీటింగ్‌లు, క్లాసులు వంటి ప్రదేశాల్లో TableT PCని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇందులో మన రాసే రాతల్ని అక్షరాలుగా మార్చే హ్యాండ్ రికగ్నిషన్ టెక్నాలజీ లభిస్తోంది. బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ప్రొసెసర్ తక్కువ వేడికి గురవుతుంది. Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు అనేక థర్డ్‌పార్టీ అప్లికేషన్లు లభిస్తున్నాయి. టాబ్లెట్ పిసితో పాటు అందించబడే పెన్‌ని ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్‌లోని, అప్లికేషన్లలోని మెనూలను యాక్సెస్ చేయవచ్చు. బరువు పరంగా కూడా నోట్‌బుక్‌లతో పోలిస్తే మూడు పౌండ్లకు మించి టాబ్లెట్ పిసిలు బరువు ఉండవు. డిజిటల్ పెన్‌ని సురక్షితంగా పెట్టుకోవడానికి Tablet PCలో అమరిక ఉంటుంది. టాబ్లెత్ పిసిలో కీబోర్డ్లను సైతం కనెక్ట్ చేసుకోగలిగే మోడళ్ళూ ఉన్నాయి.
ప్రాసెసర్ వేగం
టాబ్లెట్ పిసిల కోసం ఇంటెల్ Centrino, Dothan వంటి ప్రొసెసర్లు వాడుకలో ఉన్నాయి. క్లాక్‌స్పీడ్ విషయంలో ఆ ప్రొసెసర్లు నోట్‌బుక్‌ల్లో వాడబడే మొబైల్ ప్రొసెసర్ల కన్నా వేగంగా పనిచేస్తాయి. ఉదా.1.66GHz క్లాక్ స్పీడ్ కలిగిన టాబ్లెట్ పిసి ప్రొసెసర్ 2.4GHz క్లాక్ స్పీడ్ కలిగిన Pentium4-M ప్రొసెసర్ కన్నా వేగంగా పని చేయగలుగుతుంది. తక్కువ ఓల్టేజ్‌పై రన్ అవడమే దీనిక్కారణం. Tablet PCలోని మెమరీని కూడా అవసరాన్ని బట్టి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక హార్డ్‌డిస్క్ విషయానికి వస్తే 60GB నుండి 120GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన హార్డ్‌డిస్కులు వీటిలో వాడబడుతున్నాయి. కొన్ని అధునాతన టాబ్లెట్ పిసిల్లో సిడిలను, డివిడిలను రీడ్ చేస్తూ సిడిలను రైట్ చేయగల CDRW -DVD డ్రైవ్‌లు సైతం లభిస్తున్నాయి. కొన్ని పిసిల్లో USB,Firewire పోర్టులు కూడ అమర్చబడి ఉంటున్నాయి. విడిగా లభించే సిడి,డివిడి డ్రైవ్‌లను సైతం టాబ్లెట్ పిసికి కనెక్ట్ చేసుకోవచ్చు. అదనపు మోనిటర్, ప్రొజెక్టర్‌లకు కనెక్ట్ చేసుకోగలిగే వెసులుబాటు కూడా పొందుపరచబడి ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ విషయానికి వస్తే 1024x768 మొదలుకుని 1400x1050 వరకూ స్క్రీన్ రిజల్యూషన్‌ని అందించే టాబ్లెట్ పిసి మోడళ్ళు మార్కెట్లో లభిస్తున్నాయి. ఒకసారి చార్జ్ చేసిన తర్వాత 4 నుండి 12 గంటల వరకు బ్యాటరీ నిలిచి ఉంటుంది. Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌పై మనం రెగ్యులర్‌గా ఉపయోగించుకునే MS-Office, Pagemaker,Photoshop వంటి అన్ని అప్లికేషన్లూ టాబ్లెట్ పిసిపై నిస్సందేహంగా రన్ అవుతాయి. మరిన్ని థర్డ్ పార్టీ మృదులాంత్రాలు(Software) సైతం ప్రత్యేకంగా లభిస్తున్నాయి.
15, ఆగస్టు 2007, బుధవారం
Word ఫైళ్ళు ఫోటోలుగా సేవ్ చేయొచ్చా?
Wordలో టైప్ చేసిన తెలుగు ఫాంట్లు ఆ ఫాంట్లు లేని సిస్టమ్‌లో ఓపెన్ అవవు కదా! అవి వేరే సిస్టమ్‌లో కనిపించాలంటే వర్డ్ నుండి పిక్చర్‌గా మార్చుకోవాలి.Word, Excel, Pagemaker వంటి ఏ ప్రోగ్రామ్‌లో మనం డిజైన్ చేసుకున్న డాక్యుమెంట్లనైనా కీబోర్డ్‌పై PrintScreen కీని ఉపయోగించి BMP ఇమేజ్‌గా పొందవచ్చు. ఒకవేళ పేజీ హైట్ స్క్రీన్ హైట్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే Miraplacid Publisher అనే ధర్డ్‌పార్టీ మృదులాంత్రము(Software)ని ఉపయోగించండి. ఈ మృదులాంత్రము మన సిస్టమ్‌లో ఒక ప్రింటర్ డ్రైవర్‌గా ఇన్‌స్టాల్ అయి ఏ అప్లికేషన్‌లోని డాక్యుమెంట్లనైన JPEG, TIFF, BMP ఇమేజ్‌లుగా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
హార్డ్‌డిస్క్ జీవితకాలం తెలుసుకోవడం ఇలా...
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అన్ని హార్డ్‌డిస్క్‌ల్లోనూ SMART (Self Monitoring And Reporting Tool) టెక్నాలజీ పొందుపరచబడి ఉంటోంది. దీన్ని ఆధారంగా చేసుకుని మన హార్డ్‌డిస్క్ ఎంత మెరుగ్గా పనిచేస్తోందీ, Spin Up Time, Reallocated Sector Count వంటి పలు వివరాలతో పాటు ప్రస్తుతం ఉన్న కండిషన్‌లో హార్డ్‌డిస్క్ ఎన్నాళ్ళపాటు పనిచేస్తుందీ (తేదీతో సహా)తెలియజేసే మృదులాంత్రం (Software) ఒకటి ఉంది. అదే Active SMART. హార్డ్‌డిస్క్‌కి సంబంధించి సమగ్ర సమాచారంతో పాటు లాగ్ ఫైళ్ళని ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తుంది.
న్యూస్ గ్రూప్స్ నుండి ఇమేజ్‌ల డౌన్‌లోడింగ్
అంతర్జాలము(Internet)లో వందలాది న్యూస్‌గ్రూపులు లభ్యమవుతుంటాయి. వాటినుండి నేరుగా ఇమేజ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, కొత్తగా లభ్యమవుతున్న న్యూస్‌గ్రూప్‌లను గుర్తించడానికి ఉపయోగపడే ప్రోగ్రామే"A Pic Viewer" మనకు నచ్చిన న్యూస్‌గ్రూప్ అడ్రస్‌ని స్పెసిఫై చేసి Download pictures now అనే బటన్‌ని క్లిక్ చేస్తే ఆ న్యూస్‌గ్రూప్ నుండి ఈ ప్రోగ్రామ్ ఇమేజ్‌లను డౌన్‌లోడ్ చేస్తుంది. ఎంత పరిమాణం గల ఇమేజ్‌లను డౌన్‌లోడ్ చెయ్యాలన్నది కూడా ఇందులో పేర్కొనవచ్చు.
14, ఆగస్టు 2007, మంగళవారం
కొత్త పదాలు
ఇప్పటినుండి ప్రతినెల ఈ బ్లాగులో ఇంగ్లీషులోని రెండు పదాలు తెలుగు పదాలతో రాయబడతాయి. ఆ తర్వాత ఆ తెలుగు పదమే వాడబడుతుంది. అలవాటు చేసుకోండి తెలుగు పదాలు. ఇది చాలా సులువు. ఈ బ్లాగులో కుడిచేతి వైపు ఈ నెల పదాలు పేరిట వాటిని పొందుపరిచాం చూడండి.
CDలు ఎలా పని చేస్తాయంటే..
1.22mm మందం కలిగిన ప్లాస్టిక్ ముక్కగా సిడిని పరిగణించవచ్చు. Polycarbonate ప్లాస్టిక్‌తో సిడిలను తయారుచేస్తారు. తయారీ దశలో ఆ ప్లాస్టిక్ పై పల్చని రిఫ్లెక్ట్ అయ్యే అల్యూమినియం పొరని అమర్చుతారు. ఆ అల్యూమినియం పొరను కాపాడడానికి దానిపై మరో పల్చని Acrylic పొరని పొందుపరుస్తారు. చివరిగా దానిపై కంపెనీ లేబుల్‌ని ప్రింట్ చేస్తారు. లోపలి నుండి బయటకు వంపులుగా అమర్చబడి ఉన్న ఒకే ఒక ట్రాక్ సిడిపై పొందుపరచబడుతుంది. సిడిపై ఉండే ట్రాక్ 0.5 మైక్రాన్ల మందంతో (మైక్రాన్ అంటే మీటర్‌లో మిలియన్ వంతు అని అర్ధం) లోపలి వంపుకి దాని తర్వాత వచ్చే వంపుకి మధ్య 1.6 మైక్రాన్ల గ్యాప్ తో పొందుపరచబడి ఉంటుంది. ట్రాక్ నిర్మాణానికి ప్రాతినిధ్యం వహించే Polycarbonate ప్లాస్టిక్ పై ఉండే bumps 0.5 మైక్రాన్ల వెడల్పుతోనూ, కనీసం 0.83 మైక్రాన్ల నిడివితోనూ, 125 నానోమీటర్ల హైట్‌ని కలిగి ఉంటాయి. (మీటర్‌లో బిలియన్ భాగాన్ని నానోమీటరు అంటారు)
సిడిరామ్ డ్రైవ్ యొక్క లేజర్ సిడిని రీడ్ చేసే వైపు నుండి పరిగణిస్తే వీటిని bumps అంటారు. అదే సిడి పైభాగం నుండి పరిగణించేటప్పుడు వీటిని bumps అని కాకుండా pits అని పిలుస్తారు. ఇంత తక్కువ పరిమాణం కలిగిన bumps తో నిర్మితం కావడం వల్ల సిడిలోని ట్రాక్ చాలా నిడివి కలిగి ఉంటుంది. ఒక సిడిలోని ట్రాక్‌ని కనుక విడిగా తీసి తిన్నగా పరుచుకుంటూపోతే 5 కిలోమీటర్ల నిడివి కలిగి ఉంటుంది ఆ ట్రాక్. సిడిరామ్ డ్రైవ్ bumps రూపంలో సిడిపై పొందుపరచబడి ఉన్న సమాచారాన్ని రీడ్ చేస్తుంది. సిడిరామ్ డ్రైవ్‌లో ఉండే Drive Motor మనం ఇన్‌సర్ట్ చేసిన డిస్క్‌ని నిముషానికి 200 నుండి 500 చుట్లు వేగంతో తిప్పుతుంది. సిడిరామ్ డ్రైవ్‌లోని లేజర్ మరియు లెన్స్‌లు సిడిలోని bumps పై దృష్టి కేంద్రీకరించి అందులోని డేటాని రీడ్ చేస్తాయి. ఇలా రీడ్ చేయబడిన డేటా , డేటాబ్లాక్‌లుగా కంప్యూటర్‌కి అందించబడుతుంది.
13, ఆగస్టు 2007, సోమవారం
మెమరీ Latency గురించి తెలుసా?
కంప్యూటర్‌ని ఆన్ చేసి మనం పనిచేసుకుంటూ పోతాం.మనం టైప్‌చేసే డేటా మొత్తం సైలెంట్‌గా RAM మాడ్యుళ్ళలో తాత్కాలికంగా భద్రపరచబడుతుంది. ఎప్పుడైతే మనం ఫైల్‌ని సేవ్ చేస్తామో అప్పుడు ఆ సమాచారం RAM నుండి హార్డ్‌డిస్క్‌కి సేవ్ చేయబడుతుంది.చాలామందికి ఇంతవరకు మాత్రమే తెలుసు తప్ప RAM పనితీరు ఇంతకన్నా వివరంగా తెలియదు.. ఒక్కసారి నిలువు,అడ్డ గళ్ళతో కూడిన లుంగీలను గుర్తు తెచ్చుకోండి. ప్రతీ నిలువు,అడ్డ గడి కలిసే చోట ఒక పెట్టె తయారవుతుంది కదా! సరిగ్గా అదే పద్ధతిలో మెమరీ అడ్రస్‌లు పలు పెట్టెలుగా ఉంటాయి.సిపియు నుండి ఏదైన సమాచారం అందించమని అభర్థన పంపించబడితే మెమరీ ముందు ఆ సమాచారం ఏ అడ్డువరుసలో ఉందో చెప్పమని సిపియుని కోరుతుంది. ఆ వివరాలు లభించేటంత వరకూ ఆగుతుంది. ఇలా అడ్డువరుస కోసం వేచి చూసే సమయాన్ని RAS (Row Address Strobe) Latency అంటారు. అలాగే అడ్డువరుస వివరాలు లభించిన తర్వాత ఆ సమాచారం ఏ నిలువు వరుసలో ఉన్నదన్నది మళ్ళీ మెమరీ సిపియుని అడుగుతుంది. ఆ వివరాలు వచ్చేటంతవరకు కొద్దిసేపు ఆగుతుంది. ఈ వెయిట్ టైంని CAS ( Column Address Strobe) Latency అనే పేరుతో వ్యవహరిస్తారు.
భారతీయ ఐటి నిపుణులకు ఓ కమ్యూనిటీ
ఐ.టి నిపుణుల పరంగా మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు,సాంకేతిక నిపుణులు, కాలేజీ విద్యార్థుల కోసం www.techtribe.com పేరిట ఓ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ప్రారంభించబడింది. సాధారణ వ్యక్తుల కోసం ఉద్ధేశించబడి Orkut వంటి ఇతర ఆన్‌లైన్ కమ్యూనిటీలు అనేకం ఉన్నాయిగాని ఈ Tech Tribe మాత్రం ఖచ్చితంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇందులో మీ పేరు, హాబీలు, ఫోటో వంటి సాధారణ వివరాలతో పాటు వృత్తి పరంగా మీరు సాధించిన విజయాలు, మీరు అభివృద్ధిపరిచిన సాఫ్ట్‌వేర్ల వివరాలు, మీరు పనిచేసిన ప్రాజెక్టు వివరాలు, కన్సల్ట్ చేసిన కంపెనీలు వంటి అనేక వివరాలను మీ ప్రొఫైల్‌తో పాటు ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేయవచ్చు. అలాగే మీరు పనిచేస్తున్న కంపెనీలో ఏవైనా అంశాలు మీకు నచ్చకపోతే ఇక్కడ తెలియజేస్తే అవి మీ కంపెని పరిశీలనకు తీసుకువెళ్ళబడి పరిష్కరించబడతాయి.
12, ఆగస్టు 2007, ఆదివారం
ఔట్‌లుక్నే మీ వాల్‌పేపర్‌గా సెట్ చేసుకోండి
మీ ఇ-మెయిల్ మెసేజ్‌లు, అపాయింట్‌మెంట్లు, వివిధ అంశాల గురించి నోట్స్, చేయవలసిన పనుల జాబితా వంటివన్నీ Microsoft Outlookలో స్టోర్ చేసుకుంటున్నారా? అయితే ఔట్‌లుక్ అందుబాటులో లేకపోతే మీకు ఒక్క క్షణం గడవదు అన్నమాట. అలాంటప్పుడు దాన్ని ప్రతీసారీ ఓపెన్ చేసుకోవడం ఎందుకు? సింపుల్‌గా Outlook on the desktop అనే సాప్ట్ వేర్ సాయంతో Outlook ప్రోగ్రాంని ఏకంగా మీ డెస్క్‌టాప్‌కి వాల్‌పేపర్‌గా సెట్ చేసుకుంటే బాగుంటుంది. దీనితో ఔట్‌లుక్‌లోని మీ కాంటాక్టులు,అపాయింట్‌మెంట్లు, ఈవెంట్లు,ఇ-మెయిల్సు అన్నీ డెస్క్‌టాప్ పైనే పరుచుకుంటాయి. ఔట్‌లుక్ డెస్క్ టాప్ పై ఉన్నప్పటికీ అది ట్రాన్స్పరెంటుగా అమర్చబడడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాల్‌పేపర్ నిక్షేపంగా కనిపిస్తుంటుంది. డెస్క్‌టాప్‌పైనే మెయిల్ మెసేజ్‌లకు రిప్లై కంపోజ్ చేయవచ్చు. కొత్త అపాయింట్‌మెంట్లని క్రియేట్ చేసుకోవచ్చు.అన్నీ డెస్క్‌టాప్‌పై నుండే సాధ్యపడతాయన్నమాట.
స్పీచ్ రికగ్నిషన్ తో జాగ్రత్త
Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం మైక్రోఫోన్ ద్వారా ఆదేశించే కమాండ్లకు ఆపరేటింగ్ సిస్టం ఆటోమేటిక్‌గా ప్రతిస్పందించేలా స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. అంటే సింపుల్‌గా మీరు పిసి ముందు కూర్చుని Shutdown అని పలకడం ఆలస్యం పెట్టే బేడా సర్దుకుని విండోస్ షట్‌డౌన్‌కి ఉపక్రమిస్తుందన్నమాట. అలాగే ఫైళ్ళని డిలీట్ చేయాలంటే డిలీట్ ఆని ఆదేశం జారీ చేస్తే చాలు. అంతా బాగానే ఉంది. Dragon Naturally Speaking వంటి ధర్డ్‌పార్టీ స్పీచ్ రికగ్నిషన్ సాప్ట్ వేర్ల స్థాయిలో ఇది పనిచేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ వల్ల కొత్త తంటా వచ్చే ప్రమాదం ఉంది. ఎవరైనా హ్యాకర్లు ఈ కమాండ్లతో కూడిన ఆడియో ఫైల్‌ని మీ సిస్టమ్‌కి పంపించారనుకోండి, అదేదో మంచి మ్యూజిక్ ఆల్బం అని మీరు వెంటనే వినడం మొదలుపెడితే.. అందులో ఆ హ్యాకర్లు ఇచ్చిన స్పీచ్ రికగ్నిషన్ ఆదేశాలు మొత్తం ఒక దాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవడం మొదలుపెడతాయి కదా! అలాగే YahooChat వంటి సర్వర్లలో ఎవరెవరితోనో వాయిస్ చాట్ చేస్తుంటాం. వారు ఇచ్చే ఆదేశాలను స్పీకర్ల నుండి మైక్రోఫోన్ స్వీకరించి ఎగ్జిక్యూట్ చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి అవసరం అయినప్పుడు తప్ప ఇతర సమయాల్లో స్పీచ్ రికగ్నిషన్‌ని ఆఫ్ చేయడం ఉత్తమం.
11, ఆగస్టు 2007, శనివారం
రేపిడ్‌షేర్‌కి గుడ్‌బై చెప్పండి
ఇంటర్‌నెట్‌పై ఉచితంగా ఫైళ్ళని స్టోర్ చేసుకోగలిగే సర్వీస్‌ని అందిస్తున్న Rapidshare తనకున్న పాపులారిటీని అడ్డుపెట్టుకుని ఫ్రీ యూజర్లని Download limitలు, ఇతర నియమాల పేరిట ఎంత విసిగిస్తుందో తెలిసిందే. దీని తలనొప్పులు తొలగిపోవాలంటే http://upload.divshare.com/ అనే ప్రత్యామ్నాయపు ఫైల్ హోస్టింగ్ వెబ్‌సైట్‌ని ఎంచుకోండి. ఈ సైట్ కి ఒక్కొక్కటి 200MB వరకు సైజ్ గల ఎన్ని అటాచ్‌మెంట్లనైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిమిటి ఉండదు. Rapishareలో కేవలం 100MB అటాచ్‌మెంట్ మాత్రమే వీలుపడతాయని మీకు తెలిసిందే కదా! ఒకసారి మీరు అప్‌లోడ్ చేసుకున్న ఫైళ్ళని కొన్నాళ్ళపాటు ఎవరూ డౌన్‌లోడ్ చేసుకోకపోతే Rapidshare డిలీట్ చేసేస్తుంది. అయితే ఈ Divshare సైట్ మన ఫైళ్ళని శాశ్వతంగా తన వద్దే పెట్టుకుంటుంది. ఈ వెబ్‌సైట్ యొక్క ఇంటర్‌ఫేస్ కూడా చాలా సింపుల్‌గా వాడేలా ఉంటుంది.
ఆటపట్టించే మెసేజ్‌లు ఇలా సృష్టించొచ్చు..
డెస్క్‌టాప్‌పై ఒక ఫైల్‌ని ఉంచి, ఎవరైనా దానిని క్లిక్ చేసిన వెంటనే పగలబడి నవ్వించే జోక్ కాని, హార్ట్‌బీట్ పెంచే వార్నింగ్ మెసేజ్ కాని చూపించబడేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చని మీకు తెలుసా?? Notepad ద్వారా కావలసిన మెసేజ్‌ని టైప్ చేసి .vbs ఫైల్‌గా క్లిక్ చేసిన వెంటనే You have just deleted C:\Windows. Your disk will be formatted when you shutdown అనే వార్నింగ్‌తో హడలగొట్టాలంటే సింపుల్‌గా Notepad ఓపెన్ చేసి Response+MsgBox("you just deleted C:\Windows\"+vbcrlf+"your disk will be formatted when you shutdown",vbokonly,"Danger!") అనే వాక్యాన్ని టైప్ చేసి దాని ఎదో ఒక పేరుతో డెస్క్‌టాప్‌పై .vbs ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేయండి.ఇక్కడ రెండు లైన్లని +vbcrlf+ అనే పదం కలుపుతుంది.చివరగా vbokonly అనే పదం తర్వాత కోటేషన్ మార్కుల మధ్య వార్నింగ్ మెసేజ్ టైటిల్‌గా ఏం ఉండాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయవలసి ఉంటుంది. ప్రాక్టికల్‌గా చేసి చూడండి. ఈ టెక్‌నిక్ ఎంత సరదాగా ఉంటుందో! Windows Scripting Host ఇన్‌స్టాల్ చేయబడి ఉంటేనే ఇది సాధ్యం సుమా! ఇది సరదాకోసం రాసింది మాత్రమే.. అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ కోసం ఇలా కూడా ప్రయత్నించొచ్చు అని.
డిలీట్ చేయబడిన YouTube వీడియోలను చూడడం
www.youtube.com అనే వీడియో హోస్టింగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది తమ వద్ద ఉన్న వీడియో క్లిప్‌లను ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి క్లిప్‌లలో కొన్ని చట్టవిరుద్దమైనవి ఉన్నవన్న ఫిర్యాదులు వచ్చినప్పుడు YouTube సంస్థ ఆయా క్లిప్‌లను తొలగించినట్లు x గుర్తుని ఆయా క్లిప్‌ల వద్ద చూపిస్తుంది. అంటే ఆ క్లిప్‌లను అక్కడి నుండి చూడడం వీలుపడదన్నమాట. అయితే వాస్తవానికి YouTube ఆయా చట్ట విరుద్ధమైన వీడియోలను కొన్నాళ్ళపాటు తన సర్వర్‌లోనే ఉంచుకుంటుంది. కేవలం యూజర్లు యాక్సెస్ చేయకుండా వాటి రిఫరెన్సులను వెబ్‌పేజీల నుండి మాత్రమే తొలగిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన కొంత మంది డిలీట్ చేయబడిన YouTube వీడియోలను కూడా వీక్షించగలిగేలా ప్రత్యేకమైన ఏర్పాటు చేసారు. http://youtube.infamousx.com/index.php అనే వెబ్ సైట్ ద్వారా ఇలా డిలీట్ చేయబడిన YouTube వీడియోలను వీక్షించవచ్చు.
10, ఆగస్టు 2007, శుక్రవారం
హార్డ్ వేర్ భాగాల, సాప్ట్ వేర్ల ధరలు తెలుసుకోవాలా?
మీరు కొత్త కంప్యూటర్ కొనాలనుకుంటున్నారా? లేదా డివిడి రైటర్, మెమరీ, మోనిటర్ వంటి హార్డ్ వేర్ పరికరాలను కొనాలనుకుంటున్నారా? షాపింగ్ కి వెళ్లబోయేముందు ఒకసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే http://www.pcprice.info/computer_price_list_india.htm అనే వెబ్ పేజీని సందర్శించి ఒక అవగాహనకు రావచ్చు. అలాగే వివిధ ప్రముఖ సాప్ట్ వేర్ల మార్కెట్ ధరలు http://www.pcprice.info/software.htm అనే వెబ్ పేజీలో లభిస్తాయి. కంప్యూటర్ ఎరా ఫోరం ద్వారా ఈ సైట్ ని మా దృష్టికి తీసుకువచ్చిన "karasvas" అనే మా ఫోరం సభ్యునికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. మా కంప్యూటర్ ఎరా ఫోరంలో మరో ముఖ్య సభ్యులు చిలకపాటి శివరామప్రసాద్ గారు మా ఫోరంలోనే వివిధ హార్డ్ వేర్ పరికరాలను ఎంచుకుంటే ఎంతెంత మొత్తంలో ధర పలుకుతుంది అని తెలియజేసే ధరల కాలిక్యులేటర్ తో కూడిన http://www.npithub.com/ అనే మరో ఆసక్తికరమైన వెబ్ సైట్ ని తెలియజేశారు. ఇలాంటి పాఠకుల సహకారం మాటలతో వ్యక్తపరచలేనిది. ఈ సమాచారం ఎవరికి ఉపయోగపడినా ఆ ఖ్యాతి వారికే చెందుతుంది.
కంప్యూటర్లో టి.వి. ప్రోగ్రాములు ఎలా చూడొచ్చు?
ఇటీవలి కాలంలో సామాన్య ప్రజానీకానికి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో శాటిలైట్ చానెళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద కంప్యూటర్ ఉంటే ఒక పక్క పనిచేసుకుంటూనే ఒక చిన్న విండోలో టివీ ప్రోగ్రాములు చూసే అవకాశం ఉంది. ఇలా కంప్యూటర్ ద్వారా టివి ప్రోగ్రాములు చూడడానికి మీ కంప్యూటర్లో 'టివి ట్యూనర్ కార్డ్' అనే హార్డ్‌వేర్ పరికరాన్ని అదనంగా అమర్చుకోవలసి ఉంటుంది. దీన్ని మీ పిసిలో ఇన్‌స్టాల్ చేసుకుంటే నిరభ్యంతరంగా మీ కంప్యూటర్ ద్వారా కేబుల్‌లో వచ్చే అన్ని ప్రోగ్రాములు చూడవచ్చు. దీని గురించి వివరంగా చూద్దాం.టెలివిజన్ ప్రసారాలు అనలాగ్ సిగ్నళ్ళ రూపంలో ఉంటాయి. అయితే కంప్యూటర్ కేవలం డిజిటల్ రూపంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే ప్రాసెస్ చెయ్యగలుగుతుంది. కాబట్టి టెలివిజన్ అనలాగ్ సిగ్నళ్ళని కంప్యూటర్ అర్ధం చేసుకోగలిగే డిజిటల్ రూపంలోకి మార్చి వాటిని కంప్యూటర్ మానిటర్‌పై చూడగలిగే విధంగా వీలు కల్పించే పరికరమే 'టివి ట్యూనర్ కార్డ్'. దీనిని మీ కంప్యూటర్లోని PCI స్లాట్‌పై అమర్చవలసి ఉంటుంది. మార్కెట్లో ఎక్స్ టర్నల్ టివి ట్యూనర్ కార్డు లు కూడా లభిస్తున్నాయి. మీరు కొత్తగా టివి ట్యునర్ కార్డ్ కొనుగోలు చేసినప్పుడు దానితోపాటు టెలివిజన్ కార్యక్రమాలను వీక్షించడానికి, నచ్చిన ప్రోగ్రాములను కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌పై రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే డివైజ్ డ్రైవర్ల సిడి మరియు, టివికి మాదిరిగానే ఓ రిమోట్ కంట్రోల్ కూడా లభిస్తుంది.
మదర్‌బోర్డ్‌పై స్లాట్‌లో కార్డ్‌ని అమర్చిన తర్వాత దాని యొక్క డ్రైవర్లని మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది.దాంతో Start Menu> Programs గ్రూప్‌లో టి.వి.ట్యూనర్ కార్డ్‌కి సంబంధించిన ఓ సబ్ గ్రూప్ ప్రత్యక్షమవుతుంది.అందులో సరైన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్క్రీన్‌పై టి.వి. ప్రసారాలను పొందవచ్చు.
వీడియో సిడిల్లో, టెలివిజన్‌లో ప్రసారం అయ్యేటంత నాణ్యంగా టి.వి ట్యూనర్ కార్డ్ ద్వారా కేబుల్ ప్రసారాలను రికార్డ్ చేసుకోవాలంటే మాత్రం Win VCR వంటి వీడియో రికార్డింగ్ సాప్ట్ వేర్లను ఆశ్రయించక తప్పదు.ఎంతో నాణ్యవంతమైన MPEG1, MPEG2, ASF వంటి ఫైల్ ఫార్మేట్లలో ఈ సాప్ట్ వేర్ల ద్వారా కేబుల్ ప్రసారాలను రికార్డ్ చేసుకోవచ్చు.
టి.వి ట్యూనర్ కార్డ్ సాప్ట్ వేర్‌లో Always on top అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంటుంది. దానిని క్లిక్ చేసినట్లయితే వీడియో విండో ఇతర అన్ని విండోలకన్నా పై భాగంలో చూపించబడుతుంది. దీని ద్వారా మీరు వర్డ్, పేజ్‌మేకర్, ఫోటోషాప్ వంటి ఇతర సాప్ట్ వేర్లపై నిరాటంకంగా పనిచేసుకుంటూ మరో ప్రక్క టెలివిజన్ ప్రసారాలను వీక్షించవచ్చు.
9, ఆగస్టు 2007, గురువారం
8, ఆగస్టు 2007, బుధవారం
ఈ పదాలకు అర్థాలు తెలుసా
Mainframe, Minicomputer, Micro-computer: కంప్యూటర్లలోని ప్రధానమైన మూడు సైజులివి. భారీ కార్పోరేట్ సంస్థలు, బ్యాంకులు మెయిన్ ఫ్రేమ్‌లను ఉపయోగిస్తుంటాయి. స్కూళ్ళు, ఇతరత్రా మధ్యస్థాయి సంస్థలు మినీ కంప్యూటర్లను వాడుతుంటాయి. చివరగా మనం ఇళ్ళలో , ఆఫీసుల్లో వాడే పర్సనల్ కంప్యూటర్లు మైక్రో కంప్యూటర్లుగా పరిగణించబడుతూ ఉంటాయి. ఎక్కువ వాడుకలో ఉన్నవివే.
Male Connector పిన్‌లను కలిగిఉండే కంప్యూటర్ కనెక్టర్‌ని Male Connector గా పిలుస్తారు. ఉదా.కు పేరలల్ పోర్ట్ ప్రింటర్, స్కానర్లను కంప్యూటర్‌కి కనెక్ట్ చేసే కేబుల్, హార్డ్‌డిస్క్,సిడిరామ్ డ్రైవ్ వంటి వివిధ డిస్క్‌లకు మనం పవర్ సప్లై నిమిత్తం కనెక్ట్ చేసే కేబుళ్ళు,మేల్ కనెక్టరుకు చెందినవిగా చెప్పబడుతున్నాయి.
Margin : పేజ్ డిజైనింగ్, వర్డ్ ప్రాసెసింగ్, ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లలో ఈ పదం వినిపిస్తుంటుంది. ఒక ప్రామాణికమైన పేజీసైజ్‌ని తీసుకుని , అందులో పేజీ అంచులకు పెజీలో పొందుపరిచే సమాచారానికి మధ్య మనం వదిలివేసే ఖాళీ స్థలాన్ని మార్జిన్ అంటారు.
Male Connector పిన్‌లను కలిగిఉండే కంప్యూటర్ కనెక్టర్‌ని Male Connector గా పిలుస్తారు. ఉదా.కు పేరలల్ పోర్ట్ ప్రింటర్, స్కానర్లను కంప్యూటర్‌కి కనెక్ట్ చేసే కేబుల్, హార్డ్‌డిస్క్,సిడిరామ్ డ్రైవ్ వంటి వివిధ డిస్క్‌లకు మనం పవర్ సప్లై నిమిత్తం కనెక్ట్ చేసే కేబుళ్ళు,మేల్ కనెక్టరుకు చెందినవిగా చెప్పబడుతున్నాయి.
Margin : పేజ్ డిజైనింగ్, వర్డ్ ప్రాసెసింగ్, ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లలో ఈ పదం వినిపిస్తుంటుంది. ఒక ప్రామాణికమైన పేజీసైజ్‌ని తీసుకుని , అందులో పేజీ అంచులకు పెజీలో పొందుపరిచే సమాచారానికి మధ్య మనం వదిలివేసే ఖాళీ స్థలాన్ని మార్జిన్ అంటారు.
అన్ని IM లూ ఒకే చోటి నుండి యాక్సెసింగ్
Yahoo,MSN, AIM, ICQ, IRC వంటి వేర్వేరు ఇన్‌స్టెంట్ మెసెంజర్‌లలో మనకు ఎకౌంట్లు ఉన్నట్లయితే వాటన్నింటిని వేర్వేరుగా ఓపెన్ చేసుకోవలసిన పనిలేకుండా imGiant అనే ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే వేర్వేరు tabs నుండి కాలసిన క్లయింట్‌ని ఎంచుకోవచ్చు. వివిధ ఎకౌంట్లలో ఉండే ఫ్రెండ్స్‌లిస్ట్ మొత్తం ఒకే ప్రదేశంలో ఒకే buddy listగా అమర్చబడుతుంది. ట్రై చేయండి.
7, ఆగస్టు 2007, మంగళవారం
ఇమేజ్ ఎడిటింగ్ కి పనికి వచ్చే ప్రోగ్రామ్
మీరు డిజిటల్ కెమెరా సాయంతో భారీ మొత్తంలో ఫోటోలను సిస్టమ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారనుకుందాం. అయితే లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అన్ని ఫోటోలు ఆశించిన స్థాయిలో రాలేదనుకుందాం. అలాంటప్పుడు అందరూ చేసే పని ప్రతీ ఫోటోని ఫోటోషాఫ్ వంటి సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ చేసుకోవడం. ఈ ఇబ్బందేమీ లేకుండా భారీ మొత్తంలో ఉన్న ఇమేజ్‌లకు Gamma, Brightness/Contrast, Blur, Colorize, DropShadow, Mosaic, Negative, Sharpen, Despeckle, Emboss, Vibration వంటి రకరకాల ఫిల్టర్లని, ఎఫెక్ట్‌లనీ అప్లై చెయ్యడానికి ఉపకరించే ప్రోగ్రామ్ ఒకటుంది. అదే 'EyeBatch'. మనం ప్రాసెస్ చెయ్యదలుచుకున్న ఫోటోలను, వాటికి అప్లై చెయ్యవలసిన ఫిల్టర్‌లను ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎంచుకుని ఔట్‌పుట్ ఫోల్డర్‌ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అన్ని ఫోటోలూ ప్రాసెస్ చెయ్యబడి ఆ ఫోల్డర్లో స్టోర్ అయిపోతాయి. ఇందులో పొందుపరచబడిన ప్రతీ ఫిల్టర్‌కూ దాని ఇంటెన్సిటీని స్పెసిఫై చేయడానికి ఆప్షన్లు సైతం లభ్యమవుతున్నాయి. బ్యాచ్ ప్రాసెసింగ్ కి ఉపకరించే ఈ ప్రోగ్రాం ని http://www.atalasoft.com/eyebatch/download/ebinstall.exe అనే వెబ్ పేజీ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
లాప్ టాప్ లలో విద్యుత్ వినియోగం
పరిమాణంలో చాలా చిన్నగా ఉండే లాప్ టాప్ ల్లో ఇతర హార్డ్ వేర్ పరికరాల మాట అలా ఉంచితే ప్రాసెసర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కువ విద్యుత్ నీ, సిస్టం వనరులను వినియోగించుకుంటూ విపరీతమైన వేడిమిని వెలువరించే ప్రాసెసర్ ని లాప్ టాప్ కి అనుగుణంగా తీర్చిదిద్దడంలో చిప్ తయారీ కంపెనీల ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. Micro FCPGA2, FCBGA2 ప్యాకేజింగ్ టెక్నాలజీల ద్వారా రూపొందించబడే ఈ ప్రాసెసర్లు స్వల్ప మొత్తంలో మాత్రమే విద్యుత్ ని వినియోగించుకుంటూ, తక్కువ మొత్తంలో వేడిని వెలువరించే విధంగా ఉంటాయి. లాప్ టాప్ ఖాళీగా ఉండే సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి తద్వారా బ్యాటరీని ఆదా చేసే Quick Start సదుపాయం కూడా వీటిలో పొందుపరచబడి ఉంటుంది. ఒక్క సెకండ్ మనం కంప్యూటర్ ని ఉపయోగించకపోయినా Deeper Sleep Alert State ఏక్టివేట్ చేయబడి విద్యుత్ ని ఎక్కువగా వినియోగించుకునే పరికరాలకు వీలైనంత తక్కువ విద్యుత్ అందించబడుతూ తద్వారా బ్యాటరీ ఆదా చేయబడుతుంది.
6, ఆగస్టు 2007, సోమవారం
Yahoo Mail Betaలో పనిచేసే చిట్కాలు
Yahoo Mail Beta లో అనేక అధునాతనమైన సదుపాయాలు పొందుపరచబడ్డాయి. Yahoo Mail Betaలో ఉన్నపుడు కొన్ని చిట్కాలను పాటించవచ్చు. Inbox లోని ఏదైనా మెసేజ్‌ని స్క్రీన్‌పై కనిపించే contacts అనే లింక్‌పైకి డ్రాగ్ చేస్తే ఆ మెసేజ్‌ని పంపించిన యూజర్ ID క్షణాల్లో మన అడ్రస్ బుక్‌కి జతచేయబడుతుంది. అలాగే ఒకే ఫోల్డర్‌లో ఒకే సబ్జెక్ట్ లైన్‌తో ఉన్న మెసేజ్‌ల వద్దకు వెళ్ళాలంటే Ctrl+Shift+Up, Ctrl+Shift+Down Arrow కీలని ఉపయోగిస్తే సరిపోతుంది. Inboxలో ఉన్న చదవవలసిన అవసరం లేని మెసేజ్‌లను చదివినట్లు మార్క్ చేసుకోవాలంటే పై భాగంలో కుడిచేతి వైపు ఉండే Options అనే లింక్‌లోకి వెళ్ళి Mail Options సెలెక్ట్ చేసుకుని Mark messages as read అనే డ్రాప్‌డౌన్ లిస్ట్ వద్ద immediately అని సెట్ చేస్తే సరిపోతుంది. ఫోల్డర్లని ఒక క్రమపద్దతిలో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మెసేజ్‌లతో కూడిన విభాగం తాత్కాలికంగా దాచి పెట్టబడి మరింత స్థలం కనిపించాలంటే కీబోర్డ్‌పై ఉండే v కీని ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇదే కీని ప్రెస్ చేస్తే మెసేజ్ ప్రివ్యూ తిరిగి స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. విండోలో ఉండగా కీబోర్డ్‌పై ఉండే N అనే కీని ప్రెస్ చేసామంటే compose విండో స్క్రీన్ పై వస్తుంది. కొత్త మెసేజ్‌ని కంపోజ్ చేసుకోవచ్చు. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న మెసేజ్‌కి రిప్లై ఇవ్వాలంటే R కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
బ్యాండ్‌విడ్త్ ఎంత లభిస్తుంది
ఈ మధ్య ఎక్కడ చూసినా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందిస్తామంటూ
అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థ రూ.250 కే
unlimited connection, రూ.400లకే 512kbps కనెక్షన్
అంటూ ఊదరగొట్టే ప్రచారాల్లో వాస్తవం ఎంతో తెలుసుకున్న తర్వాతే
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని ఎంచుకోవాలి. సహజంగా ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి
ఉన్నపుడు మీ కనెక్షన్ ద్వారా ఎంత డేటా సెకనుకు అప్‌లోడ్, డౌన్‌లోడ్
అవుతున్నదీ తెలుసుకోవాలంటే DU Meter అనే సాఫ్ట్‌వేర్ భేషుగ్గా
ఉంటుంది. మీరు నెట్‌కి కనెక్ట్ అయి www.2wire.com అనే
వెబ్‌సైట్‌లో ఉండే speed meter అనే ఆప్షన్ ద్వారా కూడా మీకు
ఎంత బ్యాండ్‌విడ్థ్ లభిస్తోంది అన్నది తెలుసుకుని మీ నెట్ ఆపరేటర్‌ని
నిలదీయవచ్చు. ప్యాకేజీలను ఎంచుకునే ముందు Download
limitలు సర్వీస్ టాక్స్‌లు వంటి అన్ని అంశాల గురించి తెలుసుకున్న
మీదటనే నెట్ కనెక్షన్ తీసుకోండీ.
డివిడి డిస్క్ లలో ఉండే ఫైళ్ల వివరాలు
ఎప్పుడైనా డివిడి డిస్క్ ల్లోని ఫైళ్ల పేర్లను చూసినట్లయితే VOB, IFO, BUP వంటి ఎక్స్ టెన్షన్ నేం కలిగిన ఫైళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక డివిడి డిస్క్ ని డివిడి ప్లేయర్లో ప్లే చేయాలంటే ఈ ఫైళ్లు తప్పనిసరిగా ఉండాలి. VOB ఫైళ్లలో సినిమా యొక్క ఆడియో మరియు వీడియో సమాచారం భద్రపరచబడి ఉంటుంది. IFO ఫైళ్లలో ఆ డివిడి మూవీని డివిడి ప్లేయర్ ఎలా ప్లే చేయాలన్న వివరణ ఉంటుంది. IFO ఫైల్ లేనిదే వీడియో, ఆడియో సమాచారంతో కూడిన VOB ఫైల్ ఉన్నాడివిడి ప్లేయర్ (టివికి కనెక్ట్ చేసుకునేది) ఆ వీడియోని ప్లే చేయలేదు. IFO ఫైళ్లు ఏ కారణం చేతైనా కరప్ట్ అయినట్లయితే, వాటి స్థానే బాధ్యతలు నిర్వర్తించడానికి IFO ఫైళ్లకు బ్యాకప్ కాపీగా BUP ఫైళ్లు డివిడి డిస్క్ల్ లో భద్రపరచబడి ఉంటాయి. చాలామంది కేవలం ఒరిజినల్ డివిడి డిస్క్ లోని VOB ఫైళ్లను వేరే ఖాళీ డివిడిలోకి కాపీ చేస్తే డివిడి రెడీ అయిపోతుందని భావిస్తుంటారు. IFO, BUP ఫైళ్లు లేకుండా ఒరిజినల్ VOB ఫైల్ ఉన్నా టివికి కనెక్ట్ చేసే డివిడి ప్లేయర్ విషయంలో అది నిరుపయోగమే!
5, ఆగస్టు 2007, ఆదివారం
ఫొటోలను ఎడిట్ చేసి సేవ్ చేసేటప్పుడు..
ఫొటోషాప్ వంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాప్ట్ వేర్ల సాయంతో రకరకాల ఇమేజ్ లను వివిధ Layersగా అమర్చుకుని అందంగా డిజైన్ చేసినప్పుడు దానిని BMP వంటి ఫొటో ఫార్మేట్లలోకి సేవ్ చేస్తే అందులోని లేయర్లు అన్నీ గ్రూప్ చేయబడతాయి. దానితో భవిష్యత్ లో ఆ ఇమేజ్ లో పొందుపరిచిన లేయర్లని విడివిడిగా ఎడిట్ చేయడానికి వీలుపడదు. కాబట్టి ఎంతో కష్టపడి వివిధ లేయర్లని అమర్చుకుని, పలు రకాల ఫిల్టర్లని ఉపయోగించుకుని మీరు డిజైన్ చేసుకున్న ఇమేజ్ లను "ఇక అదే ఫైనల్ ఇమేజ్, అంతకు మించి ఎడిట్ చేయడానికి ఇంకా ఏమీ లేదు" అనుకుంటే తప్ప లేయర్లని Flat చేయకండి. భవిష్యత్ లో మళ్లీ ఎడిట్ చేయాలనుకున్న ఇమేజ్ లను ఫొటోషాప్ ఇమేజ్ ఫార్మేట్ అయిన PSD ఫార్మేట్లో సేవ్ చేయండి. లేదా TIFF ఫార్మేట్లో సేవ్ చేయదలుచుకున్నా Layersని include చేయడం మాత్రం మరువకండి. ఇలా ఇమేజ్ తో పాటు లేయర్లనీ సేవ్ చేయడం వల్ల ఫైల్ యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎన్ని ఎక్కువ లేయర్లు ఉంటే ఫైల్ సైజ్ అంత ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మల్టీ సెషన్ సిడిలో కొత్త ఫైళ్లే కనిపిస్తున్నాయా?
సహజంగా Nero వంటి సాప్ట్ వేర్ల ద్వారా సిడిలను రైట్ చేసేటప్పుడు, సిడిలో ఖాళీ ఉంటే మరోమారు ఆ ఖాళీ స్థలంలో రైట్ చేసుకోగలిగే విధంగా చాలామంది Burn Settingsలో Write Method అనే ఆప్షన్ వద్ద Track-at-once ఆప్షన్ ఎనేబుల్ చేయబడి ఉండగా సిడి రైట్ చేస్తుంటారు. సిడిలో ఖాళీ స్థలాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఇది బాగా దోహదపడుతుంది. అయితే ఇలా ఒకే సిడిలో వేర్వేరు పర్యాయాలు కొంత కొంత చొప్పున సమాచారాన్ని రైట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు చివరిగా రికార్డ్ చేసిన సమాచారం మాత్రమే లభిస్తూ గతంలో అదే సిడిలో రికార్డ్ చేసిన సమాచారం తుడిచిపెట్టుకుపోయి ఆందోళనకు గురిచేస్తుంది. మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంకి ఫైళ్లు, ఫోల్డర్ల వివరాలతో FAT32, NTFS వంటి ఫైల్ సిస్టంలు ఎలా ఉంటాయో సిడిలలోనూ వాటిలో మనం రికార్డ్ చేసిన సమాచారం TOC (Table Of Contents)పేరిట భద్రపరచబడి ఉంటుంది. మల్టీ సెషన్లో (Track-at-once) సిడిలను రైట్ చేసినప్పుడు చివరిసారిగా సిడిని రైట్ చేసినప్పుడు TOC రాయబడేటప్పుడు గతంలో ఉన్న TOC పరగణనలోకి తీసుకోవకపోవడం వల్ల కేవలం మనం తాజాగా రైట్ చేసిన సమాచారం మాత్రమే సిడిలో కనిపిస్తూ పాతది మాయమైపోతుంటుంది. అలాంటప్పుడు మనం ఏ సిస్టంలో ఏ సిడి రైటర్లో ఆ సిడిని రైట్ చేశామో ఆ రైటర్లో సిడిని పెట్టి చూడండి. చాలావరకూ పాత సమాచారం కనిపిస్తుంది. వేరే సిస్టంలలో మాత్రం అది కనిపించదు. అలాంటప్పుడు సిడిలోని ఖాళీ స్థలం వృధా అయినా Disk-at-once అనే ఆప్షన్ ని ఎంచుకోవడం ఉత్తమం.
4, ఆగస్టు 2007, శనివారం
IE టైటిల్ బార్ పై మీ పేరు పెట్టుకోండి ఇలా..
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ టైటిల్ బార్ లో Windows Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా జతచేయబడేలా చేసుకోవచ్చు. అదెలాగంటే Start>Run కమాండ్ బాక్స్ లో gpedit.msc అనే కమాండ్ ని టైప్ చేసి OK బటన్ కొట్టండి. వెంటనే Group Policy పేరిట ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో User Configuration>Windows Settings>Internet Explorer Maintenance>Browser User Interface అనే విభాగంలో కుడి చేతి వైపు Browser Title అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దానిని మౌస్ తో డబుల్ క్లిక్ చేసి Customize Title Bars అనే ఆప్షన్ ని టిక్ చేసి ఆ క్రింద కనిపించే Title Bar Text టెక్ట్స్ బాక్స్ లో మీ పేరుని టైప్ చేయండి. ఇప్పుడు Group Policyని క్లోజ్ చేసి, Internet Explorer ఓపెన్ చేస్తే టైటిల్ బార్ లో మీ పేరు కూడా కనిపిస్తుంది.
చిట్కాలు - 3
1. నెట్‌కి కనెక్ట్ అయినప్పుడల్లా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చెయ్యబడే విధంగా ఏంటి్‌వైరస్ ప్రోగ్రాములను కాన్ఫిగర్ చేయడం మంచిది. అధికశాతం ఏంటీ వైరస్ లు డీఫాల్ట్ గా అలాగే కాన్ ఫిగర్ చేయబడి ఉంటున్నాయి అనుకోండి.
2. ఏ కారణం వల్లయినా సిడిరామ్ డ్రైవ్ డోర్ బయటకు రానట్లయితే దానిపై ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ హోల్‌లో పిన్‌తో గుచ్చండి.
3.Desktop.scf అనే ఫైల్ డిలీట్ చెయ్యబడినప్పుడు Quick Launch Barపై Show Desktop ఆప్షన్ సైతం మాయమవుతుంది.
4.BIOSలో Internal Cache లేదా CPU L1, L2 Cacheల పేరిట కనిపించే ఆప్షన్లని తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవడం మంచిది.
5. నాసిరకం స్పీకర్లను ఉపయోగించడం వలన వాటిని మోనిటర్ ప్రక్కన అమర్చినపుడు స్క్రీన్ డిస్‌ప్లేలో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.
2. ఏ కారణం వల్లయినా సిడిరామ్ డ్రైవ్ డోర్ బయటకు రానట్లయితే దానిపై ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ హోల్‌లో పిన్‌తో గుచ్చండి.
3.Desktop.scf అనే ఫైల్ డిలీట్ చెయ్యబడినప్పుడు Quick Launch Barపై Show Desktop ఆప్షన్ సైతం మాయమవుతుంది.
4.BIOSలో Internal Cache లేదా CPU L1, L2 Cacheల పేరిట కనిపించే ఆప్షన్లని తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవడం మంచిది.
5. నాసిరకం స్పీకర్లను ఉపయోగించడం వలన వాటిని మోనిటర్ ప్రక్కన అమర్చినపుడు స్క్రీన్ డిస్‌ప్లేలో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.
ఆటో రన్ వల్ల నష్టమే ఎక్కువ!
Windows XP, 9x ఆపరేటింగ్ సిస్టంలలో సిడి/డివిడి డ్రైవ్ లో సిడి/డివిడిలను ఇన్ సర్ట్ చేసినప్పుడు వాటిలో ఉండే సమాచారం ఆటోమేటిక్ గా ఓపెన్ చేయబడే విధంగా Autorun సదుపాయం డీఫాల్ట్ గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది. వాస్తవంగా సిడి/డివిడి డ్రైవ్ ల Autorun వల్ల మనకు కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. ఈ సదుపాయం ఎనేబుల్ చేయబడి ఉన్నప్పుడు మనం సిడి డ్రైవ్ లో సిడిని పెట్టినా పెట్టకున్నా ఏవో కొంపలు ముంచుకుపోతున్నాయన్నట్లు ప్రతీ 5 సెకండ్లకోసారి విండోస్ ఆపరేటింగ్ సిస్టం సిడి డ్రైవ్ వైపు దృష్టి మళ్లిస్తుంటుంది. అంటే ప్రతీ 5 సెకండ్లకోసారి విండోస్ ఆపరేటింగ్ సిస్టం సిడి/డివిడి డ్రైవ్ లను తనిఖీ చేయడానికే కొన్ని వనరుల్ని వినియోగిస్తుందన్న మాట. దీనివల్ల చాలా సూక్ష్మ పరిమాణంలో సిస్టం పనితీరు నెమ్మదిస్తుంది. ఇకపోతే Autorun.inf అనే ఫైల్ పొందుపరచబడి ఉన్నసిడిలను ఇన్ సర్ట్ చేసినప్పుడు మాత్రమే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆటోరన్ సదుపాయం ఆ ఫైల్ని ఏక్టివేట్ చేసి అందులో పొందుపరచబడి ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సాధారణంగా మనం ఎక్కువగా autorun.inf ఫైల్ లేని మామూలు సిడిలనే ఇన్ సర్ట్ చేస్తుంటాం. Autorun సదుపాయం మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డీఫాల్ట్ గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది కాబట్టి.. అలాంటి మామూలు సిడిలను సైతం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఎక్కడైనా Autorun.inf ఫైల్ ఉందేమోనని అన్వేషిస్తుంది. దీనివల్ల కూడా కొంతవరకూ పిసి పనితీరు క్షీణిస్తుంది. ఈ నేపధ్యంలో సిడి/డివిడిల ఆటోరన్ సదుపాయాన్ని డిసేబుల్ చేసుకోవడం ఉత్తమం. దీనికిగాను విండోస్ రిజిస్ట్రీని మోడిఫై చేయాలి. Start>Run కమాండ్ బాక్స్ల్ లో regedit అని టైప్ చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రాం ని ఓపెన్ చేసి, అందులో HKEY_LOCAL_MACHINE\System\CurrentControlSet\Services\CDRom అనే విభాగంలోకి వెళ్లి కుడి చేతి వైపు AutoRun అనే Dword వేల్యూని వెదికి పట్టుకుని దానిపై మౌస్ తో రైట్ క్లిక్ చేయడం ద్వారా Modify అనే ఆప్షన్ ని ఎంచుకోండి. ఇప్పుడు ఆ Dwordకి ఆల్రెడీ ఉన్న 1 అనే విలువ స్థానంలో 0 అనే విలువను ఇస్తే autorun డిసేబుల్ అవుతుంది.
సౌండ్ కార్డ్ కొనాలనుకుంటున్నారా?
సిస్టం ద్వారా సౌండ్ అందించడానికి మదర్‌బోర్డ్‌పైనే సౌండ్‌చిప్ ఉన్నప్పటికీ మ్యూజిక్ ఇష్టపడేవారు, సౌండ్ ఎడిటింగ్ రంగంలో పనిచేసేవారు నాణ్యమైన సౌండ్‌కార్డ్‌ని అదనంగా కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. మ్యూజిక్ వినడానికి సౌండ్‌కార్డ్ కొంటున్నట్లయితే 5.1 Surround వంటి మల్టిపుల్ చానెళ్ళని అందించే సౌండ్‌కార్డ్‌ని ఎంచుకోండి. ఒకవేళ గేములు ఆడేవారు గేముల నుండి క్వాలిటీ సౌండ్‌ని కోరుకుంటున్నట్లయితే Direct Sound, EAX, A3D, 13DL2 వంటి స్టాండర్డ్‌లను సపోర్ట్ చేసే సౌండ్‌కార్డ్‌ని ఎంపిక చేసుకోవడం వల్ల త్రీడీ క్వాలిటీ పొందవచ్చు. సౌండ్‌కార్డ్‌లు PCI, USB, ISA ఇంటర్‌ఫేస్ కలిగినవి లభిస్తుంటాయి. PCI, USB కార్డ్‌లను కొనుగోలు చేయండి. అలాగే సౌండ్‌కార్డుతోపాటు అందించబడే డివైజ్‌డ్రైవర్లు Windows అన్ని వెర్షన్లతోపాటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని సపోర్ట్ చేసేవి ఉండేలా జాగ్రత్త వహించండి. లినక్స్‌కి ఆదరణ పెరుగుతున్న తరుణంలో భవిష్యత్తులో సౌండ్‌కార్డ్ డ్రైవర్లు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సౌండ్‌కార్డ్ ద్వారా సిగ్నల్స్ నష్టపోకుండా ఉండాలంటే గోల్డ్ ప్లేటేడ్ కనెక్టరులు కలిగిన సౌండ్‌కార్డ్‌ని కొద్దిగా ధర ఎక్కువైనా ఎంపిక చేసుకోండి.
3, ఆగస్టు 2007, శుక్రవారం
Favoritesని ప్రింట్ చేసుకోవడమెలాగంటే...
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ప్రోగ్రాములోని Favorites ఫోల్డర్‌లో మీరు సేవ్ చేసుకున్న
లింకులన్నింటినీ పేపర్‌పై ప్రింట్ చేసుకునే మార్గం ఒకటుంది. IE ఓపెన్ చేసి File
మెనూలోని Import/Export ఆప్షన్ ఎంచుకున్న వెంటనే Import/Export
Wizard పేరుతో ఓ విండో ప్రత్యక్షమవుతుంది. Next బటన్ క్లిక్ చేసి Export
Favorites అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుని Next క్లిక్ చేయండి. ఇప్పుడు
Favorites ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని Next క్లిక్ చేసి Export to a File
or Address అనే ఆప్షన్ వద్ద ఏదో ఒక పాత్ ఇవ్వండి. మనం స్పెసిఫై చేసిన
పాత్‌లో ఇప్పుడు bookmark.htm పేరుతో ఓ ఫైల్ క్రియేట్ అయి అందులోని మన
Favorites ఫోల్డర్‌లో ఉన్న లింకులన్నీ చేర్చబడతాయి. ఆ ఫైల్‌ని డబుల్‌క్లిక్ చేస్తే
లింకులతో కూడిన IE విండో ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత IEలో
File>Print అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుని Print డైలాగ్ బాక్స్‌లో print
table of links అనే ఆప్షన్ టిక్ చేసి ప్రింట్ చేస్తే లింకులన్నీ పేపర్ పైకి వస్తాయి.
సిడికి మనకు నచ్చిన ఐకాన్ జత చేయడం
కొన్ని సిడిలను సిడిరామ్ డ్రైవ్‌లో ఉంచినప్పుడు MyComputer, Windows Explorer లను ఓపెన్ చెయ్యగానే సిడిరామ్ డ్రైవ్ ప్రదేశంలో మామూలు సిడిరామ్ డ్రైవ్ ఐకాన్‌కి బదులు ఆ సిడిలో ఉన్న కంటెంట్‌ను ప్రతిబింబించే విధంగా ఐకాన్ మారుతుంటుంది. ముఖ్యంగా Adobe Photoshop, Spiderman వంటి అప్లికేషన్ ప్రోగ్రాముల సెటప్ సిడిల్లో ఇలాంటి కస్టమైజ్డ్ ఐకాన్లు దర్శనమిస్తుంటాయి. మీవద్ద సిడిరైటర్ ఉంటే మీరు రైట్ చేసుకునే సిడిలకూ ఇలా కస్టమైజ్డ్ ఐకాన్లు జత చేసుకోవచ్చు. ముందుగా http://www.aha-soft.com/iconutils/index.htm అనే వెబ్ సైట్లో లభించే IconUtilis వంటి థర్డ్‌పార్టీ సాప్ట్ వేర్లను ఉపయోగించి మీ ఫోటోనో లేక మీకు నచ్చిన ఇత గ్రాఫిక్‌నో .ico ఫైల్‌గా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు Notepad ఓపెన్ చేసి క్రింది లైన్లని టైప్ చేయండి.
[AUTORUN]
icon=1.ico (ఇక్కడ 1.ico బదులు మీరు క్రియేట్ చేసుకున్న ఐకాన్ ఫైల్ పేరుని ఇవ్వండి) ఇప్పుడు ఆ Notepad ఫైల్‌ని autorun.inf పేరుతో సేవ్ చేసి , సిడిని రైట్ చేయబోయేటప్పుడు ఇతర కంటెంట్‌తో పాటు ఐకాన్ .ico ఫైల్‌నీ, autorun.inf ఫైల్‌ని రెండింటినీ సిడి యొక్క రూట్ డైరెక్టరీలో add చేసి సిడిరైట్ చేస్తే సరిపోతుంది.
హెల్ప్ ఫైళ్ల వివరాలు
వివిధ సాప్ట్ వేర్లలో వాటిని ఎలా ఉపయోగించాలో తెలియజేస్తూ Help పొందుపరచబడి ఉంటుంది కదా! సాధారణంగా అధికశాతం సాప్ట్ వర్ల యొక్క హెల్ప్ ఫైళ్లు .hlp అనే ఎక్స్ టెన్షన్ నేం ని కలిగి ఉంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని Notepad, Paint వంటి వివిధ ప్రోగ్రాముల యొక్క హెల్ప్ ఫైళ్లతో పాటే మనం ఇన్ స్టాల్ చేసే దాదాపు అధికశాతం థర్డ్ పార్టీ సాప్ట్ వేర్ల హెల్ప్ ఫైళ్లు కూడా డీఫాల్ట్గ్ గా వాటి ఇన్ స్టలేషన్ సమయంలోనే Windows>Help ఫోల్డర్లోకి కాపీ చేయబడతాయి. కొన్ని సాప్ట్ వేర్ల హెల్ప్ ఫైళ్లు మాత్రం వాటి ప్రోగ్రాం EXE ఫైల్ ఏ ఫోల్డర్లో భద్రపరచబడి ఉందో అదే లొకేషన్లో స్టోర్ చేయబడతాయి. కొన్ని సాప్ట్ వేర్ల హెల్ప్ ఫైళ్లు .hlp ఎక్స్ టెన్షన్ నేంకి బదులుగా .chm అనే ఎక్స్ టెన్షన్ నేంని కలిగి ఉంటాయి. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా ప్రోగ్రాం యొక్క Help ఫైల్ని ఓపెన్ చేయగానే మనకు తెలియకుండానే హార్డ్ డిస్క్ల్ లో కొత్తగా .GID ఎక్స్ టెన్షన్ నేం గల ఒక ఫైల్ ఏదో ఒక లొకేషన్లో క్రియేట్ చేయబడుతుంది. ఆ ఫైల్ మనం ఓపెన్ చేసిన హెల్ప్ ఫైల్ కి పాయింటర్ గా పనిచేస్తుంది. అంటే మరోమారు అదే హెల్ప్ ఫైల్ ని ఓపెన్ చేయబోయేటప్పుడు అది వేగంగా ఓపెన్ చేయబడేలా ఈ పాయింటర్ ఫైల్ ఉపయోగపడుతుందన్న మాట. కొన్ని ఫైళ్లని ఓపెన్ చేసినప్పుడు Documents and Settings\
2, ఆగస్టు 2007, గురువారం
డూప్లికేట్ ఫొటోలు పేరుకుపోయాయా?
నెట్లో వివిధ వెబ్ సైట్లలో ఒకే ఫొటో వేర్వేరు పేర్లతో పొందుపరచబడి ఉంటుంది. ఆల్రెడీ ఒక సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోనే తిరిగి వేరే సైట్ ని బ్రౌజ్ చేసేటప్పుడు కొత్త ఇమేజ్ గా పొరబడి మళ్లీ డౌన్ లోడ్ చేసుకుంటుంటాం. అలాగే డిజిటల్ కెమెరా, స్కానర్ల నుండి స్కాన్ చేసుకున్న ఫొటోలను కూడా హడావుడిగా చాలామంది ఆల్రెడీ సేవ్ చేసిన కాపీనే మళ్లీ హార్డ్ డిస్క్ల్ లో సేవ్ చేస్తుంటారు. ఇలాంటి చర్యల వలన తెలియకుండానే డూప్లికేట్ ఫొటోలు పెరిగిపోతుంటాయి. వందల కొద్దీ ఫొటోలు ఉన్నప్పుడు ప్రతీ దాన్నీ నిశితంగా పరిశీలించి డూప్లికేట్లను ఏరివేయడం చాలా కష్టమైన వ్యవహారం. దీనికి పరిష్కారమే..Unique Filer అనే సాప్ట్ వేర్. ఇది ఫైల్ నేంలను కాకుండా రియల్ గా డిస్క్ లోని వివిధ ఇమేజ్ ఫైళ్లను ఒకదానితో ఒకటి పోల్చి చూసి వాటిలోని ప్రతీ పిక్సెల్ నీ కంపేర్ చేసి ఒకటి కంటే ఎక్కువ ఫైళ్లు ఒకే కంటెంట్ ని కలిగి ఉన్నట్లయితే వాటిని స్ర్కీన్ పై చూపిస్తుంది. మనం రెండింటినీ పరిశీలించి అవసరం లేని దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. కేవలం ఫొటోలను మాత్రమే కాకుండా ఈ సాప్ట్ వేర్ MP3 సాంగ్స్ యొక్క డూప్లికేట్లనీ చాలా వేగంగా వెదికి పట్టుకోగలదు. వీడియో ఫైళ్ల డూప్లికేట్లను కూడా ఇది వెదుకుతోంది. దీన్ని http://www.uniquefiler.com/download.htm అనే వెబ్ పేజీ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మన సైట్‌ని ఎవరెవరు విజిట్ చేస్తున్నారు?
మీకు ఒక వెబ్ సైట్ ఉందనుకుందాం. దానిని నెట్‌పై ఎవరెవరు యూజర్లు విజిట్ చేస్తున్నారు. మీ సైట్‌లోని ఏయే లింకులు ఎక్కువగా క్లిక్ చేయబడుతున్నాయి. ఏయే సెర్చ్ ఇంజిన్‌ల ఆధారంగా మీ సైట్‌ని విజిట్ చేస్తున్నారు, ఏ వెబ్ బ్రౌజర్ ద్వారా మీ సైట్ విజిట్ చెయ్యబడుతోంది. తదితర వివరాలను అందించే సాప్ట్ వేర్ OpenWebScope. ఇది అపరిమిత పరిమాణంలో log ఫైళ్ళని క్రియేట్ చేస్తుంది. HTML రిపోర్ట్ టెంప్లేట్లని అందిస్తుంది. ఒకే సమయంలో వేలకొద్ది సైట్లని విశ్లేషించగలుగుతుంది. దీన్ని http://openwebscope.com సైట్ నుండి పొందవచ్చు.
DVD నుండి MP4కి కన్వర్ట్ చేయడానికి
Apple iPodలు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక PDA ఫోన్లు MP4 అనే వీడియో ఫార్మేట్‌ని సపోర్ట్ చేస్తున్న నేపధ్యంలో DVD ఫార్మేట్‌లో ఉన్న వీడియోని ఈ MP4 ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేయడానికి "Xilisoft DVD to iPod Converter" అనే సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆడియో ఫైళ్ళని MP3, AAC, M4A వంటి పోర్టబుల్ ఆడియో ఫార్మేట్లలోకి కన్వర్ట్ చెయ్యడానికి కూడా ఇది పనికొస్తుంది. దీన్ని http://www.xilisoft.com/downloads/x-dvd-to-ipod-converter.exe అనే వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆల్టర్నేటివ్ కాన్ ఫిగరేషన్ ఎప్పుడు పనికొస్తుందంటే..
Windows XP ఆపరేటింగ్ సిస్టం ని ఉపయోగించే వినియోగదారులు ఏదైనా Network Connectionపై మౌస్ తో రైట్ క్లిక్ చేసి Propertiesని ఓపెన్ చేసినట్లయితే ఆ డైలాగ్ బాక్స్ లో Alternative Configuration అనే మరో విభాగం కూడా పొందుపరచబడి ఉండడాన్ని గమనించవచ్చు. పేరుకు తగ్గట్లే ప్రస్తుతం ఉన్న TCP/IP సెట్టింగులకు ప్రత్యామ్నాయంగా వేరొక సెట్టింగులను కాన్ ఫిగర్ చేయడానికి ఈ విభాగం ఉపయోగపడుతుంది. చాలా అరుదుగా మాత్రమే ఈ అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా.. TCP/IP సెట్టింగులను పొందడానికి సంప్రదించినప్పుడు DHCP సర్వర్ నుండి సరైన రెస్పాన్స్ రానట్లయితే ఆ సందర్భంలో మన వద్ద ఉన్న నెట్ వర్క్ అడాప్టర్ వేరొక మార్గంలో కనెక్టివిటీని పొందడానికి ఈ Alternative Configuration సెట్టింగులు ఉపయోగపడతాయి. మీ IP అడ్రస్ ని మీరు స్వయంగా కాన్ ఫిగర్ చేసి ఉన్నట్లయితే ఈ Alternative Configuration సదుపాయం లభించదు.
Yahoo Mailకి డెస్క్ టాప్ నుండి షార్ట్ కట్ ఇలా!
Yahoo Mailని నేరుగా మీ డెస్క్ర్ టాప్ నుండి యాక్సెస్ చేసుకోగలిగే టెక్నిక్ ఒకటి ఉంది. అదేమిటంటే డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకోండి. వెంటనే వచ్చే డైలాగ్ బాక్స్ లో Command Line లేదా Type the location of the item అనే ప్రదేశం వద్ద ఉండే ఖాళీ బాక్స్ల్ లో..
http://login.yahoo.com/config/login?login=sridharcera&passwd=15920a&.done=http://mail.yahoo.com
(అంతా ఒకే లైన్లో)అనే కమాండ్ ని టైప్ చేయాలి. ఇక్కడ login= అని ఉన్న ప్రదేశంలో sridharcera బదులుగా మీ యాహూ ఐడిని టైప్ చేయండి. passwd= అని ఉన్న ప్రదేశంలో 15920a అనే పాస్ వర్డ్ కి బదులుగా మీ యాహూ మెయిల్ ఐడి యొక్క పాస్ వర్డ్ ని టైప్ చేయండి. ఇప్పుడు Next బటన్ క్లిక్ చేసి ఆ షార్ట్ కట్ ని ఏదో ఒక పేరుతో డెస్క్ టాప్ పై సేవ్ చేయండి. ఇకపై సింపుల్ గా డెస్క్ట్ టాప్ పై ఉండే ఆ షార్ట్ కట్ ని డబుల్ క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ లోకి వెళతారు.
1, ఆగస్టు 2007, బుధవారం
Q image ఎలా ఉపయోగించాలి ?
ఫోటోగ్రఫి రంగంలో ఉన్నవారు కస్టమర్లకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ప్రింటర్ ద్వారా తీసి ఇవ్వవలసి వచ్చినప్పుడు పేజ్‌మేకర్, వర్డ్ వంటి డాక్యుమెంట్లలో ఒకే ఫొటోని పేజీలో వీలైనన్ని కాపీలు వచ్చేటట్లు అమర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే Qimage సాప్ట్ వేర్ మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే వివిధ సైజ్‌లు గల పేజీల్లో మీకు నచ్చిన విధంగా ఫోటోలను పలు కాపీలు అమర్చుకోవడమే కాకుండా అవసరం అయితే Noise filtering, red-eye removal, rotation వంటి ఎడిటింగ్ టూల్స్‌ని సైతం ఫోటోషాప్ వంటి సాఫ్ట్‌వేర్ల జోలికి వెళ్ళకుండానే నేరుగా Qimage లో అప్లై చేసుకోవచ్చు. పలు ఫైల్‌టైప్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది.
ఒకే సైజ్‌లో పలు ఇమేజ్‌లను ప్రింట్ చేయడం...
మెయిన్ విండో పైభాగంలో ఉండే Optimal అనే బటన్‌ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయడంవల్ల Qimage పేపర్లో సాధ్యమైనంత ఎక్కువ ఫోటోలు పట్టేటట్లు జాగ్రత్త తీసుకుంటుంది. మెయిన్ విండోలో కుడిచేతివైపు Prints panelలో ఉండే Image Fitting అనే బటన్‌ని క్లిక్ చేయండి. సరైన ప్రింట్‌సైజ్‌లు పొందటానికి పేజీలోని కొన్ని ఇమేజ్‌లను క్రాప్ చెయ్యమని ఈ బటన్‌ని ప్రెస్ చేయడం ద్వారా చెప్పినట్లు అవుతుంది. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ పైభాగంలో Select Folder అనే బటన్‌ని క్లిక్ చేసి మీ ఇమేజ్‌లు ఉన్న ఫోల్డర్‌ని ఎంచుకోండి. వెంటనే క్రిందిభాగంలో ఆ ఫోల్డర్‌లోని ఇమేజ్‌ల ధంబ్‌నెయిల్స్ ప్రత్యక్షమవుతాయి. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఫోటోల్ని సెలెక్ట్ చేసుకుని కుడిచేతివైపు Prints అనే ప్రదేశం వద్ద 4.00x6.00 అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఒక వేళ మీరు కావాలంటే వేరే సైజ్‌నీ ఎంచుకోవచ్చు. దీనితో ప్రివ్యూ ప్రదేశంలో పేజీలో ఇమేజ్‌లు వరుసగా అమర్చబడి కనిపిస్తాయి. ఇప్పుడు చివరిగా Sort Prints అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ ప్రింట్ అయిన తర్వాత పేపర్ నుండి వేర్వేరు ప్రింట్‌ల్ని కట్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా ఏర్పాటు చేస్తుంది. చివరిగా టూల్‌బార్‌పై Print బటన్ క్లిక్ చేయాలి.
వేర్వేరు సైజ్‌ల్లో వేర్వేరు ఫోటోలను అమర్చుకోవడానికి..
ఇప్పుడు మనం 7x5, 5x3, 3x2 అనే మూడు వేర్వేరు సైజ్‌ల్లో వేర్వేరు ఇమేజ్‌లను Qimage ద్వారా ఒకే పేజీలో అమర్చుకోవడం ఎలాగో చూద్దాం. పైన చెప్పిన మాదిరిగానే Optimal అనే బటన్‌ని ముందు క్లిక్ చేయండి. అలాగే Prints Panel లోని Image Fitting అనే బటన్‌ని సైతం క్లిక్ చేయండి. ఇప్పుడు Select Folder బటన్ ద్వారా మీ సిస్టమ్‌లో ఇమేజ్‌లు ఉన్న ఫోల్డర్‌ని బ్రౌజ్ చేయండి. ఇప్పుడు ముందుగా 7x5 సైజ్‌లో అమర్చదలుచుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాని థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకుని కుడిచేతివైపు print panelలో 5x7 అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ ప్రివ్యూ బాక్స్‌లో పైభాగంలో దర్శనమిస్తుంది. ఇప్పుడు 5x3గా అమర్చదల్చుకున్న ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుని 3x5 అనే బటన్‌ని క్లిక్ చేస్తే రెండవ ఇమేజ్ కూడా ప్రివ్యూ పేజీలోకి వచ్చి చేరుతుంది. ఇక చివరిగా 3x2 సైజ్‌లో అమర్చదలుచుకున్న ఇమేజ్ ధంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకుని print panel లో 2x3 అనే బటన్‌ని క్లిక్ చేస్తే మూడవ ఇమేజ్ కూడా ప్రివ్యూలోకి వస్తుంది. ఇప్పుడు sort prints బటన్‌ని క్లిక్ చేసి చివరిగా print బటన్‌ని క్లిక్ చేస్తే డిఫాల్ట్ ప్రింటర్ నుండి ఆ ఫోటోలు పేపర్‌పై ప్రింట్ చెయ్యబడుతాయి.
ఒకే ఇమేజ్‌ని వేర్వేరు సైజ్‌ల్లో అమర్చుకోవడానికి...
మొట్టమొదట prints ప్యానెల్‌లోని image fitting బటన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు Select Folder ద్వారా ఇమేజ్‌లు ఉన్న ఫోల్డర్‌లోకి వెళ్ళి క్రింద కనిపించే థంబ్‌నెయిల్స్ నుండి ప్రస్తుతం మీరు వేర్వేరు సైజ్‌ల్లో ఎ ఫోటోనైతే అమర్చదలుచుకున్నారో ఆ ఇమేజ్‌ని డబుల్‌క్లిక్ చేస్తే అది క్యూ పేజీలోకి వచ్చి చేరుతుంది. ఇప్పుడు ప్రివ్యూ బాక్స్‌లో కనిపించే ఆ ఇమేజ్‌ని డబుల్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ పెద్దదిగా కనిపిస్తూ కుడిచేతివైపు Adjust, levels వంటి టాబ్‌లు కలిగిన ప్యానెల్ ఒకటి ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఆ ప్యానెల్‌లో Image effects క్రింద కనిపించే Crop Wizard అనే బటన్‌ని క్లిక్ చేయండి. వెంటనే స్క్రీన్‌పై Crop Wizard పేరిట ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమై వేర్వేరు సైజ్‌లు కనిపిస్తాయి. భవిష్యత్తులో ఈ ఇమేజ్‌ని ప్రింట్ చేయదలుచుకున్నప్పుడు మనం ఏయే సైజ్‌లలో ప్రింట్ చెయ్యదలుచుకున్నామో ఆయా సైజ్‌లను టిక్ చేసి పెట్టండి. అదే విండోలో పస్తుతం మనం ఎడిట్ చేస్తున్న ఇమేజ్‌కి Landscape, Portrait Cropping లో ఏది సూటబుల్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ఇమేజ్‌ని చూస్తే ఏ తరహ క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నది మనకే అర్ధమవుతుంది. అలాగే ఇమేజ్‌లోని Top/Bottom, Left/Right అంచులలో ఏవి మనకు ముఖ్యమైనవో అదే డైలాగ్‌బాక్స్‌లో క్రింది భాగంలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా డైలాగ్‌బాక్స్‌లో కనిపించే Done అనే బటన్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం Crop Wizard డైలాగ్‌బాక్స్‌లో సెలెక్ట్ చేసుకున్న సైజ్‌లలో ఆ ఇమేజ్ ప్రింట్ చేయబడుతుంది.
ఆన్ లైన్లో కరెంట్, వాటర్ బిల్లుల వంటివి ఎలా చెల్లించాలి?
ఇంటర్నెట్ కనెక్షన్, ICICI, HDFC, UTI వంటి కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ లు ఉన్నవారు http://www.esevaonline.com/ అనే వెబ్ సైట్ ద్వారా కరెంట్, వాటర్, మున్సిపల్ టాక్స్ వంటి వివిధ రకాలైన బిల్లులను చెల్లించే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంగా వ్యక్తిగతంగా నేను ఈ సర్వీసుని వాడుతున్నాను. దీనికిగాను ముందుగా పై వెబ్ సైట్లోకి వెళ్లి కొత్తగా ఓ యూజర్ నేం, పాస్ వర్డ్ లను రిజిస్టర్ చేసుకుని ఉచిత అకౌంట్ ని పొందాలి. ఆ తర్వాత మీ యూజర్ నేం ద్వారా రెగ్యులర్ గా ఏయే బిల్లులను చెల్లించదలుచుకున్నారో ఆయా యుటిలిటీ సర్వీసులను ఎంచుకోవాలి. ఉదా:కు. కరెంట్ బిల్లులను చెల్లించదలుచుకుంటే TRANSCOని ఎంచుకోవాలి. వెంటనే మీ సర్వీస్ నెంబర్, అడ్రస్ వివరాలు తెలుపమంటూ ఓ ఫారం వస్తుంది. ఇకపై ప్రతీనెలా ఆ సర్వీస్ నెంబర్ ని ఎంచుకుని చెల్లించదలుచుకున్న మెత్తాన్ని తెలియజేసి,Payment అప్షన్ ద్వారా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ కంపెనీని ఎంచుకుని Card Type, Card Number, Expiry Date, Customer Name వంటి మీ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన వివరాలను అందిస్తే మీ క్రెడిట్ కార్డ్ నుండి చెల్లింపు జరుపబడుతుంది. వెంటనే Print ఆప్షన్ ద్వారా రసీదుని ప్రింట్ చేసుకుని భద్రపరుచుకుంటే సరిపోతుంది. ఆడియో వివరణతో కూడిన పై వీడియోని చూడండి, వివరంగా అర్థమవుతుంది.