9, ఏప్రిల్ 2008, బుధవారం

కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడంమీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి ఇంటర్నెట్ ద్వారా వారు Orkutలో స్క్రాప్‍లు చేయడానికో , ఐడిల్ బ్రెయిన్‍లో వాల్ పేపర్లు వెదకడానికో టైమ్ వేస్ట్ చేస్తున్నారనుకోండి. ఆయా సైట్లు మీ కంఫ్యూటర్‍లో ఓపెన్ కాకుండా నిరోధించవచ్చు. దీనికి ఎలాటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. మీ హార్డ్ డిస్క్ లో C:\Windows\System32\drivers\etc అనే ఫోల్డర్ లోకి వెళ్ళి HOSTS అనే ఫైల్‍ని మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Open అనే ఆప్షన్ ఎంచుకుని Notepad తో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్‍లో 127.0.0.1 local host అనే లైన్ క్రింద.. కొత్తగా 127.0.0.2 అనే అడ్రస్‍ని టైప్ చేసి దాని ఎదురుగా పై చిత్రంలోని విధంగా ఏ సైట్ అయితే ఓపెన్ కాకుండా నిరోధించాలనుకున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేయండి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అలా వేర్వేరు సైట్ల అడ్రస్‍లను టైప్ చేసి ఆ ఫైల్‍ని సేవ్ చేయండి. దీంతో ఇకపై ఆయా వెబ్ సైట్లు ఓపెన్ అవకుండా బ్లాకవుతాయి.

4 కామెంట్‌లు:

దైవానిక చెప్పారు...

మంచి విషయం చెప్పరు. ఇక నా రూమ్ మేట్ అయిపొయడంతే...

అజ్ఞాత చెప్పారు...

Sridhar గారు.. మీరు చెప్పినట్లు ట్రై చేశాను..కాకి కొన్ని వెబ్ సైట్ లు బ్లాక్ అవ్వడము లేదు.. ఇంకా వస్తూనె వున్నాయి.. ఉదహరణకి ": www.telugulo.com, www.koodali.org యిలా కొన్ని వస్తూనె వున్నాయి..ఎందుకని యిలా???

అజ్ఞాత చెప్పారు...

హాయ్ శ్రీధర్..
నేను ఇప్పూడే చాట్ రూం లో కి వెల్లి నా సందేహ నివ్రుత్తి చేసుకున్నాను..మధు మరియు జ్యోతి గార్లు సహాయం చేశారు..వెబ్ లాకర్ డౌన్ లోడ్ చేసుకున్నాను.. నా సమస్యకి పరిష్కారమ్ లభించింది..నెనర్లు..

Sudheer చెప్పారు...

If you have time to explain the reason for these kind things to work the way they are supposed to work then it would be really great.
This blog still is a very good contribution.